iDreamPost
android-app
ios-app

హరి హర వీరమల్లు కు క్రేజి హైప్.. పార్ట్ 2 కూడా !

  • Published May 29, 2025 | 3:00 PM Updated Updated May 29, 2025 | 3:00 PM

హరి హర వీరమల్లు.. చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మూవీ ఇది. పవర్ స్టార్ నుంచే కాదు. తెలుగులో కాస్త గ్యాప్ తర్వాత రాబోతున్న పెద్ద మూవీ ఇది. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ సినిమా స్టోరీ గురించి కూడా చాలా అంచనాలు ఉన్నాయి.

హరి హర వీరమల్లు.. చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మూవీ ఇది. పవర్ స్టార్ నుంచే కాదు. తెలుగులో కాస్త గ్యాప్ తర్వాత రాబోతున్న పెద్ద మూవీ ఇది. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ సినిమా స్టోరీ గురించి కూడా చాలా అంచనాలు ఉన్నాయి.

  • Published May 29, 2025 | 3:00 PMUpdated May 29, 2025 | 3:00 PM
హరి హర వీరమల్లు కు క్రేజి హైప్.. పార్ట్ 2 కూడా !

హరి హర వీరమల్లు.. చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మూవీ ఇది. పవర్ స్టార్ నుంచే కాదు. తెలుగులో కాస్త గ్యాప్ తర్వాత రాబోతున్న పెద్ద మూవీ ఇది. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ సినిమా స్టోరీ గురించి కూడా చాలా అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మూవీ టీం నుంచి కథ గురించి చిన్న హింట్స్ అందాయి.

‘హరిహర వీరమల్లు’ ఔరంగజేబు కాలం అయిన 17వ శతాబ్దంలో నడిచే కథ అట. పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ రేంజ్ లో కనిపించే అవకాశం ఉందట. అలాగే ఈ స్టోరీ కొంతవరకు కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుందని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ లో పార్ట్ 2 కు కూడా లీడ్ ఇచ్చారని టాక్. మెయిన్ గా సినిమాలో పార్ట్ 2 కి ఇచ్చే లీడ్ అభిమానులని మూవీ లవర్స్ కి బాగా ఎగ్జైట్ చేస్తుంది అని తెలుస్తుంది. దీనితో వీరమల్లు పార్ట్ 2 పై మంచి ఆసక్తి ఇపుడు రేగింది.

సో మొత్తానికి సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి . జూన్ 12 న రిలీజ్ కాబోతున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. అభిమానులు మాత్రం సినిమాను కచ్చితంగా హిట్ చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. క్రిష్ స్క్రిప్టుతో ఆయన దర్శకత్వంలో మొదలైన ‘హరిహర వీరమల్లు’.. షూటింగ్ చాలా ఆలస్యం కావడం వల్ల.. చివరి దశలో నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ చేతుల్లోకి వచ్చిందట. దీని బడ్జెట్ రూ.200 కోట్లకు పైమాటే తెలుస్తుంది. ఇక ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.