Keerthi
Vande Bharat Train: వందే భారత్ ట్రైన్స్ లో మొదటి నుంచి ఏదో ఒక సమస్యలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వరుసగా ఏదో ఒక సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వందే భారత్ ట్రైన్ లో మరో కొత్త సమస్య తలెత్తింది. ఈసారి ఏకంగా ప్రయాణికులపై వర్షపు నీళ్లు లీక్ అయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ మారింది.
Vande Bharat Train: వందే భారత్ ట్రైన్స్ లో మొదటి నుంచి ఏదో ఒక సమస్యలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వరుసగా ఏదో ఒక సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వందే భారత్ ట్రైన్ లో మరో కొత్త సమస్య తలెత్తింది. ఈసారి ఏకంగా ప్రయాణికులపై వర్షపు నీళ్లు లీక్ అయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ మారింది.
Keerthi
దేశంలో రైల్వే వ్యవస్థను మరింత మేరుగు పరిచేందుకు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రావడంతో.. ప్రజలకు ప్రయాణం మరింత సులభంగా మారింది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ఈ వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. పైగా అత్యంత టెక్నాలజీతో రూపొందించిన ఈ రైలుకు అనూహ్య స్పందన వస్తుంది. ముఖ్యంగా అత్యంత వేగంగా ప్రయాణించే ఈ రైలు అతి తక్కువ సమయంలోనే ప్రయాణికుల గమ్యస్థానాలకు చేరుకుంటుంది. అలాగే ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రయాణికుల రద్దీ కూడా బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే.
కానీ, ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో మొదటి నుంచి ఏదో ఒక సమస్యలు తలెత్తున్నాయి. ముఖ్యంగా గంటల పాటు రైల్వే స్టేషన్ లో రైల్లు నిలిచిపోవడం, డోర్లు తెరవకపోవడం వంటి ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. దీంతో పాటు ఈ మధ్య ఆహార పదార్థలు కూడా నాణ్యత లేనివి, పురుగులు ఉన్నవి ప్రయాణికులకు విక్రయిస్తున్న ఘటనలు బయట పడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఈ వందే భారత్ ట్రైన్ లో మరోక కొతత్త సమస్య బయట పడింది. ఈసారి ఏకంగా ప్రయాణికులపై వర్షపు నీళ్లు లీక్ అయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
తాజాగా వందే భారత్ ట్రైన్ పై కప్పు నుంచి నీళ్లు లీకవుతూ.. ప్రయాణికుల మీద పడటంతో వారు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. కాగా, అది ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్తున్న వందేభారత్ రైలుగా తెలిసింది. ఇక ఈ వందే భారత్ ట్రైన్ లో పై కప్పు నుంచి వర్షపు నీళ్లు లీకయ్యాయి. ఇక ఆ నీళ్లు కాస్త ప్రయాణికుల మీద పడటంతో వారికి నరకంగా అనిపించింది. ఇకపోతే ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను ఓ మహిళ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. వందేభారత్ రైలు పరిస్థితిని చూడండి, ఈ రైలు ఢిల్లీ-వారణాసి మార్గంలో నడుస్తుంది. ఇక వందే భారత్ ట్రైన్ సంఖ్య 22416 అని తెలిపింది.
దీంతో నెటిజన్స్ ఆ వీడియోను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అలాగే వేలకు వేలు టికెట్ ధరలు పెట్టి వెళ్తున్న ఈ రైలులో ప్రయాణికులు ఇలాంటి అసౌకర్యనికి గురవ్వడంపై తీవ్ర మండిపడుతున్నారు. అయితే ఈ ఘటనపై నార్తన్ రైల్వే స్పందిస్తూ పైపులు తాత్కాలికంగా మూసుకుపోవడంతో కోచ్‌లో కొద్దిపాటి నీటి లీకేజీ కనిపించింది. ఇక రైల్లోని సిబ్బంది వచ్చి సరిచేశారని, అలాగే ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు. మరి, వందేభారత్ ట్రైన్ లో వర్షపు నీరు లీకవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
वंदेभारत ट्रेन का हाल देखिए
ये ट्रेन दिल्ली-वाराणसी रुट पर दौड़ती है.
वंदेभारत का नंबर है 22416. pic.twitter.com/uMO8I65FZa
— Priya singh (@priyarajputlive) July 2, 2024