కట్నంలో ‘ఫార్చునర్’ కారు లేదని భార్యని కొట్టి చంపిన నీచుడు!

ఈ మధ్యకాలంలో చాలామంది కట్నం కోసం అనేక దారుణాలకు ఒడిగడుతున్నారు. అయితే దేశంలో ఇలా రోజు రోజుకి అదనపు కట్నం కోసం మహిళల పట్ల వేధింపులు, హత్యలు వంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి.  కాగా, ఈ దారుణాలపై ఎన్ని చట్టాలు అమలులోకి తీసుకు వస్తున్న మహిళలపై జరుగుతున్న అన్యాయలను మాత్రం ఎవ్వరూ అపలేకపోతున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనలో కట్నంగా ఫార్చ్యునర్​ ఇవ్వలేదని ఓ భర్త చేసిన నిర్వాకం స్థానికంగా సంచలనంగా మారింది.

ఈ మధ్యకాలంలో చాలామంది కట్నం కోసం అనేక దారుణాలకు ఒడిగడుతున్నారు. అయితే దేశంలో ఇలా రోజు రోజుకి అదనపు కట్నం కోసం మహిళల పట్ల వేధింపులు, హత్యలు వంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి.  కాగా, ఈ దారుణాలపై ఎన్ని చట్టాలు అమలులోకి తీసుకు వస్తున్న మహిళలపై జరుగుతున్న అన్యాయలను మాత్రం ఎవ్వరూ అపలేకపోతున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనలో కట్నంగా ఫార్చ్యునర్​ ఇవ్వలేదని ఓ భర్త చేసిన నిర్వాకం స్థానికంగా సంచలనంగా మారింది.

ఇటీవల కాలంలో చాలామంది కట్నం కోసం అనేక దారుణాలకు ఒడిగడుతున్నారు. అగ్ని సాక్షిగా తాళికట్టి, ఏడడుగులు నడిచిన భార్యను కాళ్ల పారణి అరకముందే వేధింపులకు గురి చేస్తున్నారు. నిండు నూరెళ్లు తోడు నీడగా.. కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే.. అదనపు కట్నం కోసం కడతేరుస్తున్నారు. అయితే దేశంలో ఇలా రోజు రోజుకి అదనపు కట్నం కోసం మహిళల పట్ల వేధింపులు, హత్యలు వంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి.  కాగా, సమాజంలో జరుగుతున్న ఈ దారుణాలపై ఎన్ని చట్టాలు అమలులోకి తీసుకు వస్తున్న మహిళలపై జరుగుతున్న అన్యాయలను మాత్రం ఎవ్వరూ అపలేకపోతున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనలో కట్నంగా ఫార్చ్యునర్​ ఇవ్వలేదని ఓ భర్త చేసిన నిర్వాకం స్థానికంగా సంచలనంగా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఎంతో అంగరంగ వైభంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన ఓ అమ్మాయిని.. కట్నంగా ఫార్చ్యునర్​ ఇవ్వలేదని భర్త అతని కుటుంబసభ్యులు కొట్టి హతమార్చరు. ఈ దారుణమైన ఘటన  గ్రేటర్​ నోయిడాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరకట్నం వేధింపులతో ఓ మహిళ తన ప్రాణాలను కోల్పోయింది. బాధిత మహిళ సోదరుడు దీపక్ తెలిపిన వివరాల మేరకు.. గ్రేటర్​ నోయిడాలోని ఖాడా చౌగన్​పూర్​ అనే గ్రామంలో నివాసముండే వికాస్​ అనే వ్యక్తికి.. 2022 డిసెంబర్​లో కరిష్మ అనే మహిళతో వివాహం జరిగింది. కాగా, పెళ్లి సమయంలో కరిష్మ కుటుంబం.. వికాస్​ కుటుంబానికి రూ. 11లక్షల క్యాష్​తో పాటు ఒక ఎస్​యూవీని కట్నం కింద ఇచ్చింది. అయిన అది సరిపోదంటూ.. వికాస్ అతని కుటుంబం పెళ్లి తర్వాత కూడా కట్నం గురించి కరిష్మను వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అనేకసార్లు వికాస్, కరిష్మాని శారిరకంగా, మానసికంగా హింసించేవాడు. ఇక కొన్ని నెలల క్రితం ఈ దంపతులకు కూతురు పుట్టింది. అయితే కూతురు పుట్టిన తర్వాత కరిష్మకు ఈ వేధింపులు మరింత ఎక్కవయ్యాయి. దీంతో ఈ వ్యవహారం ద్దల దృష్టికి కూడా వెళ్లడంతో.. ఇరు కుటుంబాల మధ్య విభేదాలను పరిష్కరిచేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే.. కరిష్మా కుటుంబం.. వికాస్ కుటుంబానికి మళ్లీ రూ.రూ. 10లక్షలు అదనంగా ఇచ్చారు. అయిన వికాస్ వరకట్న వేధింపులు ఆగలేదని మహిళ సోదరుడు తెలిపాడు.

కాగా, మళ్లీ  ఒక ఫార్చ్యునర్​తో పాటు రూ. 21లక్షల కట్నం ఇవ్వలని వికాస్ కుటుంబం డిమాండ్​ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. వికాస్​తో పాటు అతని కుటుంబసభ్యులు, తనని కొడుతున్నట్లు కరిష్మ పుట్టింటి వారికి ఫోన్​ చేసి చెప్పింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు వెంటనే  కరిష్మ అత్తరింటికి పరుగులు తీశారు. ఇక నేల మీద విఘత జీవిగా పడి ఉన్న కరిష్మను చూసి ఆమె మరణించిందని తెలుసుకుని బోరున  విలపించారు. అయితే వికాస్​, అతని తల్లిదండ్రులే.. వరకట్నం కోసం తమ బిడ్డను కొట్టి చంపేశారని కరిష్మ కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. వికాస్​, అతని తండ్రి సోంపాల్​ భాటి, తల్లి రాకేశ్​, సోదరి రింకి, సోదరులు సునీల్​- అనిల్​లపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వికాస్​తో పాటు అతని తండ్రిని అరెస్ట్​ చేయగా.. మిగిలిన వారు పారారీలో ఉన్నారు. ఇక పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినిట్టు, త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. మరి, అదనపు కట్నం కోసం భార్యను, భర్త, అతని కుటుంబ సభ్యులు కొట్టి హతమార్చిన ఈ దారుణమైన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Show comments