PM కిసాన్ యోజన.. ఆ పని చేయకుంటే డబ్బులు పడవు!

PM Kisan Yojana 2024: వ్యవసాయ రంగాన్ని, రైతులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి.. అమలు చేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి  యోజన్ అనే పథకాన్ని నరేంద్ర మోదీ సర్కార్ ప్రారంభించింది.

PM Kisan Yojana 2024: వ్యవసాయ రంగాన్ని, రైతులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి.. అమలు చేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి  యోజన్ అనే పథకాన్ని నరేంద్ర మోదీ సర్కార్ ప్రారంభించింది.

భారత ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో రకలా సంక్షేమ పథకాలు అందిస్తుంది, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ముఖ్యంగా రైతులు, మహిళల, యువత అభివృద్ధి, సంక్షేమం కోసం పలు స్కీమ్స్ ను అమలు చేస్తుంది. ఇదే సమయం  కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ, రైతుకు పెట్టుబడి సాయం అందిస్తుంది. రైతులకు కోసం కేంద్రం ప్రారంభించిన పథకాల్లో పీఎం కిసాన్ యోజన ఒకటి. దీని ద్వారా ఇప్పటికే పలు విడుతల్లో డబ్బులు జమ చేశారు. మరోసారి 17వ విడత డబ్బులు త్వరలో జమ కానున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా ఓ పని చేయాలి. లేకుంటే వారికి పీఎం కిసాన్ యోజన్ డబ్బులు పడవు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

వ్యవసాయ రంగాన్ని, రైతులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి.. అమలు చేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి  యోజన్ అనే పథకాన్ని నరేంద్ర మోదీ సర్కార్ ప్రారంభించింది. ఇప్పటికే ఈ స్కీమ్ ద్వారా లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కేంద్ర ప్రభుత్వం అందించింది. డైరెక్టుగా రైతుల ఖాతాల్లోనే ఈ పథకం డబ్బులు జమ అవుతున్నాయి. అలానే కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ యోజన ప్రయోజనం పొందుతున్నారు.

అయితే పథకం యొక్క ప్రయోజనాలను పొందేందుకు రైతులు కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిని అనుసరిస్తేనే పీఎం కిసాన్ యోజన్ కింద డబ్బులు రైతుల అకౌంట్లో జమ అవుతాయి. ఈ స్కీమ్ కింద డబ్బులు పొందాలంటే  రైతులు ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. అలానే భూమి ధృవీకరణ పొందవలసి ఉంటుంది. ఒకవేళ ఏ రైతు అయినా ఈ-కేవీసీని చేయించుకోకపోతే అతనికి రావాల్సిన డబ్బులు మొత్తం నిలిచిపోతాయి.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన్ కింద అర్హులైన రైతులకు ఏటా కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ.6000 అందజేస్తుంది. 2000 చొప్పున ఈ మొత్తం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది. ఇప్పటి వరకు 16వ విడత రైతుల అకౌంట్లోకి డబ్బులు చేరాయి. ఇప్పుడు రైతులు 17వ విడత పీఎం కిసాన్ యోజన నిధుల కోసం ఉన్నారు. త్వరలో ఆ నిధులు కూడా విడుదల కానున్నాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ఈ నిధులు రైతుల అకౌంట్లో వేయనున్నారు. నిబంధనల ప్రకారం ఈ-కేవైసీ చేసిన రైతులకు మాత్రమే పథకం ప్రయోజనం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది.

అనర్హులను, ప్రభుత్వ సొమ్ము పక్కదారి పట్టకుండా మోసాలను అరికట్టేందుకు  కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం లబ్ధిదారులందరూ ఈ-కేవైసీ పని చేయడం చాలా అవసరం. ఈ కేవైసీ చేయించుకోవడం కోసం రైతులు తమ సమీప సీఎస్సీ కేంద్రాన్ని సందర్శించాలి. తర్వాత బయోమెట్రిక్ మిషిన్ ద్వారా సులభంగా ఈ-కేవైసీ  పూర్తి చేయవచ్చు. అలానే ప లు బ్యాంకుల్లో పీఎం కిసాన్ యోజన కోసం ఈకేవైసీ ని అందుబాటులో ఉంది. ఇదే కాకుండా మరో మార్గం ఉంది. రైతు కావాలనుకుంటే అతను PM కిసాన్ పోర్టల్  ద్వారా సులభంగా ఈ-కేవీసీని పొందవచ్చు. ఇందులో మాత్రం ఈ-కేవైసీ ఓటీపీ ద్వారా జరుగుతుంది. మొత్తంగా త్వరగా రైతులు ఆ పనిని పూర్తి చేస్తే.. పీఎం కిసాన్ డబ్బులు పడతాయి.

Show comments