iDreamPost
android-app
ios-app

ఇదేమి హోలీరా బాబు.. స్నేహితుడిని నిప్పుల్లో నెట్టి పైశాచిక ఆనందం!

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అన్న రోజులు నుండి అవసరాలకే ఫ్రెండ్ షిప్ అన్నట్లుగా తయారయ్యింది సమాజం. తాగి తందనాలు ఆడటానికి, అప్పు పుట్టించుకోవడానికి మినహాయించి.. మిగిలిన విషయాల్లో స్నేహితులు అవసరం ఉండటం లేదు కొందరికీ.

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అన్న రోజులు నుండి అవసరాలకే ఫ్రెండ్ షిప్ అన్నట్లుగా తయారయ్యింది సమాజం. తాగి తందనాలు ఆడటానికి, అప్పు పుట్టించుకోవడానికి మినహాయించి.. మిగిలిన విషయాల్లో స్నేహితులు అవసరం ఉండటం లేదు కొందరికీ.

ఇదేమి హోలీరా బాబు.. స్నేహితుడిని నిప్పుల్లో నెట్టి పైశాచిక ఆనందం!

ఈ బంధాలను అన్ని భగవంతులు సృష్టించినవే. కానీ మనం మాత్రమే ఏర్పాటు చేసుకునే రిలేషన్ ఫ్రెండ్ షిప్. అందుకే ఆపదలో అవసరాన్ని, బాధలో మనసుని తెలుసుకుని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు అంటారు. మంచి స్నేహితుడు ఉండటం ఓ వరంగా భావిస్తుంటారు. మనలోని లోపాల్ని, కోపాల్ని భరించి.. సరియైన దారిలో నడిపించే వ్యక్తే స్నేహితుడు. కానీ ఈ రోజుల్లో ఫ్రెండ్ అన్న పదానికి అర్థం మారిపోయింది. అవసరానికే స్నేహితుడు అన్నట్లుగా తయారైంది సమాజం. అవసరం లేకుంటే పక్కనపెట్టేస్తున్నారు. కేవలం తాగి తందనాలు ఆడటానికే కొన్ని స్నేహాలు గుర్తుకు వస్తుంటాయి.  ఇది ఇలాంటి ఓ స్నేహమే ప్రాణాల మీదకు తెచ్చింది. ఇంతకు ఏం జరిగిందంటే..?

సోమవారం దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా హోలీక దహనం చేయగా.. స్నేహితుడ్ని నిప్పుల్లో తోసేశారు పైశాచిక ఆనందాన్ని పొందారు మిగిలిన ఫ్రెండ్స్. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. .నోయిడాలోని ఓ ప్రాతంలో హోలీ వేడుకలు జరుగుతున్నాయి. అక్కడ స్థానికులు హోలిక దహనం చేశారు. మంటలు చల్లారిపోయి.. నిప్పులు ఉన్నాయి. అంతలో అక్కడకు కొంత మంది స్నేహితుల వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అంతలో ఆ స్నేహితుల గుంపు .. తమ ఫ్రెండ్ ఒకరిని ఎత్తి నిప్పుల్లో తోసేశారు. దీంతో భయపడ్డ అతడు వెంటనే.. నిప్పుల గుండం నుండి బయట పడ్డాడు. ఈ ఘటనలో అతడి పాదాలకు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి.

ప్రస్తుతం కాలిన గాయాలతో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా, ఈ ఘటనపై యుపి పోలీసులు మౌనంగా ఉండటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘బిస్రఖ్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు చేయగా, స్నేహితులు సరదాగా అతడ్ని తోశారని, ఇది ఎవ్వరూ చేయలేదని, ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు అందలేదు’ అంటూ చెప్పుకొచ్చారు పోలీసులు. దీనిపై సీరియస్ అయిన సోషల్ మీడియా సైనికులు.. ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ.. ఇది అబద్దం అని నిరూపించగలరా అంటూ మండిపడుతున్నారు. నలుగురైదుగురు ఓ వ్యక్తిని మంటల్లో తోసేస్తే కేసు ఎందుకు నమోదు చేయడం లేదని, సుమోటోగా కేసు స్వీకరించాలంటూ కోరుతున్నారు. స్నేహం ముసుగులో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పేర్కొంటున్నారు.