iDreamPost
android-app
ios-app

ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదు!

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. హస్తినతో పాటు పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత 6.1గా నమైదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు.

దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఆకస్మాత్తుగా భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీతో పాటు జమ్మూకశ్మీర్, ఇస్లామాబాద్ ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పంజాబ్, ఘజియాబాద్, చంఢీగడ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం ఢిల్లీలో భూకంపం చోటుచేసుకుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. భూకంప ప్రభావంతో ప్రజలు ప్రాణ భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ భూకంప ప్రభావంతో ఇప్పటి వరకు ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదు.

ఇటీవల జాపాన్ లో భారీ భూకంపం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భూకంప తీవ్రత ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద పడి ఎంతో మంది గాయాలపాలయ్యారు. వెంటనే అప్పమత్తమైన అక్కడి ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల భూకంపాలు సంభవించాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి కంపిస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏ ఆపద తలెత్తుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు.