iDreamPost
android-app
ios-app

Fake Toll Plaza: నకిలీ టోల్‌ప్లాజా.. రూ.75 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు!

చాలా మంది జనాలు ఖర్చు తగ్గించుకనే మార్గాలను వెతుకుంటారు. ఈ క్రమంలో కొందరు మోసగాళ్లు చెప్పే మాయ మాటలు నమ్మి నిండ మోసపోతారు. అలానే కేటుగాళ్లు నకిలీ ఆఫీసులు, ఇతర సంస్థలు ఏర్పాటు చేసి కోట్లు కొట్టేశారు. తాజాగా అలాంటి నకిలీ టోల్ ప్లాజా ఘటన ఒకటి చోటుచేసుకుంది.

చాలా మంది జనాలు ఖర్చు తగ్గించుకనే మార్గాలను వెతుకుంటారు. ఈ క్రమంలో కొందరు మోసగాళ్లు చెప్పే మాయ మాటలు నమ్మి నిండ మోసపోతారు. అలానే కేటుగాళ్లు నకిలీ ఆఫీసులు, ఇతర సంస్థలు ఏర్పాటు చేసి కోట్లు కొట్టేశారు. తాజాగా అలాంటి నకిలీ టోల్ ప్లాజా ఘటన ఒకటి చోటుచేసుకుంది.

Fake Toll Plaza: నకిలీ టోల్‌ప్లాజా.. రూ.75 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు!

నేటికాలంలో  అక్రమంగా సంపాదించాలనుకునే వారి సంఖ్య  రోజు రోజుకు పెరిగి పోతుంది. దీని కోసం అనేక రకాల మోసాలకు కొందరు పాల్పడుతున్నారు. కష్టపడి సంపాదించుకోవడం చేతకాక రోజంత శ్రమించి సంపాదించుకున్న వారి  ధనాన్ని కాజేస్తుంటారు. ఇంకొందరు అనేక రకాల చోరీలు, మోసాలు చేస్తూ.. డబ్బులు పొందుతుంటారు. అయితే ఇలాంటి చెడు పనులు చివరకి నష్టాన్నే మిగులుస్తాయి. కొన్ని రకాల మోసాలు చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి ఘరాన మోసం ఒకటి గుజరాత్ లో జరిగింది. నకిలీ టోల్ ప్లాజాను ఏర్పాటు చేసి.. కోట్ల రూపాయలను కొట్టేశారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీ జిల్లాలో ఓ నకిలీ వ్యవహారం బయటపడింది.  మెర్బీ, కచ్ జిల్లాలను కలిపే 8ఏ నంబర్ జాతీయ రహదారిపై వాఘసియా టోల్ ప్లాజా ఉంది. ఈ టోల్ ప్లాజాను తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు మరో మార్గాన్ని ప్రత్యామ్నాయంగా ఎంచుకుని అటుగా వెళ్లే వారు. ఇలా అధిక సంఖ్యలో వాహనాదారులు జాతీయ రహదారి పక్కన ఉన్న మరో మార్గంలో వెళ్లడాన్ని కొందరు కేటుగాళ్లు గమనించారు. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని ఆ కేటుగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. ఆ మార్గంలో నిరుపయోగంగా ఉన్న ఓ సిరామిక్‌ ఫ్యాక్టరీని అద్దెకు తీసుకుని, దానికి ఇరువైపులా హైవే వరకు బైపాస్‌ రోడ్డును నిర్మించారు. అంతేకాక ఫ్యాక్టరీలోనే ఓ టోల్‌ ప్లాజాను ఏర్పాటు చేశారు.

హైవేపై ఉన్న టోల్‌ ప్లాజా ఛార్జీల కంటే తక్కువగా వసూలు చేసేవారని తెలుస్తుంది. టోల్ ప్లాజా ఛార్జీలు తక్కువగా ఉండటంతో వాహనదారులు కూడా దీనిపై ఎవరికీ ఫిర్యాదు చేయలేదని సమాచారం. ఈ ప్లాజా పైనే ఇటీవల స్థానిక మీడియాల్లో వార్తలు రావడంతో ఈ నకిలీ టోల్‌ భాగోతం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానిక అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, దానిపై కేసు నమోదు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ఐదుగుర్ని అరెస్టు చేశారు. నిందుతుల్లో ఒకరు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి గా పోలీసులు గుర్చించారు.

అలానే పాటిదార్‌ వర్గానికి చెందిన ప్రముఖ నేత కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం. ఏడాదిన్నర కాలం నుంచి ఈ నకిలీ టోల్‌ ప్లాజాను నిందితులు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వాహనదారుల నుంచి దాదాపు రూ. 75కోట్లు వసూలు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే దీని గురించి తెలిసినా కూడా స్థానిక అధికారులు ఎవరూ పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి.. ఈ ఘరానా మోసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.