ఇల్లు కొనాలనుకునేవారికి బంపరాఫర్‌.. రూ.11 లక్షలకే ఫ్లాట్‌.. ఎక్కడంటే

DDA Sold Flats Rs 11 5 Lakh: సొంతిళ్లు కొనాలని భావించే వారికి ఇది నిజంగా బంపరాఫర్‌ అనే చెప్పవచ్చు. 11 లక్షల రూపాయలకే ఫ్లాట్‌ దక్కించుకునే అవకాశం లభించనుంది. ఆ వివరాలు..

DDA Sold Flats Rs 11 5 Lakh: సొంతిళ్లు కొనాలని భావించే వారికి ఇది నిజంగా బంపరాఫర్‌ అనే చెప్పవచ్చు. 11 లక్షల రూపాయలకే ఫ్లాట్‌ దక్కించుకునే అవకాశం లభించనుంది. ఆ వివరాలు..

సొంతంగా మనకంటూ ఓ గూడు ఉండాలని ప్రతి మనిషి కలలు కంటాడు. తాను చనిపోయేలోపు సొంతిల్లు నిర్మించుకుని.. దానిలో కన్ను మూయాలని భావిస్తాడు. అయితే నేటి కాలంలో ఇంటి నిర్మాణం అనేది ఆర్థికంగా ఎంత భారమైన అంశమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత సింపుల్‌గా ఇల్లు కట్టాలన్నా.. లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. గ్రామాల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలన్నా.. ఎంత లేదన్న 5-10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సింది. ఇక ఓ మోస్తరు పట్టణాలు, నగరాల్లో అయితే.. లక్షల రూపాయలు ధారబోయాలి. మెట్రో నగరాల్లో అయితే ఎంత లేదన్న అర కోటి వరకు చెల్లించాల్సిందే. సామాన్యులు, పేదలే కాదు.. కనీసం ఉద్యోగస్తులు కూడా అంత మొత్తం చెల్లించలేరు. అదుగో అలాంటి వారికి ఇది భారీ బంపరాఫర్‌ అని చెప్పవచ్చు. 11 లక్షల రూపాయలకే ఫ్లాట్‌ దక్కించుకునే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. ఆ వివరాలు..

మెట్రో నగరంలో 11 లక్షలకే ఫ్లాట్‌ కొనే అవకాశం రాబోతుంది. అయితే అది మన దగ్గర కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో. అవును హస్తినలో కేవలం 11.5 లక్షల రూపాయలకే ఫ్లాట్‌ కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ(డీడీఏ). గతంలో ఇలానే తక్కువ ధరకే హౌసింగ్‌ స్కీమ్స్‌ను తీసుకువచ్చిన డీడీఏ.. ఈసారి కూడా తక్కువ ధరకే సింగిల్‌, డబుల్‌, ట్రిపుల్‌ బెడ్రూం ఫ్లాట్స్‌ని విక్రయించడానికి ముందుకు వచ్చింది.

ఇందుకు గాను మూడు హౌసింగ్‌ స్కీమ్స్‌ను లాంచ్‌ చేసింది. ఈ 3 పథకాల కింద కలిపి మొత్తం 40 వేల వరకు ఫ్లాట్స్‌ ఉన్నాయి. ఇక ఈ మూడు పథకాల పేర్లు వచ్చేసి డీడీఏ సస్త ఘర్ హౌసింగ్ స్కీమ్- 2024, డీడీఏ జనరల్ హౌసింగ్ స్కీమ్- 2024, డీడీఏ ద్వారకా హౌసింగ్ స్కీమ్- 2024. మరి ఈ ఒక్కో స్కీమ్‌లో ఎన్ని ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి.. వీటిని కొనాలంటే ఏం చేయాలి.. ఎలా బుక్‌ చేసుకోవాలి అంటే..

డీడీఏ తీసుకువచ్చిన మూడు హౌసింగ్‌ స్కీమ్స్‌ కింద మొత్త 34,177 ఫ్లాట్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇక వీటి ప్రారంభ ధర రూ. 11.5 లక్షలు ఉండగా.. గరిష్టంగా రూ. 28.47 లక్షల వరకు ఉన్నాయి. ఈ స్కీమ్‌ కింద ఫ్లాట్స్‌ కొనాలనుకుంటే.. ముందుగా రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆ ప్రక్రియ 2024, ఆగస్టు 22న ప్రారంభం అవుతుంది. ఫ్లాట్ బుకింగ్స్‌ వచ్చేసి సెప్టెంబర్‌ 10, 2024 ఉదయం 11 గంటల నుంచి మొదలవుతాయి. ఇక ఈ స్కీమ్‌ 2025, మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.

ఇక తక్కువ ఆదాయ వర్గాల వారి కోసం.. తక్కువ ధరలోనే ఇల్లు, ఫ్లాట్‌ అందించాలన్న ఉద్దేశంతో.. ఈ స్కీమ్స్‌ను ప్రారంభించినట్లు డీడీఏ వెల్లడించింది. ఈ పథకం కింద రామ్‌గఢ్‌ కాలనీ, సిరాస్‌పుర్‌, లోక్‌నాయక్‌పురం, రోహిణి నరేలా వంటి ప్రాంతాల్లో ఉన్న తక్కువ ఆదాయ వర్గం, ఆర్థికంగా వెనకబడిన వర్గం వారికి ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ ప్రాతిపదికన ఫ్లాట్స్‌ కేటాయించనున్నట్లు డీడీఏ వెల్లడించింది. సాధారణ పౌరుల సొంతింట కల సాకారం కోసం ఈ పథకాలను తీసుకొచ్చినట్లు డీడీఏ చెప్పుకొచ్చింది.

డీడీఏ జనరల్‌ హౌసింగ్‌ స్కీమ్‌ని డీడీఏ మాధ్యమ్‌ వర్గీయ హౌసింగ్‌ స్కీమ్‌-2024గా పిలుస్తున్నారు. ఇక్కడ 5531 ప్లాట్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటి రేటు వచ్చేసి 29 లక్షల నుంచి గరిష్టంగా 2.18 కోట్ల వరకు ఉన్నాయి. ఈ ప్లాట్స్‌ కొనడానికి ఎవరైనా అర్హులే.

Show comments