మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ను ఇప్పట్లో అరెస్టు చేయలేరు.. కారణం ఏంటంటే?

Puja Khedkar: వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ నకిలీ ధృవ పత్రాలతో యూపీఎస్సీ పరీక్షలకు హాజరైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో యూపీఎస్సీ విచారణ చేపట్టింది. ఈ కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

Puja Khedkar: వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ నకిలీ ధృవ పత్రాలతో యూపీఎస్సీ పరీక్షలకు హాజరైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో యూపీఎస్సీ విచారణ చేపట్టింది. ఈ కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కు భారీ ఉపశమనం లభించింది. ఆమెను అరెస్టు చేయొద్దంటూ ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ముందస్తు బెయిల్ వ్యవధిని పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. గత కొంత కాలంగా ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఫేక్ సర్టిఫికేట్లతో.. దివ్యాంగ కోటాను యూజ్ చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రిజర్వేషన్ బెనిఫిట్స్ పొందేందుకు యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష దరఖాస్తులో తప్పుడు సమాచారం అందించినట్లు పూజా ఖేద్కర్ పై ఆరోపణలు ఉన్నాయి. కాగా అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఉన్న ఆమె తనకు కలెక్టర్ స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేయడంతో వివాదం చెలరేగింది.

పూజా ఖేద్కర్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఫేక్ సర్టిఫికెట్లతో పలుమార్లు యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు హాజరైనట్లు తేలింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకుంది. పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. భవిష్యత్తులో పరీక్షలు రాయకుండా నిషేధించింది. ఈ క్రమంలో పూజా ఖేద్కర్ యూపీఎస్సీ నిర్నయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రొబెషనరీ ఆఫీసర్ గా తన నియామకం తర్వాత తనను తొలగించే హక్కు యూపీఎస్సీకి లేదని ఖేద్కర్ హైకోర్టుకు తెలిపారు. ఎలాంటి చర్యలు తీసుకున్నా కేంద్ర సిబ్బంది మరియు శిక్షణ విభాగం (డిఓపిటి) మాత్రమే తీసుకోగలదని పూజ ఖేద్కర్ బుధవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు.

దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు పూజా ఖేద్క‌ర్‌ ముందస్తు బెయిల్ వ్యవధిని పొడిగించింది. ఆమె ముందస్తు బెయిల్‌ను హైకోర్టు సెప్టెంబర్ 5 వరకు పొడిగించింది. కేసు దర్యాప్తులో ఉన్న కారణంగా ఆమెను అరెస్టు చేయరాదని తెలిపింది. దీంతో ఖేద్కర్‌కు ప్రస్తుతానికి అరెస్టు నుంచి ఉపశమనం లభించింది. ఈ కేసులో పూజా ఖేద్కర్ పై ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ మరియు వికలాంగుల హక్కుల చట్టంలోని నిబంధనల ప్రకారం ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Show comments