iDreamPost
android-app
ios-app

టీమిండియాలో నో ప్లేస్.. ఖరీదైన ఇల్లు కొన్న స్టార్ క్రికెటర్! ఎన్నికోట్లంటే?

  • Published Sep 25, 2024 | 12:30 PM Updated Updated Sep 25, 2024 | 12:30 PM

Shreyas Iyer bought an apartment In Mumbai: టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ లగ్జరీ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశాడు. తన తల్లి రోహిణి అయ్యర్ తో కలిసి ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఓ ఇంటిని కొన్నాడు. ఆ ఇంటి ధర ఎన్నికోట్లంటే?

Shreyas Iyer bought an apartment In Mumbai: టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ లగ్జరీ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశాడు. తన తల్లి రోహిణి అయ్యర్ తో కలిసి ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఓ ఇంటిని కొన్నాడు. ఆ ఇంటి ధర ఎన్నికోట్లంటే?

టీమిండియాలో నో ప్లేస్.. ఖరీదైన ఇల్లు కొన్న స్టార్ క్రికెటర్! ఎన్నికోట్లంటే?

సాధారణంగా సెలబ్రిటీలు తమకు నచ్చిన కార్లను, అపార్ట్ మెంట్స్ ను, లగ్జరీ విల్లాను కొంటూ ఉంటారు. తాజాగా ఓ టీమిండియా స్టార్ క్రికెటర్ సైతం ఖరీదైన అపార్ట్ మెంట్ ను తన తల్లితో కలిసి కొనుగోలు చేశాడు. ప్రస్తుతం అతడు భారత జట్టులో చోటుకోల్పోయాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు అతడిని పక్కనపెట్టింది బీసీసీఐ. ఇక దేశవాళీ ట్రోఫీలో సైతం అతడు విఫలం అయ్యాడు. ఈ క్రమంలో లగ్జరీ ఇల్లు కొన్న ఆ స్టార్ ప్లేయర్ ఎవరు? ఎన్ని కోట్లు పెట్టి ఇంటిని కొనుగోలు చేశాడు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ లగ్జరీ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశాడు. తన తల్లి రోహిణి అయ్యర్ తో కలిసి ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ కార్యలయ అధికారులు పేర్కొన్నారు. ఇక ఆ ఇంటి ధర వచ్చేసి అక్షరాలా రూ. 2.90 కోట్లుగా తెలుస్తోంది. ఇక రిజిస్ట్రేషన్ కోసం రూ. 17.40 లక్షలు స్టాంప్ డ్యూటీ అయ్యర్ కట్టినట్లు సమాచారం. ఇక వర్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలోని త్రివేణి ఇండస్ట్రీయల్ CHSL లోని 2వ అంతస్తులో 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అపార్ట్ మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ముంబైలో ఇప్పటికే శ్రేయస్ పేరిట ఓ అపార్ట్ మెంట్ ఉంది. 2020లో ముంబైలోనే అత్యంత ఎంతైన లోధా వరల్డ్ టవర్స్ లోని 48వ అంతస్తులోని ఫ్లాట్ ను ఈ స్టార్ ప్లేయర్ కొనుగోలు చేశాడు. ఇక ఇప్పుడు తన తల్లితో కలిసి మరో అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశాడు.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం టీమిండియాలో చోటు కోసం శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బంగ్లాతో టెస్ట్ సిరీస్ కు అతడిని పక్కనబెట్టింది బీసీసీఐ. దాంతో ఇటీవల ముగిసిన దేశవాళీ టోర్నీ అయిన దులీప్ ట్రోఫీలో ఇండియా-డి జట్టుకు సారథ్యం వహించాడు. కానీ ఇక్కడ కూడా అనుకున్నంతగా రాణించలేకపోయాడు. ఈ టోర్నీలో మెుత్తం ఆరు ఇన్నింగ్స్ ల్లో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే సాధించాడు. రెండు సార్లు డకౌట్ గా వెనుదిరిగాడు. ఇక దులీప్ ట్రోఫీలో విఫలం అయిన అయ్యర్.. త్వరలో ప్రారంభం కానున్న ఇరానీ ట్రోఫీపై దృష్టి పెట్టాడు. ఈ టోర్నమెంట్ లో సత్తాచాటి తిరిగి టీమిండియాలోకి రావాలని భావిస్తున్నాడు. చూడాలి మరి  అయ్యర్ టీమిండియాలోకి ఎంట్రీ ఎప్పుడిస్తాడో?

ఇదికూడా చదవండి: Drona Desai: 18 ఏళ్ల కుర్రాడి ఊహకందని విధ్వంసం.. 86 ఫోర్లు, 7 సిక్సర్లతో 498 రన్స్!