తీవ్ర విషాదం.. మరణంలోనూ కొడుకు చేతిని వదలని తల్లి

ఢిల్లీలో మరో విషాదం నెలకొంది. భారీ వర్షం కారణంగా రాజేంద్ర నగర్‌లోని రావూస్ స్టడీ సర్కిల్ (ఐఏఎస్ అకాడమి) నీట మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంగతి విదితమే. ఇప్పుడు..

ఢిల్లీలో మరో విషాదం నెలకొంది. భారీ వర్షం కారణంగా రాజేంద్ర నగర్‌లోని రావూస్ స్టడీ సర్కిల్ (ఐఏఎస్ అకాడమి) నీట మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంగతి విదితమే. ఇప్పుడు..

ఈ ఏడాది దేశ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు జలాశయాలు నిండు కుండల్లాగా మారిపోయాయి. అలాగే చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. ఇదిలా ఉంటే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక కేరళలో ఈ వర్షాలు, వరదల ధాటికి కొండ చరియలు విరిగిపడి నాలుగు గ్రామాలు బురదలో కూరుకుపోయిన సంగతి విదితమే. ఈ విషాదకర ఘటనలో ఇప్పటికే 200 మందికి పైగా మరణించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లో కూడా క్లౌడ్ బరస్ట్ కావడంతో 20 మంది గల్లంతు అయినట్లు సమాచారం. ఈ రెండు సంఘటనలకు ముందు ఢిల్లీని కుదిపేశాయి వానలు. భారీ వర్షం కారణంగా రాజేంద్ర నగర్‌లోని రావూస్ స్టడీ సర్కిల్ (ఐఏఎస్ అకాడమీ) నీట మనిగి తానియా సోనీ, శ్రేయా యాదవ్, నవీన్ డెల్విన్ మృతి చెందిన సంగతి విదితమే.

ఈ ఘటన మర్చిపోక ముందు ఇప్పుడు మరో హృదయ విదారరక ఘటన చోటుచేసుకుంది. భారీ వరదలతో తల్లీ కొడుకులు కాలువలో పడి మరణించారు. ఈ ఘటన ఘాజీపూర్‌లో చోటుచేసుకుంది. తనూజా బిష్త్ అనే మహిళ తన మూడేళ్ల కొడుకు ప్రియాంష్‌తో కలిసి ఘాజీపూర్‌లోని వీక్లీ మార్కెట్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా వర్షం పడటం స్టార్ట్ అయ్యింది. ఒక్కసారిగా పెద్ద వాన కురవడంతో రోడ్లన్నీ జలమయయ్యాయి. ఇంటికి వెళ్లాలన్న కంగారులో నడుస్తుండగా మురికి కాలువలో తల్లీకొడుకులు కొట్టుకు పోయారు. కొన్ని గంటల తర్వాత.. ఇద్దరు పడిపోయిన ప్రాంతం నుండి 500 మీటర్ల దూరంలో వీరి మృతదేహాలను వెలికి తీశారు రెస్య్కూ సిబ్బంది. అప్పుడు కూడా కొడుకును తల్లీ చేయి పట్టుకుని కనిపించడం ఆ దృశ్యాన్ని చూసిన వారి హృదయాలను ధ్రవీంచేలా చేసింది.

ఇదిలా ఉంటే సకాలంలో రెస్య్కూ ఆపరేషన్ చేసి ఉంటే.. తల్లీ కొడుకులు బతికి ఉండేవాని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త గోవింద్ సింగ్ నోయిడాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రమాదం జరిగే సమయంలో అతడు డ్యూటీలో ఉన్నాడు. భార్య, బిడ్డ చనిపోయారని తెలిసి కన్నీటి పర్యంతం అవుతున్నాడు. రెస్క్యూ ఆపరేషన్ వేగంగా జరిగితే  భార్య, కొడుకును కాపాడేవాళ్లమని, ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు భర్త. సాయంత్రం 7.30 గంటలకు ప్రమాదం జరగ్గా.. 100 కాల్ చేసినా స్పందన లేదని, పోలీసులు రెస్య్కూ టీమ్‌తో ఆలస్యంగా చేరుకున్నారని, సరైన పరికరాలు కూడా లేవని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. రెండు గంటల మృతదేహాలను వెలికి తీశారంటూ పేర్కొన్నారు. తనూజ, ప్రియాంష్‌లను ఓ ప్రైవేట్ క్యాబ్‌లో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని.. ప్రభుత్వం కనీసం అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయలేదని కన్నీరు పెట్టుకున్నారు.

Show comments