Free Bus Journey: ఫ్రీ బస్సు పథకంతో భారీ నష్టం.. టికెట్​ ధరల పెంపునకు ఏర్పాట్లు..

Free Bus Journey-Bus Fare Hike: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల భారీ నష్టం వాటిల్లుతుందని.. టికెట్‌ రేట్లు పెంచాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ఆ వివరాలు..

Free Bus Journey-Bus Fare Hike: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల భారీ నష్టం వాటిల్లుతుందని.. టికెట్‌ రేట్లు పెంచాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ఆ వివరాలు..

ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలవుతోంది. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ఆయా రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తుండటం.. ప్రజల నుంచి మంచి ఆదరణ రావడంతో.. తెలంగాణ ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌ పార్టీ.. తమను గెలిపిస్తే.. అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అన్నట్లుగానే.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే.. తెలంగాణలో ఫ్రీ బస్‌ జర్నీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ స్కీం అమలైన నాటి నుంచి మన దగ్గర బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. మగవాళ్లు తమకు సీట్లే దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రద్దీకి తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఉచిత బస్సు పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఆ వివారలు..

ఉచిత బస్సు పథకం వల్ల ఆర్టీసీ సంస్థకు తీవ్రమైన నష్టాలు వాటిల్లుతున్నాయని.. అందుకే త్వరలోనే టికెట్‌ ధరలు పెంచుతారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టికెట్‌ రేట్ల పెంపు మన దగ్గర కాదు.. కర్ణాటకలో. కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంతో కేఎస్​ఆర్​టీసీ (కర్ణాటక స్టేట్​ రోడ్​ ట్రాన్స్​పోర్ట్​ కార్పొరేషన్​) కి భారీ నష్టాలు వాటిల్లుతున్నాయట.

గత మూడు నెలల్లో నష్టాలు రూ. 295 కోట్లకు చేరాయి. ఫలితంగా టికెట్​ ధరలను పెంచాలని డిమాండ్​లు పెరుగుతున్నాయి. ఎన్నికల హామీని నెరవేర్చుతూ.. కర్ణాటకవ్యాప్తంగా శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలను అందిస్తోంది. ఇది కేఎస్​ఆర్​టీసీని దెబ్బతిస్తోంది. అందుకే టికెట్​ ధరలను కనీసం 15-20శాతం వరకు పెంచాలని కేఎస్​ఆర్​టీసీ వర్గాలు, ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

ఈ సందర్భంగా కేఎస్‌ఆర్‌టీసీ ఎండీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘‘బస్సు టికెట్‌ రేట్ల పెంపు విషయంపై శుక్రవారం ఓ బోర్డు మీటింగ్​ జరిగింది. బస్సు టికెట్​ ధరలు పెంచాలని తీర్మానించాము. ఈ విషయాన్ని సీఎం సిద్ధరామయ్య దృష్టికి తీసుకెళతాము. ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్​ నేపథ్యంలో ద్రవ్యోల్బణంతో పోటీపడాలంటే టికెట్​ ధరలు పెంచక తప్పదు. బస్సు సేవలు లేకపోతే ఒక ప్రాంతం మొత్తం రవాణా సేవలను కోల్పోతుంది. శక్తి పథకం వల్ల గత మూడు నెలల్లో మాకు రూ. 295కోట్ల నష్టం వచ్చింది. అందుకే టికెట్​ ధరలను కనీసం 15 నుంచి 20 శాతం వరకు పెంచాలని సీఎంకి విజ్ఞప్తి చేశాము. ఇది పెండింగ్​లో ఉంది’’ అని చెప్పుకొచ్చారు. అంతేకాక ఈ తరహా పథకాలతో సంస్థలోని సిబ్బందిపై ప్రభావం పడుతోందని, 2020 నుంచి వారి జీతాలను సవరించలేదని శ్రీనివాస్​ పేర్కొన్నారు.

కర్ణాటకలో ఈ స్కీమ్​ విజయవంతం​ అవ్వడంతో, తెలంగాణ ఎన్నికల వేళ ఇదే హామీ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. దాంతో గతేడాది అనగా 2023, డిసెంబర్​లో జరిగిన ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వాన్ని స్థాపించిన అనంతరం తెలంగాణలో సైతం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసింది. టీఎస్​ఆర్​టీసీ సైతం భారీ నష్టాల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Show comments