Rubans: అనాథగా రూ.300తో రోడ్డున పడ్డ ఓ చిన్నారి.. ఇప్పుడు వందల కోట్లకి అధిపతి!

కన్నతల్లి వదిలేసింది.. సవతితల్లి, తండ్రి ఇంటి నుంచి గెంటేశారు. ఆ సమయంలో ఓ బాలిక వయసు 14 ఏండ్లు.. ముప్పయ్‌ ఏండ్లు గడిచాయి.. రూ.300తో రోడ్డన పడ్డ ఆ చిన్నారి. నేడు వందల కోట్లకు అధిపతిగా మారింది.

కన్నతల్లి వదిలేసింది.. సవతితల్లి, తండ్రి ఇంటి నుంచి గెంటేశారు. ఆ సమయంలో ఓ బాలిక వయసు 14 ఏండ్లు.. ముప్పయ్‌ ఏండ్లు గడిచాయి.. రూ.300తో రోడ్డన పడ్డ ఆ చిన్నారి. నేడు వందల కోట్లకు అధిపతిగా మారింది.

జీవితానికి అసలు  అర్థం నేర్పేది.. మనకు ఎదురయ్యే కష్టాలు మాత్రమే. సుఖంగా ఉన్నప్పుడు జీవితం  విలువ ఏమి తెలియదు, అదే కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే అసలు జీవితం అంటే ఏమిటి, మన గమ్యం ఏమిటో బోధపడుతుంది. అయితే చాలా మంది తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలకు కుంగిపోతుంటారు. కానీ కొందరు మాత్రం కష్టాలు పెరిగే కొద్ది జీవితంలో ఉన్నత స్థితికి చేరాలనే బలమైన కోరిక మరింత పెరుగుతుంది. అలానే ఓ యువతి కూడ సొంత కుటుంబ సభ్యుల నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. కేవల రూ.300తో రోడ్డున పడ్డ ఆమె..నేడు వందల కోట్లకు అధిపతిగా మారింది. మరి.. ఆమె విజయగాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మహారాష్ట్రలోని ముంబై ప్రాంతానికి చెందిన చీనూ కాలా 14 ఏళ్ల వయస్సులో పడిన కష్టం..నేడు 30ఏళ్ల వయస్సులో ఎంతో సక్సెస్ చూసి సంతోషం వ్యక్తం చేస్తుంది. చీనూ కాలాకు 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు సొంత తల్లి.. చీనూ, భర్తను వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. తనను ప్రేమగా చూసుకోవాల్సిన అమ్మే..తనను వదిలేసి వెళ్లిపోవడంతో చీనూ చాలా బాధ పడింది. ఇంతలోనే ఎంతోకొంతగా చూసుకుంటున్న తన తండ్రి కూడా మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి చీనూ నరకం అంటే ఏమిటో కనపడింది.

చివరకు సవతి తల్లి, సొంత తండ్రి అర్థరాత్రి సమయంలో బయటకు నెట్టేసి తలుపు వేశారు. అప్పుడు చీనూ వయసు 14 ఏండ్లు. ఆ చిన్నారి చీను తన దురదృష్టాన్ని నిందించుకుంటూ.. భారంగా అడుగులు వేసింది. ఇదే సమయంలో ఆమెలో భయం కంటే ఏదో తెలియని కసి పెరిగింది. తను ఛీదరించుకునే వారే కుళ్లుకునే స్థాయికి చేరుకోవాలని నిర్ణయించుకుంది. ఆలోచన అయితే బాగానే ఉంది కానీ చేతిలో చూస్తే రూ.300 మాత్రమే ఉన్నాయి. కానీ, మొండితనాన్నే ఆభరణంగా చేసుకుంది. చాలా రోజులు ముంబయి వీధులు, రైల్వేస్టేషన్‌లే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవితాన్ని గడిపింది. మరో వారం గడిచిన తరువాత చీనూ ఓ మహిళ కంటపడింది. సొంత అమ్మ కంటే మిన్నగా ఆదరించింది. ఓ కంపెనీలో చీనూకు ఉద్యోగం ఇప్పించింది.

ఇంటింటికీ వెళ్లి నిత్యావసర వస్తువులు అమ్మడం పని. ఎన్ని ఎక్కువ అమ్మితే అంత కమీషన్‌ వచ్చేది. ఇంటింటికీ తిరగడం వల్ల పెరిగిన పరిచయాలతో మూడేళ్ల తర్వాత సూరత్‌లో జాబ్ ఉందని తెలిసింది. సూరత్‌లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే అమిత్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఉత్తర్‌ప్రదేశ్ చెందిన అతను ఎంబీయే చదివాడు. వారిద్దరు 2004లో పెండ్లి చేసుకున్నారు. పలు ఉద్యోగాలు చేయడంతో చీనూకు ఆర్థిక పాఠాలూ ఒంటబట్టాయి. చీనూ 2007లో మిసెస్‌ ఇండియా అందాల పోటీలో పాల్గోని టాప్‌ 10లో నిలిచింది. అనంతరం  ఫ్యాషన్ డిజైన్ పై మెలుకువలు నేర్చుకుంది.

 

బెంగళూరులో ఓ మాల్‌లో చిన్న మడిగ అద్దెకు తీసుకొని ‘రుబన్స్‌’ జువెలరీ ప్రారంభించింది. అనంతి కాలంలోలనే వారు స్థాపించిన రుబన్స్ బాగా అభివృద్ధి చెందింది. 2017 తర్వాత ఆన్‌లైన్‌ మార్కెట్ లోనూ ‘రుబన్స్‌’ మెరుపులు మొదలయ్యాయి. ఇప్పుడు రోజూ వారు 2,500 వరకు ఆర్డర్లు అందుకుంటున్నారు. తమ ఉత్పత్తుల ధరలు రూ.500 నుంచి రూ.10వేల వరకు ఉన్నాయని చీను తెలిపింది. ప్రస్తుతం తమ వార్షిక టర్నోవర్‌ రూ.100 కోట్లకు చేరుకుందని తెలిపింది. అలా చీకట్లో కూడా వెలుగును పుట్టించిన చీనూ కాలా ఎందరికో ఆదర్శం. మరి.. మహిళ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments