Bhairavam Movie Review: ఈ వారం బాక్స్ ఆఫీస్ బరువు బాధ్యత భైరవం సినిమానే మోస్తుంది. సో అందరి కళ్ళు భైరవం మీదే ఉన్నాయి. మరి ఈ సినిమా థియేటర్స్ లో ఎలాంటి టాక్ సంపాదించుకుందో రివ్యూలో చూసేద్దాం.
Bhairavam Movie Review: ఈ వారం బాక్స్ ఆఫీస్ బరువు బాధ్యత భైరవం సినిమానే మోస్తుంది. సో అందరి కళ్ళు భైరవం మీదే ఉన్నాయి. మరి ఈ సినిమా థియేటర్స్ లో ఎలాంటి టాక్ సంపాదించుకుందో రివ్యూలో చూసేద్దాం.
Swetha
తమిళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన గరుడన్ సినిమాకు రీమేక్ వెర్షన్ గా రూపుదిద్దిన మూవీ భైరవం. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ , నారా రోహిత్, మంచు మనోజ్ లు మెయిన్ లీడ్స్ గా నటించారు. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. గతంలో నాంది , ఉగ్రం లాంటి మంచి సినిమాలను అందించిన ఈ దర్శకుడు.. ఇప్పుడు ఈ సినిమాతో కూడా సక్సెస్ అయినట్లేనా.. అసలు ఈ మూవీ ఎలా ఉంది ?ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది ? అనేది రివ్యూ లో చూసేద్దాం
కథ :
తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపురం అనే గ్రామంలో ఉన్న వారాహి అమ్మవారు చాలా పవర్ ఫుల్. ఆ ఆలయానికి నాగరత్నమ్మ (జయసుధ) ట్రస్టీగా వ్యవహరించేది. ఆమె తన ముగ్గురు మనవళ్లు అయినా మనవడు గజపతి (నారా రోహిత్), వరద (మంచు మనోజ్), శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) ముగ్గురినీ సమానంగా పెంచుతుంది. కొన్నాళ్ళకు నాగరత్నమ్మ మరణిస్తుంది. ఆ తర్వాత ఆ దేవాలయం ట్రస్టీగా తానె ఉండాలని నాగరాజు (అజయ్) ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓసారి గజపతి చిక్కుల్లో పడినప్పుడు… నాగరాజు అతనికి హెల్ప్ చేస్తాడు. మరోవైపు వరదను గజపతి చంపాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇదంతా తెలిసిన శ్రీను పోలీసుల దగ్గర అబద్దం చెప్పి మరీ వరద భార్య దగ్గర చెడ్డవాడిగా ఉండిపోతాడు. అసలు ఈ అన్నదమ్ముల మధ్య చిక్కులు ఎందుకు వచ్చాయి ? ఒకరికొకరు ప్రాణంగా భావించే గజపతి, వరదను ఎందుకు చంపాల్సి వచ్చింది? శ్రీను, గజపతి కోసం ఎందుకు అబద్ధం చెప్పాడు? ఆ ఆలయ ట్రస్టీగా ఎవరు నియమితులయ్యారు ? చివరికి అసలు ఏమి జరిగింది అనేది తెరపై చూడాల్సిన మిగిలిన కథ.
నటీ నటుల పనితీరు:
ముఖ్యంగా ఈ సినిమాలో అందరికంటే కాస్త ఎక్కువగ చెప్పుకోవాల్సింది బెల్లంకొండ శ్రీనివాస్ గురించే. శ్రీనివాస్ తన క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసాడని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ లో అతనికి పూనకం వస్తుంది. అక్కడైతే థియేటర్స్ లో ఒక్కొక్కరికి గూస్ బంప్స్ పక్కా. ఇక డ్యాన్స్ , యాక్షన్ సీన్స్ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మంచు మనోజ్ కు ఈ సినిమా మంచి కంబ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. పైకి మంచిగా కనిపిస్తూ నెగిటివ్ షేడ్ లో ఉన్న క్యారెక్టర్ కు వందకు వంద శాతం న్యాయం చేసాడు. ఈ ఇద్దరు కాకుండా మరో హీరో నారా రోహిత్ సినిమాకు బిగ్ అసెట్. ముగ్గురికి ముగ్గురు ఎక్కడ తగ్గకుండా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిగిలిన వారు కూడా తమ పాత్రలలో ఇమిడిపోయి సినిమాకు ప్రాణం పోశారని చెప్పొచ్చు
సాంకేతిక వర్గం పని తీరు :
నిజానికి ఒకే సినిమాలో ముగ్గురు స్టార్ హీరోలు ఉన్నప్పుడు.. ఎక్కడ ఓ దగ్గర స్క్రీన్ స్పేస్ విషయంలో హెచ్చుతగ్గులు వస్తాయి. కానీ ఈ సినిమాలో అది ఒక్క చోట కూడా కనిపించదు. ఇక సినిమాలో సాంగ్స్ అన్నీ బాగానే ఉన్నా కూడా.. ఆ సాంగ్స్ ప్లేస్మెంట్స్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే బావుంటుందని అభిప్రాయం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్. ఈ సినిమాగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన మరో విషయం సెట్ వర్క్. ఎక్కడ కూడా అది సెట్ వర్క్ అనే ఫీలింగ్ రాకుండా చాలా రియలిస్టిక్ గా చూపించారు. సినిమాటోగ్రపీ కూడా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. నిర్మాణ విలువలు, ఫైట్స్ , లొకేషన్స్ అన్ని కూడా అదిరిపోయాయి. కానీ ఎడిటింగ్ మీద ఇంకొంచెం ఫోకస్ పెడితే బావుండేదేమో అనే ఫీలింగ్ కాస్త కలుగుతుంది.
విశ్లేషణ :
కొన్ని రీమేక్ వెర్షన్స్ కు కాస్త కొత్తదనం యాడ్ చేస్తూ ఉంటారు దర్శకులు. ఆ ఔట్పుట్ కొన్నిసార్లు అనుకున్న విధంగా రాకపోవచ్చు. కానీ ఈ సినిమాలో దర్శకుడు పెద్దగా ప్రయోగాల జోలికి వెళ్ళలేదు. సో ఇది సినిమాను నిలబడేలా చేసింది. కేవలం ముగ్గురు హీరోల మధ్యన ఎమోషనల్ బాండ్ బిల్డ్ చేసి.. కథ మొత్తాన్ని దానితోనే నడిపేసాడు. పైగా ఈ ముగ్గురి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది. సరిగ్గా వారి వారి పాత్రలలో వారు ఇమిడిపోయారు. ఫస్ట్ ఆఫ్ అంతా సెకండ్ ఆఫ్ కి ఎస్టాబ్లిషమెంట్ గా సాగుతూ ఉంటుంది. అసలు కథ అంతా కూడా సెకండ్ ఆఫ్ లోనే కనిపిస్తుంది.
ప్రాణ స్నేహితుల మధ్య ఒకరినొకరు చంపుకోవాల్సిన పగలు ఎందుకు రగిలాయి? ఒక స్నేహితుడి కోసం తప్పు చేసేందుకు మరో స్నేహితుడు ఎందుకు ముందుకు వచ్చాడు ? అయినా సరే అతని చేతిలోనే చావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ? చివరికి అసలు ముగ్గురు స్నేహితుల కథ ఎలా సుఖాంతం అయింది ఇవన్నీ కూడా సెకండ్ ఆఫ్ లోనే తెలుస్తాయి. మొత్తానికి దర్శకుడు ఈ రా అండ్ రస్టిక్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. ముగ్గురు హీరోలతో తెరపై మ్యాజిక్ చేసి చివరి వరకు ప్రేక్షకులకు సినిమా మీద ఆసక్తి కలిగేలా చేసాడు.
అయితే కొన్ని చోట్ల ఏమి జరగబోతుందా అని ఆసక్తి కలిగితే.. కొన్ని చోట్ల ఈజీగా ప్రెడిక్ట్ చేసే సీన్స్ చూపించాడు. ఇక సినిమాలో పాటలు , లవ్ ట్రాక్ బావున్నా కానీ.. ఎదో పెట్టమన్న పేరుకు పెట్టినట్లు అయింది. వాటి ప్లేస్మెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బావుండేదని అనిపించింది. సెకండ్ ఆఫ్ లో కొన్ని సీన్స్ ఈజీగా అర్థమైనట్టు అనిపిస్తూ ఉంటాయి. కానీ శ్రీనివాస్ కు పూనకం వచ్చే ఎపిసోడ్స్ మాత్రం పక్కా గూస్బంప్స్ తెప్పిస్తాయి. అయితే సినిమాలో ఎమోషన్స్ తో ఇంకాస్త బాగానే ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ విషయంలో కాస్త తడబడినట్టు అనిపిస్తూ ఉంటుంది. నిజానికి ప్రేక్షకుల హృదయాలను కదిలించే క్యాప్సిసిటీ ఉన్న సబ్జెక్ట్ ఇది. కానీ దానిని దర్శకుడు పూర్తిగా వాడుకోలేదు. కమర్షియాలిటీ కోసం కాకుండా కథకు స్టిక్ అయ్యి ఉంటె కనుక.. సినిమాకు ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ కంటే కూడా డబుల్ రెస్పాన్స్ వచ్చేది.
ప్లస్ లు :
మైనస్ లు:
రేటింగ్ : 2.25/5
చివరిగా : భైరవం ఎంగేజింగ్ మూమెంట్స్ ఉన్న రా&రస్టిక్ డ్రామా