nagidream
Did You Know: వెయిటింగ్ లిస్టులో రైలు టికెట్లు బుక్ చేసినప్పుడు GNWL30/WL8 ఇలాంటి నంబర్ ఒకటి కనిపిస్తుంది. చాలా మందికి ఇదేంటో, ఈ కోడ్ కి అర్ధమేంటో తెలియకపోవచ్చు. దీని వల్ల టికెట్ బుక్ చేసుకున్నాక తిప్పలు పడతారు. అందుకే ఈ కథనంలో దీని అర్ధమేంటో తెలుసుకోండి.
Did You Know: వెయిటింగ్ లిస్టులో రైలు టికెట్లు బుక్ చేసినప్పుడు GNWL30/WL8 ఇలాంటి నంబర్ ఒకటి కనిపిస్తుంది. చాలా మందికి ఇదేంటో, ఈ కోడ్ కి అర్ధమేంటో తెలియకపోవచ్చు. దీని వల్ల టికెట్ బుక్ చేసుకున్నాక తిప్పలు పడతారు. అందుకే ఈ కథనంలో దీని అర్ధమేంటో తెలుసుకోండి.
nagidream
రైలు టికెట్లు బుక్ చేసుకునే క్రమంలో కొన్నిసార్లు బెర్త్ కన్ఫర్మ్ కాదు. సీట్లు ఫిల్ అయిపోయాక రైల్వేశాఖ వెయిటింగ్ లిస్ట్ టికెట్లను జారీ చేస్తుంది. ఆ సమయంలో ఎవరైనా టికెట్ బుక్ చేసుకుంటే కనుక GNWL30/WL8 వంటి నంబర్ తో ఒక టికెట్ జారీ అవుతుంది. అయితే ఇందులో వెయిటింగ్ లిస్ట్ నంబర్ ఎంతో తెలుసుకోవడంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అసలు GNWL30/WL8లో GNWLకి, WLకి తేడా ఏంటి?
GNWL అంటే జనరల్ వెయిటింగ్ లిస్ట్ అని.. WL అంటే వెయిటింగ్ లిస్ట్ అని అర్థం. జనరల్ వెయిటింగ్ లిస్టులో ఉన్న నంబర్.. ఎంతమందికి టికెట్లు జారీ చేయబడిందో సూచిస్తుంది. ఆ సమయంలో ఎవరైనా టికెట్ బుక్ చేసుకుంటే జనరల్ వెయిటింగ్ లిస్ట్ లో ఇంకో నంబర్ పెరుగుతుంది. ఇలా ఎంతమంది బుక్ చేసుకుంటే అన్ని నంబర్స్ పెరుగుతాయి. ఎవరైనా వెయిటింగ్ లిస్టులో టికెట్ బుక్ చేసుకున్న వారు ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్ లో నంబర్స్ తగ్గుతాయి.
ఉదాహరణకు వెయిటింగ్ లిస్ట్ లో టికెట్లు బుక్ చేసిన 30 మందిలో 22 మంది టికెట్ రద్దు చేసుకుంటే GNWL30/WL8 అని ఉంటుంది. అంటే వెయిటింగ్ లిస్టులో ఉన్నది 8 మంది మాత్రమే. కాబట్టి సీటు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈసారి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీకు ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ టికెట్ లో TQWL అని చూపిస్తే.. తత్కాల్ కోటాలో టికెట్ బుక్ చేసినట్టు. తత్కాల్ లో బుక్ చేసినప్పుడు టికెట్లు అయిపోయినప్పుడు TQWL కోటాలో టికెట్లు జారీ చేస్తారు. మామూలుగా ఛార్ట్ రూపొందించే సమయంలో ముందు జనరల్ వెయిటింగ్ లిస్ట్ కే తొలి ప్రాధాన్యం ఇస్తారు. అందుకే తత్కాల్ లో వెయిటింగ్ లిస్ట్ వస్తే టికెట్ కన్ఫర్మ్ అవ్వడానికి ఛాన్స్ తక్కువగా ఉంటుంది.
ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న టికెట్ కన్ఫర్మ్ కాకపోతే రైలులోకి అనుమతించరు. ఛార్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా టికెట్ ని రద్దు చేస్తారు. ఇవి కాకుండా టికెట్లపై PQWL అని, RQWL అని ఉంటాయి. PQWL అంటే పూల్డ్ కోటా అని, RQWL అంటే రిమోట్ లొకేషన్ కోటా అని అర్థం. రైలు బయలుదేరే స్టేషన్లు, చేరుకునే గమ్యం స్టేషన్లు కాకుండా మధ్యలో ఉండే నగరాలు, పట్టణాలు రిమోట్ లొకేషన్ కోటా కిందకు వస్తాయి. తక్కువ దూర ప్రయాణాలు పూల్డ్ కోటా కిందకు వస్తాయి. షార్ట్ డిస్టెన్స్ ప్రయాణాలకు ఈ టికెట్లు కేటాయిస్తారు. అయితే ఒక రైలుకి ఒక పూల్డ్ కోటా మాత్రమే ఉంటుంది. ఛార్ట్ కూడా వేరేగా ఉంటుంది. ఈ పూల్డ్ కోటా కింద బుక్ చేసిన టికెట్లు నిర్ధారణ అవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.