Arjun Suravaram
దేశంలో సార్వత్రిక ఎన్నిక సమరం ఊపందుకుంది. అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంలో, అభ్యర్థుల ఎంపికలో ఫుల్ బిజీగా ఉన్నాయి. అలానే ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన మేనిఫెస్టోను విడుదల చేసింది. 48 పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు.
దేశంలో సార్వత్రిక ఎన్నిక సమరం ఊపందుకుంది. అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంలో, అభ్యర్థుల ఎంపికలో ఫుల్ బిజీగా ఉన్నాయి. అలానే ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన మేనిఫెస్టోను విడుదల చేసింది. 48 పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు.
Arjun Suravaram
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో తొలి విడత పొలింగ్ ప్రారంభం కానుంది. ఇక అభ్యర్థుల ఎంపిక కసరత్తులు చేస్తూనే, మరోవైపు ఎన్నికల ప్రచారంలో అన్ని ప్రధాన జాతీయ పార్టీలు ఫుల్ బిజీగా ఉన్నాయి. ముఖ్యంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ లు అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. కాంగ్రెస్ ఎలాగైన అధికారంలోకి రావాలనే లక్ష్యంలో ప్రణాళికలు రచిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తమ మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. ‘న్యాయ్ పత్ర’ పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలో మల్లిఖార్జున ఖర్గే మేనిఫెస్టోలని అంశాలను చదివి వినిపించారు. ఈ మేనిఫెస్టోలో పేదలపై కాంగ్రెస్ హామీల జల్లును కురిపించింది.
ఢిల్లీలో ఏర్పాటు చేసిన మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. న్యాయ్ పత్ర పేరుతో ఈ మేనిఫెస్టోను ప్రకటించారు. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాలపై దీనిని రూపొందించినట్లు మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం వివరించారు. మేనిఫెస్టోలో 25 రకాల హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. ‘భాగీదారీ న్యాయ్’, ‘కిసాన్ న్యాయ్’, ‘నారీ న్యాయ్’, ‘శ్రామిక్ న్యాయ్’, ‘యువ న్యాయ్’ అనే ఐదు అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు కాంగ్రెస్ తెలిపింది. ఇక మేనిఫెస్టో కాంగ్రెస్ పొందుపర్చిన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. దేశ వ్యాప్తంగా కులగణన నిర్వహిస్తామని, కులాలు, ఉపకులాలు, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను గుర్తిస్తాం అని మేనిఫెస్టోలో పొందుపర్చింది. అలానే రిజర్వేరషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తామని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, పేద మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద ఏటా లక్ష రూపాయల ఆర్థిక సాయం, విద్యార్థులకు కూడా లక్ష రూపాయల సాయం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. అలానే కిసాన్ న్యాయ్ పేరుతో దేశంలోని రైతులను ఆదుకుంటామని తెలిపారు.
రైతులకు రుణమాఫీ చేస్తామని, కనీస మద్దతు ధర చట్టం తీసుకొచ్చి, వారి ఆదాయాన్నిపెంచుతామాని హామి ఇచ్చారు. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు ఇస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాల భర్తీ, పేపర్ లీక్ అరికట్టేందుకు కఠిమైన చట్టం. గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు. యువత స్టార్టప్ కోసం రూ.5వేల కోట్ల నిధి కేటాయింపు వంటి వాటిని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలను బాగా తగ్గిస్తాం. అగ్నివీర్ స్కిమ్‌ను రద్దు చేస్తామని, యువతకు ఉద్యోగాలను కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అలానే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను సవరించాలని పేర్కొంది.
పార్టీ ఫిరాయించిన వారిని అనర్హుడిని చేయాలనే అంశాన్ని కూడా మేనిఫెస్టోలో ప్రకటించింది. మైనారిటీల ప్రాథమిక హక్కులను కాంగ్రెస్ పార్టీ పరిరక్షిస్తుంది. మౌలానా ఆజాద్ స్కాలర్ షిప్‌ను తిరిగి ప్రవేశపెడతామని కాంగ్రెస్ తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచనను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని తెలిపారు. అలానే జాతీయ ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనాన్ని రూ.400కి పెంచుతామని కాంగ్రెస్ తెలిపింది. వీటితో పాటు మరికొన్ని అంశాలను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పొందుపర్చింది. మరి..మొత్తంగా న్యాయ్ పత్ర పేరుతో కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Congress Party releases its manifesto for the 2024 Lok Sabha elections, at AICC headquarters in Delhi.
#LokSabhaElections2024 pic.twitter.com/lNZETTLDLY
— ANI (@ANI) April 5, 2024