iDreamPost
android-app
ios-app

పిల్లిని కాపాడబోయి.. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురి మృతి!

కొందరు వ్యక్తులు మూగజీవులను కాపాడబోయి.. ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. అలా జీవాలను రక్షించబోయి.. కరెంట్ షాక్ తగిలింది, నీటిలో మునిగిపోయి చనిపోయిన వారు చాలా మందే ఉన్నారు. తాజాగా ఓ పిల్లిని రక్షించబోయి.. ఏకంగా ఐదుగురు దుర్మరణం చెందారు.

కొందరు వ్యక్తులు మూగజీవులను కాపాడబోయి.. ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. అలా జీవాలను రక్షించబోయి.. కరెంట్ షాక్ తగిలింది, నీటిలో మునిగిపోయి చనిపోయిన వారు చాలా మందే ఉన్నారు. తాజాగా ఓ పిల్లిని రక్షించబోయి.. ఏకంగా ఐదుగురు దుర్మరణం చెందారు.

పిల్లిని కాపాడబోయి.. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురి మృతి!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అనేక అరుదైన ఘటనలు జరుగుతుంటాయి. అయితే కొన్ని సంఘటనలు చూసినప్పుడు మాత్రం మనస్సు చలించి పోతుంది. అంతేకాక ఆ ఘటనతో సంబంధం లేని వారికి కూడా కంటి నుంచి కన్నీరు వస్తుంది. ముఖ్యంగా ఇతరులకు, ఇతర జీవులకు సాయం చేయబోయి..ప్రాణాలు కోల్పోయిన వారిని, వారి కుటుంబాలను చూసినప్పుడు హృదయాలు ఎంతో బాధ పడతాయి. తాజాగా ఓ  ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. పిల్లిని కాపాడబోయి.. ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని నెవాసా  పరిధిలోని వాకాడి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామంలో మంగళవారం సాయంత్ర 5 గంటల ప్రాంతంలో ఒక పిల్లి అకస్మాత్తుగా బావిలో పడిపోయింది. ఆ పిల్లి బావిలో పడటాన్ని.. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు చూశారు. బావిలో పడిపోయిన పిల్లిని ఎలాగైనా రక్షించాలని భావించారు. దీంతో వారు ఒకరి తర్వాత ఒకరు బావిలోకి దూకారు. ఈ సమయంలో ఆ బావిలో ఉన్న మట్టిలో చిక్కుకుపోయారని తెలుస్తోంది. అలా బావిలో చిక్కుకుపోయిన  ఆవ్యక్తులు ఊపిరి ఆడక మృతి చెందారు. ఈ సమయంలో ఆ ఐదుగురు దుర్మరణం చెందారు. వీరితో పాటు మరో వ్యక్తి చివర్లో నడుముకు తాడు కట్టుకుని బావిలోకి దిగగాడు.

అయితే అతడిని గమనించిన స్థానికులు త్వరగా బయటకు తీసి ఆస్పత్రిలో చేర్పించారు. ఇలా బావిలో నుంచి ప్రాణాలతో బయటపడిన వ్యక్తి పేరు విజయ్‌ మాణిక్‌ కాలే (35) అని గుర్తించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బుధవారం అర్ధరాత్రి 12:30 గంటల వరకూ కొనసాగిందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒక మృతదేహాన్ని తీశారు. మిగిలిన నాలుగు మృతదేహాలను తీయడానికి గంటన్నరకు పైగా సమయం పట్టిందని పోలీసులు చెబుతున్నారు.

స్థానికంగా నివాసం ఉండే ఓ రైతు బయోగ్యాస్ స్లర్రీని ఆ బావిలో వేసినట్లు సమాచారం.  ఆ బావిలోనే ఈ ఐదుగురూ చిక్కుకున్నారని.. ఆ గ్యాస్ ను పీల్చుకుని మృతి చెందారని అధికారులు చెబుతున్నట్లు తెలుస్తుంది. ఆ బయోగ్యాస్ బావిలో ఊబిలో చిక్కుకుపోయారని స్థానికులు చెబుతున్నారు. ఆ గ్యాస్ కారణంగానే మృతదేహాలను వెలికితీయడం కూడా ఎక్కువగానే కష్టపడాల్సి వచ్చిందని పోలీసులు అంటున్నారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. ఇక ఆ ఐదు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుకుముకుంది.