P Krishna
దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం ప్రియులకు వరుసగా ఈసి షాక్ ఇస్తూనే ఉంది. వరుసగా మద్యం షాపులు మూసివేయడంతో మందుబాబులు తెగ ఇబ్బందులు పడుతున్నారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం ప్రియులకు వరుసగా ఈసి షాక్ ఇస్తూనే ఉంది. వరుసగా మద్యం షాపులు మూసివేయడంతో మందుబాబులు తెగ ఇబ్బందులు పడుతున్నారు.
P Krishna
ఇటీవల దేశ వ్యాప్తంగా వరుసగా మద్యం షాపులు పలు కారణాల వల్ల బంద్ ఉండటంతో మద్యం ప్రియులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని కొంతమంది దళారులు క్యాష్ చేసుకుంటున్నారు. మద్యం షాపులు బంద్ రోజు బ్లాక్ లో అమ్ముతూ అడ్డగోలిగా దోచుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతల్లో ఎన్నికలు జరగగా.. త్వరలో మరికొన్ని రాష్ట్రాల్లో ఓట్ల పండగ ఉండబోతుంది. దేశ వ్యాప్తంగా మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ కి రెండు రోజుల ముందు నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మద్యం షాపులు, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయాలని ఈసీ ఆజ్ఞలు జారీ చేస్తుంది. తాజాగా మరో మూడు రోజులు మద్యం షాపులు మూసివేయబోతున్నారు. ఎప్పుడు? ఎక్కడ? అన్న విషయం గురించి తెలుసుకుందాం.
దేశ వ్యాప్తంగా ఎన్నికల సందడి కొనసాగుతుంది.మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలకు పోలింగ్ జరగబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతల్లో ఎన్నికలకు పోలింగ్ జరిగాయి.. త్వరలో మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. తాజాగా మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. మహరాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో వరుసగా మూడు రోజులు డ్రై డే ఉండబోతుంది. శనివారం నుంచి సోమవారం వరకు మద్యం దుకాణాలు మూసి వేయనున్నారు. ఐదవ దశ ఓటింగ్ కు ముందు ముంబై నగరంలో పరిపాలన మే 18 నుంచి 20 వరకు డ్రై డేగా ప్రకటించారు. ఒకవేళ ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది ఈసీ.
మే 18 సాయంత్రం 5 గంటల నుండి 19 వరకు ముంబై నగరంలో మద్యం షాపులు, బార్ లు పూర్తిగా మూసివేయనున్నారు. మే 20 వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత తిరిగి మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. మే 20న మళ్లీ మద్యం షాపులు క్లోజ్ చేసి సాయంత్రం 5 గంటల తర్వాత ఓపెన్ చేస్తారు. ఓటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అలాగే జూన్ 5 న ఓట్ల లెక్కింపు సందర్భంగా ముంబైలో మరోసారి డ్రై డే పాటించనున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది హూలీ, గాంధీ జయంతి, ఆగస్టు 15, జనవరి 26 మహరాష్ట్రతో సహా దేశంలో అధికారికంగా మద్యం షాపులు మూసివేస్తారు.