iDreamPost
android-app
ios-app

గూగుల్‌ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి నిండా మునిగారు!

  • Published May 25, 2024 | 4:37 PM Updated Updated May 25, 2024 | 4:37 PM

Driver Fell into The Canal: ఈ మధ్య చాలా మంది కొత్త ప్రదేశాలకు వెళ్లేటప్పుడు గూగుల్‌ మ్యాప్‌ని ఉపయోగించడం ఆనవాయితీ మారింది.. కొన్నిసార్లు గూగుల్‌పై అతివిశ్వాసం నట్టేట ముంచిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Driver Fell into The Canal: ఈ మధ్య చాలా మంది కొత్త ప్రదేశాలకు వెళ్లేటప్పుడు గూగుల్‌ మ్యాప్‌ని ఉపయోగించడం ఆనవాయితీ మారింది.. కొన్నిసార్లు గూగుల్‌పై అతివిశ్వాసం నట్టేట ముంచిన సందర్భాలు కూడా ఉన్నాయి.

గూగుల్‌ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి నిండా మునిగారు!

టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.. మనిషి అవసరాల కోసం ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేపబడుతున్నాడు. సృష్టికి ప్రతి సృష్టి అంటే మరణించిన మనిషికి ప్రాణం పోయడం తప్ప అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు.. స్మార్ట్ ఫోన్ ఉంటే గూగుల్ ద్వారా ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్లే.  ఒకప్పుడు ఏదైనా అడ్రస్ కావాలంటే ఎంతోమందిని అడుగుతూ ఇబ్బందులు పడేవారు.. కానీ ఇప్పుడు గూగుల్ తల్లి పుణ్యమా అని క్షణాల్లో అడ్రస్ తెలుసుకొని తమ గమ్యస్థానాలకు వెళ్తున్నారు. తాజాగా గూగుల్ తల్లిని నమ్ముకొని చేరాల్సిన చోటికి కాకుండా చావు అంచులకు వెళ్లారు. ఈ ఘటన కేరళాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఈ మద్య ప్రతి ఒక్కరూ గూగుల్ పై అతి విశ్వాసంతో ఉంటున్నారు. ఎంత క్లిష్టమైన అడ్రస్ కూడా గూగుల్ మ్యాప్ లో ఇట్టే దొరికిపోతుంది. దీని ద్వారా తాము కోరుకున్న ప్రదేశాలకు వెళ్లిపోతున్నారు. అయితే కొన్నిసార్లు గూగుల్ తల్లిని గుడ్డిగా నమ్మి తప్పుడు అడ్రస్ కి వెళ్లి నానా ఇబ్బందులు పడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. కొత్త ప్రదేశాలకు వెళ్లేటప్పుడు గూగుల్‌ మ్యాప్‌ని ఉపయోగించడం సర్వ సాధారణం అయ్యింది.. ఎవరినీ సంప్రదించకుండా కేవలం గూగుల్ మ్యాప్ ద్వారా తమ గమ్యస్థానాలకు వెళ్తున్నారు. కొన్నిసార్లు గూగుల్ ని గుడ్డిగా నమ్మి బోల్తా పడి అడ్రస్ గల్లంతైన వారు కూడా ఉన్నారు. తాజాగా అలాంటి సంఘటనే హైదరాబాద్ లో జరిగింది.

గూగుల్ తల్లిని నమ్ముకున్నారు.. దాని ప్రకారమే ఫాలో అయ్యారు. తీరా మ్యాప్ చూపించిన ప్రకారం వెళ్లి కారుతో సహా నీటిలో మునిగిపోయారు. హైదరాబాద్ కి చెందిన నలుగురు కేరళలోని అలప్పజ పర్యటణకు బయలుదేరారు. ఆ సమయానికి భారీగా వర్షం పడుతుంది. వాగులు పొంగిపొర్లుతున్నాయి.. రోడ్డుపై వరదలు వచ్చినా గూగుల్ మ్యాప్ ని నమ్ముకొని ముందుకు సాగారు. అలా కొంత దూరం వెల్లిన తర్వాత వరద నీటి నుంచి డైరెక్ట్ గా కాలువలోకి వెళ్లారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని కాపాడటంతో అదృష్టం కొద్ది  ప్రాణాలతో బయటపడ్డారు… కానీ కారు మాత్రం నీట మునిగింది. తర్వాత గ్రామస్థుల సహాయంతో కారును బయటకు తీసుకువచ్చారు.  అందుకే గూగుల్ మ్యాప్ విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ సరైన గమ్యస్థానానికి చేరుకోవాలని అంటున్నారు.