రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి!

ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీ పని చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అలా వారు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుంటే.. మరికొందరు మాత్రం లంచాలు తీసుకుంటూ ప్రభుత్వానికి అపకీర్తి తెస్తున్నారు. తాజాగా అధికారి రూ.20 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డారు.

ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీ పని చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అలా వారు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుంటే.. మరికొందరు మాత్రం లంచాలు తీసుకుంటూ ప్రభుత్వానికి అపకీర్తి తెస్తున్నారు. తాజాగా అధికారి రూ.20 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డారు.

ప్రస్తుతం సమాజంలో అక్రమంగా డబ్బులు సంపాదించే వారి సంఖ్య పెరిగిపోయింది. దొంగతనాలు చేసి కొందరు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. మరికొందరు అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి..ప్రజలను పీడించి అవినీతి సొమ్మును మూట కట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి అవినీతి జలగలను ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకుంటారు. ఇప్పటికే అలాగా చాలా మంది ప్రభుత్వంలో పని చేస్తున్న లంచగొండు  అధికారులు జైలు పాలయ్యారు. తాజాగా లంచం తీసుకుంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు చెందిన అధికారి పట్టుబడ్డారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…

తమిళనాడులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విభాగంలో సీనియర్‌ అధికారి అయినా అంకిత్‌ తివారీ లంచం తీసుకుంటూ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దిండిగుల్‌ జిల్లాలో ఓ వైద్యుడి వద్ద రూ.20 లక్షల లంచం తీసుకుంటూ అతడిని అరెస్టు చేసినట్టు ఆ రాష్ట్ర ఏసీబీ అధికారులు వెల్లడించారు. కారులో ప్రయాణిస్తున్న అంకిత్‌ తివారీని దుండిగల్‌ పోలీసుల సాయంతో ఓ టోల్‌గేట్‌ వద్ద ఆపి అరెస్టు చేసినట్టు డీవీఏసీ పేర్కొంది. అదుపులోకి తీసుకున్న అనంతరం మధురై జిల్లా ఈడీ ఆఫీసుపై, అంకిత్ తివారీ ఇంట్లో డీవీఏసీ అధికారులు దాడులు చేపట్టారు. శుక్రవారం రాత్రి నుంచి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ భద్రత నడుమ అధికారులు ఈడీ ఆఫీసులో తనిఖీ చేశారు.

తమిళనాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దిండిగుల్​లో ఓ ప్రభుత్వ వైద్యుడి ఆస్తులకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా అంకిత్​ రూ. కోటి లంచం డిమాండ్​ చేశాడు. ఒప్పందంలో భాగంగా రూ. 20 లక్షలను వైద్యుడు స్థానిక జాతీయ రహదారి పక్కన ఇస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే అరెస్ట్​ ఎప్పుడు జరిగిందన్న దానిపై స్పష్టత రాలేదు. శుక్రవారం మధ్యాహ్నం మద్రాస్​ హైకోర్టులో అంకిత్ తివారీ కేసు విచారణకు రావడంతో అసలు విషయం వెలుగు వచ్చింది.  కోర్టు ఆయనను డిసెంబర్​ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

ఈ కేసు దర్యాప్తులో అనేక ఆసక్తిక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మధురై, చెన్నై ప్రాంతాలకు చెందిన మరికొందరు అధికారుల ఈ అవినీతిలో ప్రమేయం ఉన్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. అంకిత్ ఇప్పటి వరకు చాలా మందిని బ్లాక్ మెయిల్ చేసి వారి నుంచి కోట్ల రూపాయల తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అతను ఇతర ఈడీ అధికారులకు కూడా అవినీతి సొమ్మును పంపిణీ చేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఇదే సమయంలో మరో ప్రచారం జరుగుతోంది. అంకిత్‌ అరెస్ట్‌ తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కావాలనే అంకిత్‌ను ఈ కేసులో ఇరికించారని ప్రచారం జరుగుతోంది. లంచం తీసుకుంటూ ఓ ఈడీ అధికారి పట్టుబడటం సంచలనంగా మారింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments