ఢిల్లీ హై కోర్టుని బాంబుతో లేపేస్తామంటూ మెయిల్స్.. పోలీసులు అలర్ట్

Bomb threat to Delhi High Court: దేశ రాజధాని ఢిల్లీలోని హైకోర్టుకి సంబంధించిన ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Bomb threat to Delhi High Court: దేశ రాజధాని ఢిల్లీలోని హైకోర్టుకి సంబంధించిన ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఈ మద్య కాలంలో కొంతమంది ప్రయాణికులు రద్దీగా ఉండే ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ని టార్గెట్ చేసుకొని బాంబు బెదిరింపులకు పాల్పపడుతున్నారు. మరికొంతమంది రాజకీయ, సినీ, ప్రముఖ వ్యాపార వేత్తల ఇంటికి, ఆఫీస్ కి ఫోన్ చేసి బాంబులతో లేపేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పపడుతున్నారు. పోలీసులు, బాంబ్ స్వ్కాడ్ రంగంలోకి దిగి ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి అనుమానాస్పద వస్తువుల లేవని నిర్ధారించిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలాంటి ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టుని బాంబులతో పేల్చేస్తాం అంటూ వచ్చిన మెయిల్స్ తీవ్ర కలకం రేపాయి. ఇలాంటి ఫోన్ కాల్స్ చాలా వరకు ఫేక్ అని తేలిపోతున్నప్పటికీ పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు. తాాజాగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులను ఈ మెయిల్స్ ద్వారా పంపించారు. దీంతో ఢిల్లీ పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. బాంబు స్వ్యాడ్ రంగంలోకి తిరిది హైకోర్టు పరిసర ప్రాంతాలన్ని జల్లెడ పట్టారు. హై కోర్టుకు భారీ భద్రత ఏర్పాటుచేశారు. అయితే బాంబు ఆనవాళ్లు మాత్రం ఎక్కడ లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. డిల్లీ హైకోర్టును బాంబులతో లేపేస్తాం అంటూ బుధవారం కోర్టు రిజిస్ట్రర్ జనరల్ కు ఈ-మెయిల్ వచ్చినట్లు సమాచారం.

దుంగుడు పంపించిన మెయిల్ ప్రకారం.. ‘ ఫిబ్రవరి 15 న హైకోర్టుని బాంబులతో పేల్చుతాం.. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రదేశాలు ధ్వంసం అవుతాయి.. ఇది ఢిల్లీలోని అతి పెద్ద బాంబు దాడి అవుతుంది.. ఎంత భద్రతనైనా పెట్టుకోండి.. అందరినీ పేల్చేస్తాం’ అంటూ దుండగుడు బెదిరింపులకు పాల్పపడ్డాడు. మరోవైపు బిమార్ డీజీపీకి వాట్సాప్ ద్వారా బంబు బెదిరింపు రావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ ఘటనకు సంబంధించిన నిందితుడిని కర్ణాటకలో పట్టుకున్నారు పోలీసులు. అతన్ని విచారణ కోసం పట్నాకు తరలించారు. అన్నియాంగిల్స్ లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Show comments