iDreamPost

94 ఏళ్ల చరిత్ర.. రూ.వేల కోట్ల బిజినెస్.. పార్లే-జీ సక్సెస్ వెనుక 12 ఏళ్ల పిల్లాడి కృషి!

పార్లేజీ బిస్కెట్ కంపెనీ సక్సెస్ వెనకాల ఓ 12 ఏళ్ల బాలుడు చేసిన కృషి ఉంది. 1929లో ప్రారంభమైన ఈ కంపెనీ నేడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించింది.

పార్లేజీ బిస్కెట్ కంపెనీ సక్సెస్ వెనకాల ఓ 12 ఏళ్ల బాలుడు చేసిన కృషి ఉంది. 1929లో ప్రారంభమైన ఈ కంపెనీ నేడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించింది.

94 ఏళ్ల చరిత్ర.. రూ.వేల కోట్ల బిజినెస్.. పార్లే-జీ సక్సెస్ వెనుక 12 ఏళ్ల పిల్లాడి కృషి!

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరు ఇష్టపడేది పార్లే జీ బిస్కెట్లు. దేశంలో పార్లేజీ కంపెనీ బిస్కెట్లకు విశేషమైన ఆదరణ ఉంది. ఎక్కువగా టీ టైమ్ స్నాక్ గా పార్లే బిస్కెట్లను ఉపయోగిస్తుంటారు. దేశంలోనే కాక ప్రపంచ దేశాల్లో కూడా పార్లేజీ కంపెనీలు ఉన్నాయి. భారత దేశంలోని బ్రాండెడ్ కంపెనీలల్లో పార్లేజీ ఒకటి. వరల్డ్ వైడ్ గా ఎక్కువగా అమ్ముడవుతున్న బిస్కెట్లు ఏవంటే అది ఒక్క పార్లేజీ బ్రాండ్ బిస్కెట్లు మాత్రమే అని తెలుస్తోంది. అయితే ఇంతటి పేరుగాంచిన పార్లేజీ కంపెనీ సక్సెస్ వెనకాల ఓ 12 ఏళ్ల పిల్లాడి కృషి దాగుంది. అసలు పార్లేజీ కంపెనీ ఎలా మొదలైందంటే?

పార్లే బిస్కెట్లను ఏదో ఒక సందర్భంలో మనందరం తినే ఉంటాము. మార్కెట్ లో ఎన్నిరకాల బిస్కెట్ కంపెనీలు ఉన్నా పార్లేజీ బిస్కెట్లకు ఉండే డిమాండే వేరు. దేశ వ్యాప్తంగా చాలా ఫేమస్. అయితే పార్లే ఉత్పత్తులు 1929లో స్థాపించబడ్డాయి. 1938లో మొదటిసారి బిస్కెట్‌ను తయారు చేశారు. భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందే పార్లే జీ బిస్కెట్ కంపెనీ మొదలైంది. అయితే పార్లేజీ కంపెనీ ప్రారంభం వెనకాల 12 ఏళ్ల బాలుడు ఉన్నాడు. దక్షిణ గుజరాత్‌లోని ఒక చిన్న పట్టణానికి చెందిన 12 ఏళ్ల వయసున్న బాలుడు ఏదో కారణాల వల్ల తన ఇంట్లో చెప్పకుండా పారిపోయి ముంబైకి చేరుకున్నాడు. ఆ బాలుడి పేరు మోహన్‌లాల్ దయాల్.

ముంబైలో బతుకుదెరువు కోసం మోహన్ లాల్ చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే వాడు. ఆ తర్వాత టైలరింగ్ నేర్చుకుని కొంత కాలం ఆ వృత్తిలో కొనసాగాడు. అయితే తన ఆలోచనలు అక్కడితో ఆగలేదు. మరింత ముందుకు సాగి 18 సంవత్సరాల వయస్సులో ముంబైలోని కామ్‌దేవి ప్రాంతంలో ఒక కిరాణా కొట్టును ప్రారంభించాడు. కొంత కాలానికి దాని స్థానంలో స్వీట్ల దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్వీట్ల దుకాణమే నేటి పార్లే-జి గ్రూప్ కు కారణమైంది. జర్మన్ టెక్నాలజీతో నడిచే యంత్రాలను భారత్ కు దిగుమతి చేసుకున్నారు మోహన్ లాల్.

అప్పటి నుంచి బిస్కెట్ల తయారీని ప్రారంభించారు. భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత పార్లే జీ గ్రూప్ వ్యాపారం పెరగడం ప్రారంభమైంది. రుచికరంగా, ధర కూడా చౌకగా ఉండడంతో దేశ ప్రజలు విదేశీ స్నాక్స్ కు బదులు పార్లేజీ బిస్కెట్లను కొనడం ప్రారంభించారు. 94 ఏళ్ల చరిత్ర కలిగిన పార్లేజీ కంపెనీ నేడు రూ.16,202 కోట్ల వార్షిక ఆదాయంతో దూసుకెళ్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పార్లేజీ తన సత్తా చాటుతోంది. మరి పార్లేజీ కంపెనీ స్థాపన వెనకాల 12 ఏళ్ల బాలుడు చేసిన కృషిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి