iDreamPost
android-app
ios-app

అమల్లోకి కొత్త చట్టం! ఇక రోడ్లపై ఆ కష్టాలకి చెక్ పడినట్టే!

  • Published Jul 01, 2024 | 3:58 PM Updated Updated Jul 01, 2024 | 3:58 PM

Bharatiya Nyay Sanhita: ఇప్పటి వరకు బ్రిటీష్ కాలం నాటి చట్టాలు అమలు అవుతూ వచ్చాయి. ఆదివారం నుంచి భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయనం ప్రారంభం అయ్యింది. బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు తెరపడింది.

Bharatiya Nyay Sanhita: ఇప్పటి వరకు బ్రిటీష్ కాలం నాటి చట్టాలు అమలు అవుతూ వచ్చాయి. ఆదివారం నుంచి భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయనం ప్రారంభం అయ్యింది. బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు తెరపడింది.

అమల్లోకి కొత్త చట్టం! ఇక రోడ్లపై ఆ కష్టాలకి చెక్ పడినట్టే!

భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయనం మొదలైంది.. మూడు కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం. బ్రిటీష్ కాలం నుంచి నుంచి వస్తున్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ (సీఆర్‌పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఇఏ) ఈ మూడు చెట్టాలకు చెల్లు చీటీ పలికారు. ఆదివారం అర్థరాత్రి నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి.ఇంతకు ముందు ఐపీసీ లో ప్రత్యేక సెక్షన్లు లేకపోవడంతో గందరగోళం ఏర్పడేది.. భారతీయ న్యాయ సంహితలో ఆ లోటు పూడ్చారు. తాజాగా భారతీయ న్యాయ సంహిత చట్టం కింద తొలి కేసు నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళితే..

ఆదివారం నుంచి అమలు అయిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద తొలి కేసు నమోదు అయ్యింది. బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు తిలోదకాలు ఇస్తూ.. భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయం ప్రారంభమైన విషయం తెలిసిందే. భారతీయ న్యాయ సంహితి(బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ) ఆదివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలోనే భారతీయ న్యాయ సంహిత కింద తొలి కేసు ఢిల్లీలో నమోదు అయ్యింది. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ పరిధిలోని ఓ వీధి వ్యాపారిపై కొత్త క్రిమినల్ కోడ్ లోని సెక్షన్ 285 కింద ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. సదరు వీధి వ్యాపారి ఎన్డీఆర్ఎస్ సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద రోడ్డుపై వాటర్ బాటిళ్లు, గుట్కా, బీడీ, సిగరెట్లు అమ్ముతున్నాడు. దీని వల్ల అక్కడ విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పెట్రోలింగ్ పోలీసులు అది గమనించి అతనిపై కేసు నమోదు చేశారు.

గతంలో సదరు వ్యాపారికి పోలీసులు వేరే చోట వ్యాపారం చేసుకోవాల్సిందిగా సూచించినప్పటికీ వారి మాటలు లెక్కచేయకుండా ఓవర్ బ్రిడ్జ్ కింద వ్యాపారం చేయడం వల్ల జనాలు గుమి కూడటం జరిగి ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడటంతో పోలీసులు ఆ వ్యాపారిపై క్షన్ 285 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సదరు వ్యాపారి వల్ల ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో వీడియో తీసి కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ వ్యాపారి బీహార్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా చాలా మంది చిరు వ్యాపారులు ఫుట్ పాత్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద తమ వ్యాపారాలు ఎదేచ్చగా కొనసాగిస్తున్నారు. దీని వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కొత్తగా వచ్చిన చట్టం ద్వారా ఇలాంటి వ్యాపారులపై కొరడా ఝులిపించడం ద్వారా కొంతమేర ట్రాఫిక్ ఇబ్బంది తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.  ఇలాంటి చట్టాల రోడ్లపై ఉండే ట్రాఫిక్ కష్టాలకి చెక్ పడినట్టే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.