iDreamPost

UPI యూజర్లకు గుడ్ న్యూస్.. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇస్తున్న BHIM యాప్!

మీరు ఆన్ లైన్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తుంటారా? అయితే మీలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ భీమ్ తన కస్టమర్ల కోసం క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది.

మీరు ఆన్ లైన్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తుంటారా? అయితే మీలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ భీమ్ తన కస్టమర్ల కోసం క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది.

UPI యూజర్లకు గుడ్ న్యూస్.. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇస్తున్న BHIM యాప్!

డిజిటల్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చెల్లింపులన్నీ ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. చిన్న కిరాణా కొట్టుల దగ్గర్నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు చెల్లింపులు ఆన్ లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ఆన్ లైన్ ద్వారా పేమెంట్ ప్రక్రియ ఈజీగా ఉండడంతో యూజర్లు డిజిటల్ పేమెంట్ యాప్స్ ను విరివిగా వినియోగిస్తున్నారు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్ ద్వారా నిత్యం వేల సంఖ్యలో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కాగా యూజర్లను పెంచుకునేందుకు ఈ యాప్స్ ఆఫర్స్ ను ప్రకటిస్తుంటాయి. ఈ క్రమంలో ప్రముఖ డిజిటల్ చెల్లింపుల యాప్ భీమ్ వినియోగదారుల కోసం క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ ను ఎలా పొందాలంటే?

ఫుడ్ ఆర్డర్లు, ట్రావెలింగ్ ట్రాన్సాక్షన్స్ తో 150 క్యాష్ బ్యాక్:

యూపీఐ యూజర్లకు భీమ్ యాప్ గుడ్ న్యూస్ అందించింది. ఏకంగా రూ. 750వరకు క్యాష్ బ్యాక్ ను పొందేలా ఆఫర్స్ ను అందిస్తోంది. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ను పొందొచ్చు. భీమ్ యూజర్లు ఫుడ్ ఆర్డర్లకు, ట్రావెలింగ్ ఖర్చుల కోసం ఈ యాప్ ను వాడడం ద్వారా రూ. 150 క్యాష్ బ్యాక్ ను పొందొచ్చు. దీని కోసం వినియోగదారులు 100 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయాల్సి ఉంటుంది. దీంతో రూ. 30 బ్యాక్ వస్తుంది. యూజర్లు 150 పొందేందుకు ఐదు సార్లు క్లెయిమ్ చేసుకోవచ్చు.

రూపే క్రెడిట్ కార్డుతో లింక్ ద్వారా రూ.600 క్యాష్ బ్యాక్:

భీమ్ యాప్ తన యూజర్లకు రూపే క్రెడిట్ కార్డును లింక్ చేయడం ద్వారా కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందిస్తుంది. రూపే క్రెడిట్ కార్డు హోల్డర్స్ తమ కార్డును భీమ్ యాప్ కు లింక్ చేసి రూ. 600 క్యాష్ బ్యాక్ ను పొందొచ్చు. 100 కంటే ఎక్కువ మొత్తంతో జరిపే మొదటి మూడు లావాదేవీలపై రూ. 100 క్యాష్‌బ్యాక్, ఆ తర్వాత ప్రతి నెలా రూ. 200 దాటిన 10 ట్రాన్సాక్షన్స్ పై అదనంగా రూ. 30 క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. నిబంధనల ప్రకారం ఈ ట్రాన్సాక్షన్లను పూర్తి చేస్తే మొత్తంగా రూ.600 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అదే విధంగా భీమ్ యాప్ ఉర్జా 1శాతం స్కీమ్ ద్వారా 1 శాతం క్యాష్ బ్యాక్ ను అందిస్తుంది. భీమ్ యాప్ అందించే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్లు 2024 మార్చి 31 వరకు అందుబాటులో ఉండనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి