iDreamPost
android-app
ios-app

లవ్ మ్యారేజ్ లపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

  • Author Soma Sekhar Published - 09:45 PM, Thu - 26 October 23

ప్రేమ పెళ్లిళ్ళ గురించి ఢిల్లీ హైకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పుపై యువతీ, యువకులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. తల్లిదండ్రులు మాత్రం షాక్ కు గురవుతున్నారు.

ప్రేమ పెళ్లిళ్ళ గురించి ఢిల్లీ హైకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పుపై యువతీ, యువకులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. తల్లిదండ్రులు మాత్రం షాక్ కు గురవుతున్నారు.

  • Author Soma Sekhar Published - 09:45 PM, Thu - 26 October 23
లవ్ మ్యారేజ్ లపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రేమ పెళ్లిళ్ళ గురించి ఢిల్లీ హైకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. మేజర్లు అయిన యువతీ, యువకులు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే.. వారి తల్లిదండ్రులుగానీ. కుటుంబ సభ్యులు గానీ వారి పెళ్లికి అడ్డుచెప్పడానికి వీలు లేదని ఢిల్లీ హైకోర్ట్ స్పష్టం చేసింది. భారత రాజ్యంగం ప్రకారం తమకు నచ్చిన వ్యక్తులను పెళ్లి చేసుకునే హక్కు వారికుందని తాజాగా ఇచ్చిన తీర్పులో వెల్లడించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని ఓ జంట హైకోర్టును ఆశ్రయించింది.

నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు రాజ్యంగం యువతీ, యువకులకు కల్పించిందని, ఆ హక్కుకు భంగం కలించే అధికారం ఎవరికీ లేదని ఢిల్లీ హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తమకు కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఓ జంట హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. కుటుంబ సభ్యులపై సీరియస్ అయ్యింది. ఆ జంటకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీస్ లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పులో భాగంగా.. నచ్చిన వారిని పెళ్లి చేసుకునే హక్కు రాజ్యంగం కల్పించిందని, అలాగే పౌరులకు రక్షణ కూడా ఉంటుందని జస్టిస్ తుషార్ రావు గేదల తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మేజర్ల పెళ్లికి కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం చెప్పలేరని న్యాయస్థానం వెల్లడించింది. కాగా.. ఈ తీర్పుపై యువతీ, యువకులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. తల్లిదండ్రులు మాత్రం షాక్ కు గురవుతున్నారు. మరి ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.