iDreamPost
android-app
ios-app

ఆ కోనేరులో పుణ్య స్నానం చేస్తే పాపవిముక్తి!.. సర్టిఫికేట్ కూడా ఇస్తున్న దేవాలయం!

పుణ్య స్నానాలపై హింధువులకు ఉన్న విశ్వాసం అలాంటిది. అయితే ఇక్కడ గంగా జలంలో స్నానాలు చేసినంత మాత్రాన చేసిన పాపం పోతుందా అని విమర్శించే వారు కూడా ఉంటారు.

పుణ్య స్నానాలపై హింధువులకు ఉన్న విశ్వాసం అలాంటిది. అయితే ఇక్కడ గంగా జలంలో స్నానాలు చేసినంత మాత్రాన చేసిన పాపం పోతుందా అని విమర్శించే వారు కూడా ఉంటారు.

ఆ కోనేరులో పుణ్య స్నానం చేస్తే పాపవిముక్తి!.. సర్టిఫికేట్ కూడా ఇస్తున్న దేవాలయం!

పంచభూతాల్లో ఒకటైన నీరు అత్యంత పవిత్రమైనది. భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగను దివి నుంచి భువికి తీసుకొచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంతటి ప్రత్యేకమైన గంగా జలాన్ని భక్తి శ్రద్దలతో పూజిస్తుంటారు ప్రజలు. పాప విముక్తి కోసం నదులల్లో స్నానమాచరించి తమను పాపవిముక్తులను చేయమని గంగను వేడుకుంటుంటారు భక్తులు. ఈ క్రమంలోనే నదులల్లో పుష్కర స్నానాలకు జనాలు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటారు. ఇదే కాక కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి అస్థికలను పుణ్య నదుల్లో కలిపి వారికి సద్గతులు కలగాలని గంగను వేడుకుంటారు.

పుణ్య స్నానాలపై హింధువులకు ఉన్న విశ్వాసం అలాంటిది. అయితే ఇక్కడ గంగా జలంలో స్నానాలు చేసినంత మాత్రాన చేసిన పాపం పోతుందా అని విమర్శించే వారు కూడా ఉంటారు. కాగా ఓ దేవాలయంలోని పూజారులు దేవాలయంలో ఉన్న కోనేరులో స్నానం చేస్తే ఖచ్చితంగా పాపం పరిహారమవుతోందని చెబుతున్నారు. దానికి రుజువుగా సర్టిఫికేట్ ను కూడా అందిస్తున్నారు. ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడ ఉంది? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రాజస్థాన్‌లో ఉన్న గౌతమేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉన్న కోనేరులో పుణ్య స్నానం చేస్తే పాపాలకు పరిహారం లభిస్తుందని చెబుతున్నారు పూజారులు.ఈ ఆలయం జైపూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. పుష్కరిణిలో స్నానామాచరిస్తే మీ పాపం పరిహారమవుతోందని ఘంటాపథంగా చెబుతున్నారు. దీనికి రుజువుగా సర్టిఫికెట్ కూడా అందజేస్తామని, దీని కోసం రూ.12 చెల్లించాలని వెల్లడిస్తున్నారు. ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఉన్న ఆలయ పరిసరాల్లోని కోనేరు వాగడ్‌ హరిద్వార్‌గా పేరు గాంచింది. ఇక్కడ ఉన్న మందాకిని కుండ్‌లో పవిత్ర స్నానం చేసిన 250 నుంచి 300 మందికి మాత్రమే పాప విముక్తి సర్టిఫికేట్లను దేవాలయం అందజేస్తోంది.

ఏదైనా జంతువును అనుకోకుండా లేదా ప్రయత్నపూర్వకంగా చంపినవాళ్లు, కుల లేదా వర్గ బహిష్కరణకు గురైన వ్యక్తులు ఆ కుండ్లో స్నానం చేసి పాపవిముక్తి సర్టిఫికెట్ పొందుతుంటారు. దానిని పంచాయతీ పెద్దలకు చూపించి, ఎటువంటి పాప భారాన్ని మోయడంలేదని నిరూపించుకుని శిక్ష నుంచి బయటపడుతుంటారు. దీని వెనకాల గల కథ ఏంటంటే గోహత్యాపాతకం నుంచి విముక్తి కోసం గౌతమ మహర్షి మందాకిని కుండ్‌లోనూ స్నానం చేశారని, అదే ప్రాంతంలో శివలింగం ఆవిర్భవించిందని స్థల పురాణం చెబుతోంది. స్థానికులు తమ కుటుంబసభ్యుల చనిపోతే వారి చితాభస్మాన్ని మందాకిని కుండ్లోనూ నిమజ్జనం చేస్తారని, అందుకే ఈ క్షేత్రాన్ని హరిద్వార్ ఆఫ్ వాగడ్గా పిలుస్తారని ఓ పూజారి తెలిపారు. ఇది తెలిసిన నెటిజన్లు ఇలాంటి దేవాలయం కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఏకంగా పాపవిముక్తి కలుగుతుందని సర్టిఫికేట్ కూడా ఇస్తుండడంపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి