iDreamPost
android-app
ios-app

CM కు షాకిచ్చిన ED.. అరెస్టుకు రంగం సిద్ధం!

ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జార్ఖండ్ ముఖ్యమంత్రికి షాకిచ్చింది. సీఎం సోరెన్ దాదాపు 30 గంటల తర్వత వెలుగులోకి రావడంతో ఆయనను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జార్ఖండ్ ముఖ్యమంత్రికి షాకిచ్చింది. సీఎం సోరెన్ దాదాపు 30 గంటల తర్వత వెలుగులోకి రావడంతో ఆయనను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

CM కు షాకిచ్చిన ED.. అరెస్టుకు రంగం సిద్ధం!

భారత దేశంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆర్థిక నేరాలకు పాల్పడే వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంది. ఎంతటి వ్యక్తులైనా సరే ఆర్థిక నేరాలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టి కటకటాల పాలు చేస్తుంది. అయితే ఇటీవల జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మైనింగ్ లీజుల వ్యవహారం, భూ కుంభకోణం వంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయనను విచారణ చేసేందుకు ఢిల్లీలోని జార్ఖండ్ సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు. కాగా ఆ సమయంలో హేమంత్ సోరెన్ అధికారులకు అందుబాటులో లేకుండా పోయారు.

ఇక సోమవారం సాయంత్రం వరకు వేచి చూసిన ఈడీ అధికారులు సోరెన్ కనిపించడం లేదంటూ ప్రకటించి ఆయనకు సంబంధించిన వస్తువులను సీజ్ చేశారు. ఓ ఖరీదైన బీఎండబ్ల్యూ కారు, రూ.36 లక్షల నగదు, మరికొన్ని పత్రాలను ఈడీ అధికారులు సీజ్ చేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈడీ సీఎం మిస్ అయినట్లు చేసిన ప్రకటనపై జేఎమ్ఎమ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు వ్యక్తిగత పనుల నిమిత్తం సోరెన్ వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో దాదాపు 30 గంటల తర్వాత సోరెన్ అజ్నాతం వీడి బయటకు వచ్చారు.

రాంచీలో సోరెన్ ప్రత్యక్షమయ్యారు. ఈ క్రమంలో ఢిల్లీలోని తన నివాసానికి సీఎం సోరెన్ చేరుకున్నారు. ఈ క్రమంలో ఈడీ అన్ని ఆధారాలతో మనీలాండరింగ్ కేసులో సోరెన్ ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మరోవైపు ఈడీ అరెస్టు చేస్తుందన్న భయంతోనే సోరెన్ విచారణకు సహకరించకుండా తప్పించుకు తిరుగుతున్నారని ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. కాగా జార్ఖండ్‌లోని రాతి గనుల మైనింగ్ లీజును తనకు అనుకూలమైన వారికి కట్టబెట్టడంతోపాటు అధిక ధరలకు కేటాయించడంపై సీఎం సోరెన్ పై ఈడీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. మైనింగ్ లీజుతోపాటు విదేశాల నుంచి డబ్బు అక్రమంగా దేశంలోకి వచ్చిందని.. దానికి లెక్కలు చూపించలేదని మనీలాండరింగ్ కేసు కూడా నమోదు చేశారు ఈడీ అధికారులు. ఇక ముఖ్యమంత్రి సోరెన్ ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో దేశమంతా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.