iDreamPost
android-app
ios-app

ఢిల్లీలో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం!

ఢిల్లీలో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం!

 ఈ మధ్య కాలంలో దేశంలో వరుస భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. దేశం ఆ మూలనుంచి ఈ మూల వరకు.. ఏదో ఒక చోట భూమి కంపిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా, దేశ రాజధాని ఢిల్లీతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో భూకంపం చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. మూడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దాదాపు 40 సెకన్ల పాటు  భూమి కంపించింది.

దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లు, ఆఫీసులు నుంచి భయంతో బయటకు పరుగులు పెట్టారు. దీనిపై ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెస్మాలజీ’ స్పందించింది. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టింది. ఈ మూడు రాష్ట్రాల్లో వచ్చిన భూకంపం తీవ్రత 6.2 మాగ్నిట్యూడ్‌గా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం భూకంపానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి: ఆ ఆస్పత్రిలో వరుసగా చనిపోతున్న పేషంట్స్! కారణం?