వీడియో వైరల్: చిల్ అవుదామని బీర్ తాగాలనుకుంటున్నారా.. ఇది తెలిస్తే జన్మలో తాగరు

Beer bottle video viral: ఈ మధ్య కాలంలో బీరుల్లో కూడా నాణ్యత లేకుండా పోయింది. మొన్ననే ఓ వ్యక్తి బీరు తాగుదమని ఓపెన్ చేయగా.. అందులో  చెత్తా చెదారం దర్శనమిచ్చిన ఘటన సంచలనంగా మారింది. అయితే ఈ ఘటన మరువక ముందే మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Beer bottle video viral: ఈ మధ్య కాలంలో బీరుల్లో కూడా నాణ్యత లేకుండా పోయింది. మొన్ననే ఓ వ్యక్తి బీరు తాగుదమని ఓపెన్ చేయగా.. అందులో  చెత్తా చెదారం దర్శనమిచ్చిన ఘటన సంచలనంగా మారింది. అయితే ఈ ఘటన మరువక ముందే మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

సరదాగా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో పార్టీల్లో చిల్ అవ్వడానికి బీరు తాగాలని అనుకుంటున్నారా.. అయితే ఈ షాకింగ్ ఘటన గురించి తెలుసుకుంటే జన్మలో బీరు తాగాలంటే విరక్తి  పుడుతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇప్పటి వరకు ఆన్ లైన్, రెస్టారెంట్ ఫుడ్స్ మాత్రమే నాణ్యత లేకుండా.. పురుగులు, ఎలుకలు, బల్లులతో దర్శనమిస్తున్నాయి అనుకున్నాం. కానీ, ఈ మధ్య కాలంలో బీరుల్లో కూడా నాణ్యత లేకుండా పోయింది. మొన్ననే ఓ వ్యక్తి బీరు తాగుదమని ఓపెన్ చేయగా.. అందులో  చెత్తా చెదారం దర్శనమిచ్చిన ఘటన సంచలనంగా మారింది. అయితే ఈ ఘటన మరువక ముందే మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్లే..

మధ్యప్రదేశ్ లోని బేతుల్‌లోని ముల్లాయ్ ప్రాంతానికి చెందిన సచిన్ అనే వ్యక్తి  బీరు తాగుదమని ఒక బీరు బాటిల్ ను కొనుగోలు చేశాడు. ఇక ఎంతో ఆతృతగా ఇంటికి వెళ్లి ఆ బీరు బాటిల్ బాటిల్ ను ఓపెన్ చేసి తాగుదమని అనుకున్నాడు. అనుకున్న విధంగానే చక్కగా బాటిల్ ను ముందు పెట్టుకొని, గ్లాస్ లో వేసుకోగా.. షాకింగ్ ఒఒళ్లు గగ్గురపరిచి ఘటన చోటు చేసుకుంది. ఇక ఆ ఘటన చూసి ఆ వ్యక్తి ఒక్కసారిగా సృహ కోల్పోయాడు. ఎందుకంటే.. ఆ గ్లాసులో బీరు పోసుకోగానే అందులో చచ్చిన బల్లి కనిపించింది. అవును.. మీరు విన్నది నిజమే.. ఆ దృశ్యలను ఊహించుకుంటేనే మనకి ఏదోలా ఉంటే.. మరీ తాగుదమని అనుకున్న ఆ వ్యక్తి.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దీంతో ఆ ఘటన నుంచి తేరుకున్న ఆ వ్యక్తి వెంటనే ఆ బీర్ బాటిల్ ను, ఆ గ్లాస్ లో ఉన్న బల్లిని తీసుకెళ్లి దుకాణదారుడిని నిలదీశఆడు. కానీ, ఆ దుకాణదారుడు ఈ విషయంపై స్పందించకుండా.. తిరిగి ఆ వ్యక్తి దుర్భాషలాడాడు. అంతేకాకుండా.. ఆ షాపు నుంచి బయటకు తోసేశాడని ఆ వ్యక్తి ఆరోపించాడు. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సదురు వ్యక్తి షాపు ముందునే నిల్చొని ఘర్షణకు దిగాడు. అంతేకాకుండా.. ఇలాంటి నాణ్యత లేని బీరు తాగితే ప్రాణాలు పోతాయని,  ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. అయితే ఎక్సైజ్ అధికారి అన్షుమన్ చాదర్ మాత్రం ఈ ఘటనపై తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. కానీ, ఈ వీడియో తాము కూడా చూశామని, అసలు బాటిల్ లోపల బల్లి ఎలా వచ్చిందో తెలుసుకుంటామని పేర్కొన్నారు. అలాగే నాణ్యత లేని మద్యంను విక్రయిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకుంటమని హెచ్చరించారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో పై ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు బాటిల్ లోకి బల్లి ఎలా చేరిందని ప్రశ్నపై నెట్టింట పెద్ద చర్చే జరుగుతుంది. అలాగే దుకాణదారుడికి ఫిర్యాదు చేసిన అతను స్పందించిన తీరును చూసి అందరూ విమర్శిస్తున్నారు. అంతేకాకుండా.. ఇలాంటి నాణ్యత లేని మద్యం మార్కెట్ లో విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని కామెంట్స్ చేస్తున్నారు.   వెంటనే ఈ ఘటనపై అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. మరీ, బీరు బాటిల్ లో చచ్చిన బల్లి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments