వీడియో: పెట్రోలు బంకులో గొడవ.. కొట్టుకున్న కస్టమర్లు- సిబ్బంది!

బంకుల్లో పెట్రోల్ కొట్టించుకునే క్రమంలో కస్టమర్లు, సిబ్బంది విచక్షణ కోల్పోయి దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

బంకుల్లో పెట్రోల్ కొట్టించుకునే క్రమంలో కస్టమర్లు, సిబ్బంది విచక్షణ కోల్పోయి దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

రెండ్రోజుల క్రితం దేశంలో ట్రక్కు డ్రైవర్ల సమ్మెతో పెట్రోల్, డీజిల్ సరఫరా ఆగిపోయిన విషయం తెలిసిందే. కేంద్రం తెచ్చిన కొత్త మోటారు వాహనాల చట్టం తమ భవిష్యత్తుకు ఆటంకంగా మారుతుందని భావించిన ట్రక్కు డ్రైవర్లు దేశ వ్యాప్తంగా నిరసనలకు దిగారు. దీంతో పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఇక ఈ విషయం తెలియగానే ఫ్యుయల్ దొరకదేమోనని భయపడి వాహనదారులు బంకులకు పరుగులు తీశారు. పెట్రోల్ బంకుల్లో వందలాది వెహికిల్స్ క్యూ కట్టాయి. ఈ క్రమంలో ఘర్షనలు కూడా చోటుచేసుకున్నాయి. ఓ బంకులో కస్టమర్లు, సిబ్బంది పరస్పరం దాడులు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం దేశంలో అలజడి రేపింది. ట్రక్కు డ్రైవర్ల సమ్మెతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. తమ వాహనాల్లో పెట్రోల్ కొట్టించుకునేందుకు బంకుల వద్ద ఒకరికొకరు పోటీపడ్డారు. ఇంధనం కోసం వేలాది వాహనాలు రోడ్లపైకి చేరడంతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బండి కాదుగదా కాలు కూడా కదపలేని పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో బంకుల్లో పెట్రోల్ కొట్టించుకునే క్రమంలో కస్టమర్లు, సిబ్బంది విచక్షణ కోల్పోయి దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. మహారాష్ట్రలోని ఓ బంకులో ఈ ఘటన చోటుచేసుకుంది.

పెట్రోల్ దొరకదేమోనన్న భయంతో వాహనదారులు అధిక సంఖ్యలో పెట్రోల్ బంకులకు చేరుకున్నారు. అయితే కస్టమర్లకు, బంకు సిబ్బందికి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ గొడవపడ్డారు. ఆ గొడవ కాస్త గాలివానలా మారి రణరంగం సృష్టించింది. కస్టమర్లు, సిబ్బంది ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. హెల్మెట్ తో బంకు సిబ్బంది కస్టమర్లపై దాడులు చేస్తున్న విజువల్స్ ను మనం ఆ వీడియోలో చూడొచ్చు. కస్టమర్లు కూడా బంకు సిబ్బందిపై విచక్షణా రహితంగా కొట్టారు. ఓ కస్టమర్ ఏకంగా స్కూటీతో బంకు సిబ్బందిని ఢీకొట్టాడు. ఈ గొడవల్లో పలువురు గాయపడ్డట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారని సమాచారం. మరి బంకులో కస్టమర్లు, సిబ్బంది కొట్టుకున్న ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments