iDreamPost
android-app
ios-app

గొర్రెల కాపరి నుంచి స్కూల్ అసిస్టెంట్ వరకు ఓ యువకుడి సక్సెస్ స్టోరీ!

  • Published Oct 10, 2024 | 12:22 PM Updated Updated Oct 10, 2024 | 12:22 PM

A Shepherd Success Story: కృషి, పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధిస్తారని ఎంతోమంది నిరూపించారు. కష్టపడి చదివి పేదరికాన్ని జయించి ఉన్నత శిఖరాలకు చేరుకున్న ఎంతోమంది సక్సెస్ స్టోరీలను చూస్తూనే ఉన్నాం. అలాంటి ఓ యువకుడి సక్సెస్ స్టోరీ మీకోసం.

A Shepherd Success Story: కృషి, పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధిస్తారని ఎంతోమంది నిరూపించారు. కష్టపడి చదివి పేదరికాన్ని జయించి ఉన్నత శిఖరాలకు చేరుకున్న ఎంతోమంది సక్సెస్ స్టోరీలను చూస్తూనే ఉన్నాం. అలాంటి ఓ యువకుడి సక్సెస్ స్టోరీ మీకోసం.

  • Published Oct 10, 2024 | 12:22 PMUpdated Oct 10, 2024 | 12:22 PM
గొర్రెల కాపరి నుంచి స్కూల్ అసిస్టెంట్ వరకు ఓ యువకుడి సక్సెస్ స్టోరీ!

ఆ ఇంట్లో ప్రతిరోజూ కూలీ పని చేస్తే కానీ పూట గడవడం కష్టం. నిరుపేద ఇంట్లో పుట్టి తన పేదరికం గురించి బాధపడకుండా మొక్కవోని ధైర్యంతో ఎంతో కష్టపడి చదివాడు. ఓ వైపు తల్లిదండ్రుల కష్టం తెలుసుకొని కూలీ పనులకు వెళ్లేవాడు. మరోవైపు గొర్ల కాపరిగా కొనసాగాడు.  చిన్నప్పటి నుంచి పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం సంపాదించి సమాజంలో అన్యాయాలను రూపమాపాలని భావించాడు. అందు కోసం పేదరికాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా చదవుతూ వచ్చాడు.  గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఎస్సై పోస్టుకు ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. అదే సమయంలో టెట్‌లో విజయం సాధించి డీఎస్సీ రాసి ఫస్ట్ అటెంప్ట్ లోనే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ సాధించి అందరిచే ఔరా అనిపించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన కోరె కుమార్  తన మొదటి  ప్రయత్నంలోనే  స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ సాధించి అందరిచే శెభాష్ అనిపించుకున్నాడు. కొడుకు సాధించిన విజయానికి కుమార్ తల్లిదండ్రులు కమల, బీరయ్య‌తో పాటు కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లువిరిశాయి. 4వ తరగతి వరకు కుమార్ బిక్కనూరులోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో చదివాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తండ్రి వారి కులవృత్తి అయిన గొర్ల కాపరిగా పనిలో పెట్టించాడు. ఓ వైపు గొర్లు కాస్తూనే చదువుపై మక్కువతో ఓపెన్ టెన్త్ కామారెడ్డి డ్రైవర్స్ కాలనీలో చేరాడు. తర్వాత ఇంటర్ భిక్కనూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, డిగ్రీ కామారెడ్డి డిగ్రీ కాలేజ్ లో పూర్తి చేశాడు. వాస్తవానికి కుమార్ కి పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేయాలని ఆశతో కష్టపడి చదివాడు. హైదరాబాద్‌లో నిజాం కాలేజ్ లో పొలిటికల్ సైన్స్ పూర్తి చేశాడు.

నిజామాబాద్ సారంగాపూర్ లో బీఈడీ పూర్తి చేసిన తర్వాత 2023 లో ప్రభుత్వం నిర్హించిన ఎస్ఐ పరీక్షలో విఫలమయ్యాడు. అదే సంవత్సరం టెట్ లో అర్హత సాధించాడు. ఏదైనా ప్రభుత్వం ఉద్యోగం సాధించడమే టార్గెట్ పెట్టుకున్న కుమార్ డీఎస్సీ కోసం విపరీతంగా కష్టపడ్డాడు. డీఎస్సీ రాసీ తొలి ప్రయత్నంలోనే స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్ గా పోస్ట్ సాధించాడు. చదువు పేరుతో హైదరాబాద్ వెళ్లి నీ కొడుకు జులాయిగా తిరుగుతున్నాడని.. అతను ఏమీ సాధించలేడని తల్లి‌దండ్రుల ముందు హేళన చేసిన వారే ఇప్పుడు అతని గొప్పతనం గురించి పొగుడుతున్నారు. పేదరికాన్ని జయించి మంచి ఉద్యోగం సాధించిన నీలాంటి వారు ఎంతోమందికి ఆదర్శం అంటూ మెచ్చుకుంటున్నారు. తన సక్సెస్ కి తల్లిదండ్రులు, తనను భుజం తట్టి ప్రోత్సహించిన గురువులకు, ఎప్పటికప్పుడు తనకు సహాయ సహకారాలు అందించిన స్నేహితులకు ధన్యవాదాలు తెలిపాడు కుమార్.