సక్సెస్ అంటే ఇది కదా.. కోచింగ్ లేకుండానే సివిల్స్ క్లియర్.. 21 ఏళ్లకే IPS, 22 ఏళ్ళకు IAS

Divya Tanwar: సివిల్స్ సాధించడం అందరికీ ఓ కల. కానీ అది సాధ్యమయ్యే పనికాదు. అలాంటిది ఎలాంటి కోచింగ్ లేకుండా 21 ఏళ్ల వయసులో ఐపీఎస్, 22 ఏళ్లకు ఐఏఏస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.

Divya Tanwar: సివిల్స్ సాధించడం అందరికీ ఓ కల. కానీ అది సాధ్యమయ్యే పనికాదు. అలాంటిది ఎలాంటి కోచింగ్ లేకుండా 21 ఏళ్ల వయసులో ఐపీఎస్, 22 ఏళ్లకు ఐఏఏస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.

దేశంలో ప్రతిష్ఠాత్మక సర్వీసులు ఐఏఏస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. ఈ సర్వీసుల్లోకి ఎంపిక కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షనే సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీస్ పరీక్ష కోసం లక్షలాది మంది పోటీపడుతుంటారు. ఐఏఏస్, ఐపీఎస్ సర్వీసులకు ఎంపికై ప్రజలకు సేవ చేయాలని భావిస్తుంటారు. అందుకే సివిల్స్ కు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. కొడితే సివిల్ సర్వీస్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగిస్తుంటారు. డూ ఆర్ డై అన్నట్టుగా సివిల్స్ కోసం సన్నద్ధమవుతుంటారు. కోచింగ్ సెంటర్లలో చేరి రేయింభవళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు సివిల్ అభ్యర్థులు. ఫస్ట్ అటెంప్ట్ మిస్ అయినా సరే నిరుత్సాహ పడకుండా మళ్లీ ప్రయత్నిస్తారు.

అయితే అందరికీ సివిల్స్ సాధించడం సాధ్యం కాదు. కృషి, డెడికేషన్, పక్కా ప్రణాళిక, సరైన కోచింగ్ తో ప్రిపేర్ అయితే తప్పా సివిల్ సర్వెంట్ అవ్వాలనే కల నెరవేరదు. అందుకే ఆకలి నీళ్లు మరిచి గంటలు గంటలు చదువుతుంటారు. అయితే ఎలాంటి కోచింగ్ లేకుండానే ఓ యువతి ప్రిపేర్ అయి సివిల్స్ సాధించిందంటే ఆశ్చర్యం కలుగకమానదు. యూత్ అంతా ఆశ్చర్యపోయేలా, అందరికీ స్ఫూర్తి నింపేలా ఓ యంగ్ ఉమెన్ సివిల్స్ లో సక్సెస్ అయ్యింది. సొంతంగా ప్రిపేర్ అయి సివిల్స్ క్లియర్ చేసింది. ఏకంగా వరుసగా రెండు సంవత్సరాలు సివిల్స్ సాధించి ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె మరెవరో కాదు హర్యానాకు చెందిన దివ్య తన్వార్. ఈ యువతి 21 ఏళ్లకే IPS, 22 ఏళ్ళకు IAS సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ యువ ఐఏఎస్ ఆఫీసర్ పై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. దివ్య తన్వర్ సక్సెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దివ్య తన్వార్ హర్యానాలోని మహేంద్రఘడ్ జిల్లా నింబి గ్రామానికి చెందిన యువతి. ఈమె నవోదయ విద్యాలయలో పాఠశాల విద్య పూర్తి చేసింది. మహేంద్రఘడ్‌లోని మహిళా ప్రభుత్వ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసింది. డిగ్రీ తర్వాత యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌కి ప్రిపరేషన్ మొదలు పెట్టింది. అయితే చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడంతో తల్లి బబిత తన్వార్ ఓ ఇంట్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో దివ్య కోచింగ్ కు వెళ్లలేకపోయింది. దీంతో సొంతంగానే ప్రిపరేషన్ ప్రారంభించింది. మొక్కవోని దీక్షతో రోజుకు 12 గంటలపాటు ప్రిపేర్ అయ్యేది.

సివిల్స్ క్లియర్ చేయడమే లక్ష్యంగా దివ్య ముందుకు సాగింది. ఈ క్రమంలో 2021లో మొదటి అటెమ్ట్‌ లోనే దివ్య ఆల్ ఇండియా 438వ ర్యాంక్ సాధించింది. 21 ఏళ్లకే ఐపీఎస్ ఆఫీసర్‌‌ అయిన తొలి ఇండియన్‌గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ తర్వాత 2022లో మళ్లీ యూపీఎస్సీ సీఎస్‌ఈ ప్రిపరేషన్‌ మొదలు పెట్టింది. ఈసారి ఆలిండియా 105వ ర్యాంక్ సాధించింది. ఇలా 21 ఏళ్లకు ఐపీఎస్, 22 ఏళ్లకు ఐఏఎస్‌గా సెలక్ట్ అయ్యి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచింది. పేదరికం అడ్డు వచ్చినా బెదరకుండా కష్టాల కడలిని దాటి సక్సెస్ అయ్యింది దివ్య తన్వర్. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందన్న వ్యాఖ్యలను నిజం చేసింది. మరి కోచింగ్ లేకుండానే సివిల్స్ క్లియర్ చేసిన దివ్య తన్వార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments