iDreamPost
android-app
ios-app

గ్యాంగ్ స్టర్స్ లవ్ మ్యారేజ్.. ప్రభుత్వమే భద్రత కల్పిస్తూ!

Police Security For Gangster Marraiage: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక వివాహం గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. అదేదీ సెలబ్రిటీనో, పొలిటికల్ ఫ్యామిలోనో కాదు. ఒక గ్యాంగ్ స్టర్ కపుల్ పెళ్లికి సంబంధించి. మరి.. వాళ్ల పెళ్లి ఎందుకంత స్పెషలో చూద్దాం.

Police Security For Gangster Marraiage: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక వివాహం గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. అదేదీ సెలబ్రిటీనో, పొలిటికల్ ఫ్యామిలోనో కాదు. ఒక గ్యాంగ్ స్టర్ కపుల్ పెళ్లికి సంబంధించి. మరి.. వాళ్ల పెళ్లి ఎందుకంత స్పెషలో చూద్దాం.

గ్యాంగ్ స్టర్స్ లవ్ మ్యారేజ్.. ప్రభుత్వమే భద్రత కల్పిస్తూ!

సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సభో, పర్యటనో ఉంటే.. ఆ ప్రాంతంలో లేదా ఆ భవనంలో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. మెటర్ డిడెక్టర్లు, సీసీటీవీలు, డ్రోన్ కెమెరాలతో పహారా, అడుగడుగునా పోలీసులను పెడతారు. కానీ, ఇలాంటి హంగామా ఒక పెళ్లికి జరుగుతోంది. అదేంటి అంత భద్రత ఉంది అంటే కచ్చితంగా ఏ రాజకీయ నాయకుడి కుటుంబమో.. బడా వ్యాపారవేత్తలో అనుకోకండి. ఇంత భద్ర కల్పించింది ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ ప్రేమ పెళ్లికి. అవును.. ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ పెళ్లికే పోలీసులు ఇంత భద్రత ఇస్తున్నారు. మరి.. అంత అవసరం ఎందుకు వచ్చిందో చూద్దాం.

ఈ పెళ్లి తంతు తిహార్ జైలులో ఉన్న ఓ గ్యాంగ్ స్టర్, బెయిల్ పై ఉన్న మహిళా క్రిమినల్ పెళ్లికే ఈ ఏర్పాట్లు. మార్చి 12న ఢిల్లీ ద్వారకా సెక్టార్ 3లో ఉన్న సంతోష్ గార్డెన్ లో ఈ గ్యాంగ్ స్టర్స్ వివాహం జరగనుంది. ఈ వివాహంలో ఎలాంటి అనుకోని సంఘటనలు జరగకుండా.. పోలీసుల కస్టడీ నుంచి నిందితుడు పారిపోకుండా ఉండేందుకు ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సంతోష్ గార్డెన్ ను ఒక శత్రుదుర్భేద్యమైన కోటలా మార్చేశారు. గ్యాంగ్ స్టర్ సందీప్ గతంలో హరియాణా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అంతేకాకుండా తన సహచరులను తప్పించేందుకు పోలీసులతో దాడి కూడా చేయించాడు. అలాగే వీరి పెళ్లి నేపథ్యంలో గ్యాంగ్ వార్ కూడా జరిగే అవకాశం ఉందంట. ఇలాంటి అనర్థాలు జరగకుండా ఢిల్లీ పోలీసులు ముందుగానే వివాహం జరుగుతున్న సంతోష్ గార్డెన్ కు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.

ఈ పెళ్లికి సందీప్ తరఫు నుంచి 150 మంది అతిథిలు హాజరు కాబోతున్నారు. పెళ్లి కొడుకు వివరాల చూస్తే..  హరియాణాకు చెందిన సందీప్ అలియాస్ కాలా జథేడీ. ఇతను గ్యాంగ్ స్టర్ లారెన్స్ భిష్ణోయ్ కి అత్యంత సన్నిహితుడు. ఇతనిపై పలు కేసులు ఉన్నాయి. ఇతను ప్రస్తుతం తీహార్ జైలులో ఉండగా.. పెళ్లి కోసం కోర్టు 6 గంటలు పెరోల్ ఇచ్చింది. అలాగే పెళ్లి కూతురు అనురాధా చౌదరీ అలియాస్ మేడమ్ మిజ్ రాజస్థాన్ కు చెందిన యువతి. ఈమె గ్యాంగ్ స్టర్ ఆనంద్ పాల్ సింగ్ దగ్గర పని చేసేది. ఈమెపై ఛార్జ్ షీట్ ఉంది. ప్రస్తుతానికి మాత్రం బెయిల్ మీద ఉంది. వీళ్లిద్దరు గత నాలుగున్నరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు మార్చి 12న వివాహం చేసుకోబోతున్నారు.

భద్ర ఎలాగంటే?:

ఈ పెళ్లికి పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. భవనం ఎంట్రన్స్ లో మెటల్ డిటెక్టర్లు ఉంచనున్నారు. అంతేకాకుండా బార్ కోడ్ కలిగిన స్కానబుల్ బ్యాండులను పెళ్లికి వచ్చేవారికి అందజేయనున్నారు. పార్కింగ్ లోకి ఎంట్రీ పాస్ లేని ఏ వాహనాన్ని కూడా అనుమతించరు. వీటికి సీసీటీవీలు, డ్రోన్లతో పహారా అదనం. ఈ మొత్తం బందోబస్తుకు ఢిల్లీ పోలీసులు 250 మంది రేపు పెళ్లిలో విధుల్లో ఉండనున్నారు.ఈ పెళ్లి కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయుధాలు కలిగిన స్వాట్ టీమ్ ని మోహరిస్తారు. ఎన్ఐఏ కూడా ఈ పెళ్లిపై నిఘా పెట్టనున్నట్లు సమాచారం.