iDreamPost
android-app
ios-app

ఇంటినిండా గుట్టలు గుట్టలుగా కరెన్సీ నోట్లు.. ఈడీకి దొరికిపోయిన అవినీతి బకాసురుడు!

  • Published Feb 09, 2024 | 9:28 AM Updated Updated Feb 09, 2024 | 9:28 AM

ED Rides IFS Officer: తాజాగా ఓ ఐఎఫ్ఎస్ అధికారి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కంగుతిన్నారు. అతడి ఇంట్లో గుట్టలు గుట్టలుగా కరెన్సీ కట్టలు కనిపించడంతో.. నివ్వెరపోయారు.

ED Rides IFS Officer: తాజాగా ఓ ఐఎఫ్ఎస్ అధికారి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కంగుతిన్నారు. అతడి ఇంట్లో గుట్టలు గుట్టలుగా కరెన్సీ కట్టలు కనిపించడంతో.. నివ్వెరపోయారు.

ఇంటినిండా గుట్టలు గుట్టలుగా కరెన్సీ నోట్లు.. ఈడీకి దొరికిపోయిన అవినీతి బకాసురుడు!

బాధ్యతాయుతమైన అధికారాల్లో ఉండి కొందరు అవినీతికి పాల్పడున్న సంఘటనలు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ అవినీతి తిమింగలంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఇంటినిండా గుట్టలు గుట్టలుగా కరెన్సీ కట్టలను చూసి అధికారులే నివ్వరపోయారు. అదీకాక ఆ అధికారి ఇంట్లో ఏకంగా కౌంటింగ్ మిషన్ ఉండటంతో సోదాలకు వచ్చిన ఆఫీసర్స్ కంగుతిన్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(IFS) అధికారి సుశాంత్ పట్నాయక్ ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. సోదాల్లో భారీగా అవినీతి డబ్బు వెలుగులోకి వచ్చింది.

మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఫ్ఎస్) అధికారి సుశాంత్ పట్నాయక్ ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ బుధవారం సోదాలు నిర్వహించింది. ఈ రైడ్స్ లో భారీగా డబ్బు బయటపడింది. సోదాలకు వెళ్లిన అధికారులకు దిమ్మతిరిగిపోయింది. పక్కాగా అందిన సమాచారంతో సుశాంత్ పట్నాయక్ ఇంటిపై ఈడీ అధికారులు దాడులు చేశారు. అధికారులు అతడిని నుంచి రూ. 4.5 కోట్ల నగదుతో పాటుగా మరో రూ. 34 కోట్ల విలువైన ఆభరణాలను, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంట్లో మనీ కౌంటింగ్ మెషిన్ ఉండటం చూసి అధికారులే ఆశ్చర్యపోయారు.

A corrupt banker found by ED!

హరిద్వార్ కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ పట్నాయక్.. అటవీ భూముల కుంభకోణంలో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతను ఉత్తరాఖండ్ పొల్యూషన్ నియంత్రణ మండలి కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అయితే మనీలాండరింగ్ కు పాల్పడ్డాడు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కెనాల్ రోడ్ లోని అతని ఇంటిపై ఈడీ బుధవారం సోదాలు నిర్వహించింది. గురువారం తెల్లవారుజాము వరకు కొనసాగిన ఈ సోదాల్లో గుట్టలు గుట్టలుగా డబ్బుల కట్టలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ విషయమై.. వెంటనే ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఐఎఫ్ఎస్ ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇక ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న మాజీ డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడి ఇంట్లో కూడా ఈడీ సోదాలు చేసింది. సుశాంత్ పట్నాయక్ ఇంటితో పాటుగా ఏక కాలంలో 17 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. అందులో ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ ఇల్లు కూడా ఉంది. మరి బాధ్యతాయుతమైన అధికారి అవినీతి బకాసురుడిగా మారడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: UPI యూజర్లకు గుడ్ న్యూస్.. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇస్తున్న BHIM యాప్!