iDreamPost
android-app
ios-app

Cancer బాధితులకు కేంద్రం రూ.15 ల‌క్ష‌ల సాయం.. ఎలా పొందొచ్చంటే?

క్యాన్సర్ రోగులకు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తోంది. దీనికోసం ఓ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రూ. 15లక్షల ఆర్థికసాయాన్ని అందిస్తుంది. సాయం ఎలా పొందొచ్చంటే?

క్యాన్సర్ రోగులకు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తోంది. దీనికోసం ఓ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రూ. 15లక్షల ఆర్థికసాయాన్ని అందిస్తుంది. సాయం ఎలా పొందొచ్చంటే?

Cancer బాధితులకు కేంద్రం రూ.15 ల‌క్ష‌ల సాయం.. ఎలా పొందొచ్చంటే?

క్యాన్సర్ అత్యంత ఖరీదైన వ్యాధి. ఏటా దీని భారినపడి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మ‌ృత్యువాత పడుతున్నారు. వైద్య ఖర్చులు భరించలేక తనువు చాలిస్తున్న వారు సామాన్యులు మధ్యతరగతి వారే. క్యాన్యర్ వ్యాధి కుటుంబాలను కుదిపేస్తోంది. వయసుతో సంబంధం లేకుండా క్యాన్సర్ మహమ్మారి భారిన పడుతున్నారు. వైద్య ఖర్చులు భరించలేక క్యాన్సర్ రక్కసి నుంచి బయటపడేందుకు రోగులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తుంటారు. అయితే క్యాన్సర్ రోగులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ‘రాష్ట్రీయ ఆరోగ్య నిధి’ అనే సంక్షేమ పథకాన్నికేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ పథకం ద్వారా రూ. 15 లక్షల వరకు ఆర్థిక సాయం పొందొచ్చు.

దారిద్య్రరేఖకు దిగువన ఉన్న క్యాన్సర్ రోగులకు ఆర్థిక సాయం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. పేద క్యాన్సర్ రోగులకు వైద్యానిక‌య్యే ఖర్చు రూ.15 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఆరోగ్య నిధి ప‌థ‌కం ద్వారా అందిస్తుంది. కేంద్రం2009లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకం ద్వారా క్యాన్సర్ బాధితులు లబ్థిపొందాలంటే.. దేశంలోని ప్రభుత్వానికి చెందిన ప్రాంతీయ క్యాన్స‌ర్ కేంద్రాలలో చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రులు, వేరే ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందితే ఈ పథకం వర్తించదు. రెండు తెలుగు రాష్ట్రాలకు క‌లిపి రీజిన‌ల్ క్యాన్స‌ర్ సెంట‌ర్ హైద‌రాబాద్‌లో ఉంది.

ఎంఎన్‌జె ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, ఎంఎన్‌జె ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్ సెంటర్. కాగా క్యాన్సర్ రోగులకు ఈ పథకం ద్వారా మొదటిసారి రూ. 2లక్షలు ఆర్థిక సాయం అందిస్తారు. అంతకు మించి అవసరమైతే రోగి కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. కేంద్రం దానిని పరిశీలించి రోగి చికిత్స పొందుతున్న రీజినల్ క్యాన్సర్ సెంటర్లో వైద్యబృంధంతో చర్చలు జరిపి అప్పుడు రూ. 15లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు. ఒకేసారి ఈ డబ్బును అందిస్తుంది ప్రభుత్వం.

అయితే ఈ డబ్బులు కేవలం రేడియేష‌న్, యాంటీ క్యాన్స‌ర్ కీమోథెర‌పీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేష‌న్, రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు, క్యాన్స‌ర్ గ‌డ్డ‌ల ఆపరేషన్ వంటి చికిత్స‌ల‌కు మాత్రమే ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఈ ప‌థ‌కం ద్వారా ఆర్థిక సాయం పొంద‌డానికి దారిద్య్ర రేఖ‌కు దిగువ‌న ఉన్న‌వారై ఉండాలి. క్యాన్సర్ వ్యాధి సోకినట్లు మెడికల్ రిపోర్ట్స్ ఉండాలి. కాగా ఈ పథకానికి అప్లై చేసుకునేందుకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెబ్‌సైట్ ను https://main.mohfw.gov.in/ సంప్రదించాల్సి ఉంటుంది. లేదా ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాల్లో సంప్రదించాల్సి ఉంటుంది.