P Krishna
నేడు అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సాగే ఈ కార్యక్రమానికి ఇప్పటికే ప్రముఖులు విచ్చేశారు. లక్షల మంది భక్తులు అయోద్య రామ మందిరం ప్రారంభం తిలకించేందుకు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.
నేడు అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సాగే ఈ కార్యక్రమానికి ఇప్పటికే ప్రముఖులు విచ్చేశారు. లక్షల మంది భక్తులు అయోద్య రామ మందిరం ప్రారంభం తిలకించేందుకు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.
P Krishna
ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22, సోమవారం ఎంతో వైభవంగా జరగనుంది. శ్రీరాముని కోసం కన్న కలలు నేడు సాకారం కానున్నాయి. బాలరాముడి దర్శనం కోసం లక్షల మంది భక్తులు ఎంతో ఆత్రుత, భక్తితో ఎదురు చూస్తున్నారు. దేశమంతా రామ నామ జపం చేస్తున్నారు. ఇప్పటికే దేవంలోని ప్రముఖులకు అయోద్య మందరం ట్రస్టు వారు ఆహ్వానాలు అందజేశారు. మరోవైపు దేశంలోని వీధి వీధిలో అయోధ్య రామ మందిర ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రతక్ష్యంగా ప్రసారం చేయనున్నారు. అయితే దేశంలోనే ఇంత ప్రతిష్టాత్మక రామ మందిర నిర్మాణానికి సంబంధించిన మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి.. ఆ ఆశక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.. పూర్తి వివరాల్లోకి వెళితే..
జనవరి 22, సోమవారం ఉదయం అయోధ్యలో జరిగే బాల రాముడి ప్రాణ ప్రతిష్ట ఎంతో వైభవంగా జరగబోతుంది. ఈ కార్యక్రమం ప్రదాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగబోతుంది. ఇప్పటికే పలువురు ముఖ్యఅతిధిలు అయోధ్యకు చేరుకున్నారు. ప్రణ ప్రతిష్టకు వేడుకలో జరిగే ఉత్సవాలు సోమవారం జరిగితే.. 23వ తేదీన భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇంతగొప్ప ఆలయ నిర్మాణం వెనుక ఎంతోమంది శ్రమ దాగి ఉంది. ఈ మందరి నిర్మాణం మూడు దశల్లో నిర్మిస్తుండగా.. ప్రస్తుతం తొలి దశ పనులు పూర్తి కావడంతో శ్రీ రాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారు. ఇక 2025 లో మిగతా పనులు పూర్తవుతాయని ట్రస్టు తెలిసింది. అయోధ్య రామ మందిరం గురించి విషయాలు తెలుసుకుందాం.
ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య రామమందిరాన్ని హిందులు పుణ్యక్షేత్రంగా భావిస్తారు. హిందువులు రాముని జన్మస్థలంగా పరిగణిస్తారు. ఎప్పటి నుంచో ఇక్కడ మందిర నిర్మాణం కోసం పోరాటాలు జరుగుతన్న నేపథ్యంలో ఆగస్టు 5, 2020 లో ఈ మందిరానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ‘శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం’ ట్రస్ట్ ఈ మందరి నిర్మాణాన్ని పూర్తిగా పర్యవేక్షిస్తుంది. ఆలయ నిర్మాణానికి సంబంధంచి విరాళాల కార్యక్రమం 2021 లో 44 రోజుల పాలు సాగింది. ఈ క్రమంలో విరాళాల మొత్తం రూ.2,100 కోట్ల సేకరించినట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. కొన్ని నెలల తర్వాత ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే రామ మందిర నిర్మాణానికి సంబంధించిన ఖర్చులను ట్రస్ట్ అధికారికంగా లెక్కలు ప్రకటించలేదు.. కాకపోతే ఆలయ నిర్మాణానికి రూ.1,800 కోట్ల ఖర్చు అవుతుందని తెలిపారు. 2023 అక్టోబర్ నాటికి..రూ.900 కోట్లు ఖర్చు అయినట్లు.. మరో రూ.3 వేల వరకు బ్యాంక్ ఖాతాలో ఉన్నట్లు ట్రస్ట్ వెల్లడించినట్లు వార్తలువ వచ్చాయి.
ఇంత గొప్ప మందిర నిర్మాణానికి చంద్రకాంత్ సోంపూరా, నిఖిల్ సోంపూరా, ఆశిష్ సోంపూరా చీఫ్ ఆర్కిటెక్స్ ఉన్నారు. రామ మందిరం డిజైన్ కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు.. ఎలాంటి భూకంపాలు, ప్రకృతి విపత్తులు జరిగిన పటిష్టంగా ఉండేలా ఏర్పాటు చేశారు. ఇందుకోసం IIT గౌహతి, IIT చెన్నై, IIT బాంబే, NIT సూరత్, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కీ, నేషనల్ జియో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వీళ్లందరి సహకారం తీసుకున్నారు. ఈ నిర్మాణాన్ని లారెన్స్ అండ్ టుర్బో చేపట్టిన విషయం తెలిసిందే. టాలా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్ మేనేజ మెంట్ కంపనీ గా వ్యవహరించారు. బాలరాముడి విగ్రహాన్ని మైసూర్ కి చెందిన ప్రముఖ శిల్పకారుడు అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు. విగ్రహం 51 అంగుళాల పొడవుతో పాటు ఐదేళ్ళ బాలుడి పోలి ఉంటుంది. గణేష్ భట్, సత్యనారాయణ పాండే శిల్పులుగా కొనసాగారు.
అయోధ్యలో రామ మందిరం 2.77 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. అయోధ్య రామ మందిరాన్ని పూర్తిగా సంప్రదాయ నగర రీతిలో నిర్మించారు. ఈ మందిరం పొడవు 360 అడుగులు, వెడల్పు 253 అడుగులు, ఎత్తు 161 అడుగులు కలిగి ఉంది. ఆలయంలో మూడు అంతస్తులు ఉంటాయి. మొదటి అంతస్తు నుంచి గర్భ గుడి శిఖరం వరకు 161 అడుగుల ఎత్తులో నిర్మితమైంది. ఒక్కొక్క అంతస్తు దాదాపు 20 అడుగులతో ఎత్తులో ఉంటుంది. మొత్తం మీద 392 స్తంబాలు, 44 డోర్లు ఉంటాయి. ప్రధాన గర్భగుడిలో శ్రీ రామ్ లల్లా (రాముడి బాల్య విగ్రహం) ఉంటుంది. మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్భార్ అంటే శ్రీరాముడు, సీత, లక్షణుడు, హనుమాన్, మరికొన్ని విగ్రహాలు కొలువై ఉంటాయి. మొదటి అంతస్తు ఎంతో అద్భుతంగా తీర్చి దిద్దినట్లు తెలుస్తుంది. ఒక అద్భతమైన కళాఖండంగా ఉండబోతుందని అంటున్నారు. రెండవ అంతస్తులో శ్రీరాముడి కుటుంబం దశరధుడు, కౌసల్య, కైకేయి లతో పాటు భరత, శత్రుఘ్నడు, విశ్వామిత్రుడు ఇలా మరికొన్ని విగ్రాహాలు కొలువై ఉంటాయి. ఇక మూడో అంతస్తులో నృత్య, ప్రార్థన, రంగ్, సభా, కీర్తన చేసుకునే విధంగా నిర్మించారు. వీటితో పాటు మందిరంలో స్తంబాలు, గోడలకు దేవుళ్ల విగ్రహాలు, ఇతిహాసాల కధలను ఏర్పాటుచేశారు.
అయోధ్యలో నిర్మించిన రామ మందిరం నిర్మాణం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇక్కడ ఎన్నో మౌళిక సదుపాయాలు కల్పించారు. మురుగునీటి శుద్ధి కర్మాగారం, అగ్నిమాపక సేవ & రెస్క్యూ సేవలు, త్రాగడానికి & పోర్టబుల్ ఉపయోగాలు రెండింటికీ నీటి శుద్ధి కర్మాగారం, సొంతంగా ఓ పవర్ స్టేషన్, యాత్రికులకు వైద్య సదుపాయంతో పాటు లాకర్ సౌకర్యాలను అందించడానికి 25,000 సామర్థ్యం గల యాత్రికుల సౌకర్య కేంద్రం ఏర్పాటు చేశారు. దర్శనం కోసం వచ్చిన వారికి స్నానపు ప్రదేశం, వాష్‌రూమ్‌లు, వాష్‌బేసిన్, ఓపెన్ ట్యాప్‌లు మొదలైన వాటితో ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేశారు. ఆలయం నిర్మాణంపై పిడుగులు పడకుండా రక్షించడానికి 200 KA లైట్ అరెస్టర్‌లను ఏర్పాటు చేశారు. అగ్ని మాపక యంత్రాగాన్ని ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకోవడానికి ఐటీ ఎలక్ట్రానిక్స్ సెన్సార్లు ఏర్పాటు చేశారు. రాముడు, రామాయణ గాధకు సంబంధించిన కళాఖండాలను ప్రదర్శించే మ్యూజియం, సాంస్కృతిక, విద్యాకేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
రామ మందిరం నిర్మాణం NICMAR ప్రమాణాల ప్రకారం ఎంతో పటిష్టంగా ఉండబోతుంది.. 2500 సంవత్సరాల వయసు వరకు ఇది ఉంటుందని అంచనా, ఎలాంటి భూకంపాలు వచ్చినా తట్టుకునే విధంగా నిర్మించారున. ఒక టైమ్ క్యాప్సూల్ భూమి నుంచి సుమారు 2,000 అడుగుల దిగువన, ఆలయం క్రింద ఉంచబడింది. రామ మందిరం, అయోధ్యకు సంబంధించిన సమాచారంతో రాగి పలక ఉంది. ఈ టైమ్ క్యాప్సూల్ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే భవిష్యత్ తరాలకు మర్చిపోకుండా గుర్తు చేస్తుంది.. అలాగే ఇది సైబర్ స్పేస్, వివిధ మ్యూజియంలలో అప్ లోడ్ చేయబడుతుంది. ఇక్కడ కొలువై ఉన్న కొన్ని విగ్రమాలను గండకీ (నేపాల్) నుంచి తెచ్చిన 60 మిలియన్ సంవత్సరాల పురాతన శాలిగ్రామ శిలలతో తయాచు చేయబడ్డాయి. ఇప్పటి వరకు ఆలయ నిర్మాణానికి మొత్తం సేకరించిన విరాళాల్లో దాదాపు 52 శాతం ఖర్చయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జీవితంలో ఒక్కసారైన అయోధ్యకు వెళ్లి బాలరాముడిని దర్శించుకొని రావాలని హిందులు కోరుకుంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.