iDreamPost
android-app
ios-app

ఓటర్లకు గుడ్ న్యూస్.. సినిమా టికెట్లు ఫ్రీగా అందిస్తున్న ఎన్నికల అధికారులు!

  • Published May 03, 2024 | 5:23 PM Updated Updated May 03, 2024 | 5:23 PM

మరికొన్ని రోజుల్లో ఎన్నికల పండుగ సందర్భంగా ఎన్నికల అధికారులు ఓటర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. సినిమా చూసేందుకు మూవీ టికెట్లు ఫ్రీగా ఇస్తామని అధికారులు వెల్లడించారు. ఓటింగ్ శాతం పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మరికొన్ని రోజుల్లో ఎన్నికల పండుగ సందర్భంగా ఎన్నికల అధికారులు ఓటర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. సినిమా చూసేందుకు మూవీ టికెట్లు ఫ్రీగా ఇస్తామని అధికారులు వెల్లడించారు. ఓటింగ్ శాతం పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఓటర్లకు గుడ్ న్యూస్.. సినిమా టికెట్లు ఫ్రీగా అందిస్తున్న ఎన్నికల అధికారులు!

ఎప్పుడూ లేని విధంగా ఓటర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు.. ప్రజలను పోలింగ్ బూత్ లకు రప్పించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు అవగాహన కార్యక్రమాలతో పాటు ప్రయోజనాలను కల్పిస్తూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఓటర్లకు ఉచితంగా మూవీ టికెట్లు అందించాలని నిర్ణయించుకుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. ప్రతి ఒక్కరితో ఓటు వేయించేలా ప్రభావితం చేసే విధంగా పలు ఆఫర్స్ ని ప్రవేశపెడుతోంది.

ఇప్పటికే పోలింగ్ బూత్ కి వచ్చి ఓటు వేసిన వారికి టీవీలు, డైమండ్ రింగులు ఇస్తామని చెప్పడం.. పలు ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకొచ్చి బస్ టికెట్లపై డిస్కౌంట్లు ప్రకటించడం, పోలింగ్ రోజున ర్యాపిడో ఉచితంగా రైడ్ చేసే అవకాశం కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. చేపడుతున్నారు. తాజాగా ఓటర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది ఎన్నికల సంఘం. మూవీ టికెట్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది.  మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోక్ సభ నియోజకవర్గానికి ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇంటింటికీ ఓటర్ స్లిప్పులను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఆ నియోజకవర్గంలోని మే 4 నుంచి 8వ తేదీ వరకూ జిల్లా ఎన్నికల అధికారులు ఓటర్ స్లిప్పులను ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు.

అయితే 8వ తేదీ లోపు ఎవరికైతే ఓటర్ స్లిప్పులు రాలేదో ఆ ఓటర్లు తమకు ఫిర్యాదు చేయాలని ఇండోర్ అధికారులు కోరారు. వాట్సాప్ లేదా ఫోన్ కాల్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని ఇండోర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆశిష్ సింగ్ తెలిపారు ఎవరైతే ఓటర్ స్లిప్పు రాలేదని ఫిర్యాదులు చేస్తారో వారికి ఇండోర్ నగరంలోని ఏ మూవీ థియేటర్ లో అయినా సరే సినిమా చూసేందుకు రెండు సినిమా టికెట్లను ఉచితంగా ఇస్తామని వెల్లడించారు. వీటితో పాటు ఓటర్ స్లిప్ కూడా ఇస్తామని అన్నారు. ఓటర్ స్లిప్పులు ఇవ్వని సంబంధిత అధికారులపై చర్యలు కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. మే 10వ తేదీ వరకూ ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎన్నికల అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.