iDreamPost
android-app
ios-app

ఒకరోజు ముందే OTT లో రెట్రో మూవీ

  • Published May 30, 2025 | 10:58 AM Updated Updated May 30, 2025 | 10:58 AM

కొన్ని సినిమాలు అనుకున్నదానికంటే ముందే OTT లోకి వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో సూర్య , పూజ హేగ్దే కలిసి నటించిన మూవీ రెట్రో సడెన్ గా ఓటిటి ఎంట్రీ ఇచ్చింది. కంగువా లాంటి డిజాస్టర్ తర్వాత సూర్య నటించిన ఈ మూవీ కాస్త పర్వాలేదు అనిపించుకుంది.

కొన్ని సినిమాలు అనుకున్నదానికంటే ముందే OTT లోకి వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో సూర్య , పూజ హేగ్దే కలిసి నటించిన మూవీ రెట్రో సడెన్ గా ఓటిటి ఎంట్రీ ఇచ్చింది. కంగువా లాంటి డిజాస్టర్ తర్వాత సూర్య నటించిన ఈ మూవీ కాస్త పర్వాలేదు అనిపించుకుంది.

  • Published May 30, 2025 | 10:58 AMUpdated May 30, 2025 | 10:58 AM
ఒకరోజు ముందే OTT లో రెట్రో మూవీ

కొన్ని సినిమాలు అనుకున్నదానికంటే ముందే OTT లోకి వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో సూర్య , పూజ హేగ్దే కలిసి నటించిన మూవీ రెట్రో సడెన్ గా ఓటిటి ఎంట్రీ ఇచ్చింది. కంగువా లాంటి డిజాస్టర్ తర్వాత సూర్య నటించిన ఈ మూవీ కాస్త పర్వాలేదు అనిపించుకుంది. మొదటి సారి ఈ సినిమాలో పూజ హేగ్దే డీగ్లామర్ గా కనిపించింది. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. తమిళ ప్రేక్షకుల మధ్యలో ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. కానీ తెలుగులో మాత్రం అంతంత మాత్రంగానే ఆడింది. అయితే కొన్ని సినిమాలు థియేటర్ ప్రేక్షకులను మెప్పించకపోయిన ఓటిటి ప్రేక్షకులను మాత్రం మెప్పిస్తాయి.

ఈ క్రమంలో రెట్రో సినిమా మీద కూడా ఇలాంటి ఊహాగానాలే ఉన్నాయి. నిజానికి ఈ సినిమాను మే 31 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకుని వస్తానని అన్నారు. కానీ అనుకున్నదానికంటే ఓ రోజు ముందుగానే ఈ మూవీ ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయిన వారు ఎంచక్కా ఓటిటి లో ఎంజాయ్ చేసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. గ్యాంగ్‌స్టర్ తిలకన్ అనే వ్యక్తి పారివేల్ కన్నన్ (సూర్య) ను కన్న కొడుకుల పెంచుకుని.. గ్యాంగ్‌స్టర్స్‌గా ఒక సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసుకుంటాడు. అయితే ఓ డీల్ విషయంలో వీరిద్దరి మధ్య గొడవలు వస్తాయి. దీనితో సూర్య పెంచిన తండ్రినే వదిలేసి ప్రేమించిన అమ్మయి(పూజ హెగ్డే) తో జీవిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ గొడవలో సూర్య జైలుకు వెళ్తాడు. దీనితో ఈ గొడవలు ఏమి నచ్చక పూజ హెగ్డే కూడా అతని వదిలేసి వెళ్ళిపోతుంది. ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవాలని సూర్య తన గ్యాంగ్ కు చెప్తాడు. ఈ ప్రాసెస్ లో ఏమి జరిగింది.. పూజ చెప్పకుండా ఎక్కిడికి వెళ్ళిపోతుంది? పూజ కు తిలకన్ కు ఏమైనా సంబంధం ఉంటుందా ? ఆ గ్యాంగ్ కు సూర్య గ్యాంగ్ కి మధ్య ఎలాంటి పరిస్థితిలు ఏర్పడతాయి ?ఫైనల్‌గా పూజ ను సూర్య చేసుకుంటాడా..? అనేది తెలియాలంటే రెట్రో చూడాల్సిందే.