P Krishna
దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సామాన్యులే కాదు సెలబ్రెటీలు, రాజీకీయ నేతలకు రోడ్డు ప్రమాాదాలు జరగడం చూస్తూనే ఉన్నాం. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.
దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సామాన్యులే కాదు సెలబ్రెటీలు, రాజీకీయ నేతలకు రోడ్డు ప్రమాాదాలు జరగడం చూస్తూనే ఉన్నాం. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.
P Krishna
ఈ మద్య కాలంలో దేశంలో పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.. ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయి అనాథలుగా మిగిలిపోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినా, రోడ్డు భద్రతా చర్యలు పాటించినా.. ఈ ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నేతలు బలి అవుతున్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. మాజీ సీఎం కి రోడ్డు ప్రమాదం అని తెలియగానే కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఈ ఘటన అహ్మదాబాద్-రాజ్‌కోట్ జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళితే..
గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కాన్వాయ్ అహ్మదాబాద్ – రాజ్ కోట్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నారు. సురేంద్రనగర్ జిల్లాలో 50 ఏళ్ల ఓ వ్యక్తి తన బైక్ పై రోడ్డు దాటుతున్న సమయంలో రుపానీ కాన్వాయ్ లోని ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రుపానీ సిబ్బంది ఆ వ్యక్తిని హుటాహుటిగా దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాద సమయంలో రుపానీ మరో వ్యక్తి కారులోనే ఉన్నారు. గాయపడిన వ్యక్తి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని విజయ్ రూపానీ తన కాన్వాయ్ లో ఎక్కించుకొని లింబ్డీ లోని ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తికి కాళ్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయబడలేదని సీపీ ముంద్వా తెలిపారు.
ప్రస్తుతం పంజాబ్ లోని బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉన్న విజయ్ రూపానీ.. రాజ్ కోట్ నుంచి గాంధీ నగర్ కి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ – రాజ్ కోట్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆయన కారులో ఉన్నా.. ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో కార్యకర్తలు, సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. గుజరాత్ మాజీ సీఎం సురేశ్ మెహతా కారును మోర్బీ జిల్లాలోని హల్వాద్ పట్టణ సమీపంలో ఓ లారీ ఢీ కొట్టింది. ఓ మలుపు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సురేష్ మెహతాకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నానరు. కారును చూసి లారీ డ్రైవర్ అప్రమత్తమైన బ్రేక్ వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని.. అందుకే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అనంతరం మెహతా మరో కారులో వెళ్లిపోయారని అన్నారు.