భారత్‌లో ఫ్లయింగ్‌ టాక్సీలు.. ట్రాఫిక్ కష్టాలకు చెక్.. జర్నీ ఖర్చు ఎంతంటే?

ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇక మీ కష్టాలు తీరనున్నాయి. భారత్ లో ఫ్లయింగ్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి. ప్రయాణ ఖర్చు ఎంతో తెలుసా?

ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇక మీ కష్టాలు తీరనున్నాయి. భారత్ లో ఫ్లయింగ్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి. ప్రయాణ ఖర్చు ఎంతో తెలుసా?

రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరిగిపోతున్నది. రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. కిలోమీటర్ దూరం వెళ్లాలన్నా కూడా అరగంటపైనే పడే పరిస్థితి దాపరించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ కష్టాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తే బాగుండని అంతా భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో వాహనదారులకు అదిరిపోయే న్యూస్ అని చెప్పాలి. ఇక ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం కలుగనున్నది. భారత్ లోకి ఫ్లయింగ్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి. ఇక ఈ ఎయిర్ ట్యాక్సీలతో ట్రాఫిక్ తిప్పలు లేకుండానే గమ్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.

ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్‌ ల్యాండింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ పట్టణ ప్రాంతాల్లో అనూహ్యమైన మార్పులు తీసుకురానుంది. ఫ్లయింగ్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తే రవాణా రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయనడంలో సందేహంలేదు. ఈ ఫ్లయింగ్‌ ట్యాక్సీలను అమెరికన్ సంస్థ ఆర్చర్ అభివృద్ధి చేసింది. విమానయాన దిగ్గజం బోయింగ్, భారతీయ కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ సపోర్ట్‌తో ఈ ఫైవ్‌-సీటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను రూపొందించింది. ఢిల్లీ, గురుగ్రాం నగరాల్లో ఫ్లయింగ్ ట్యాక్సీలను షూరూ చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండే ఈ ప్రాంతాల్లో ఫ్లయింగ్ ట్యాక్సీలతో బిగ్ రిలీఫ్ కలుగనున్నది.

మరి ఫ్లయింగ్ ట్యాక్సీలలో ప్రయాణించాలంటే ప్రయాణికుడు ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. రోడ్డు రవాణాతో పోల్చితే అధికంగానే ఉంటుందంటున్నారు నిర్వహకులు. ఈ ప్లయింగ్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తే.. ఢిల్లీ నుంచి గురుగ్రామ్‌కు ప్రయాణానికి, సాధారణంగా ఉబెర్‌లో రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ఖర్చవుతుంది. ఫ్లయింగ్‌ టాక్సీలో రూ.2,000 నుంచి రూ.3,000 వరకు ఉండవచ్చు. గురుగ్రామ్ నుంచి ఢిల్లీకి దాదాపు 30 కి.మీలు ఉంటుంది. ఈ దూరం ప్రయాణం చేయాలంటే 3000 వరకు వెచ్చించాల్సి ఉండొచ్చు. ఈ సర్వీసులతో సమయం కూడా ఆదా అవుతుంది. 2026నాటికి భారత్ లోని ప్రధాన నగరాల్లో ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Show comments