Congress leader kasula balaraju drank insecticide for not getting ticket: టికెట్ రాలేదని పురుగుల మందు తాగి కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం

టికెట్ రాలేదని పురుగుల మందు తాగి కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ లో టికెట్ల గొడవ తారాస్థాయికి చేరింది. ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు టికెట్లు అమ్ముకుంటున్నాడని పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కాంగ్రెస్ నేత తనకు టికెట్ రాలేదన్న బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

కాంగ్రెస్ లో టికెట్ల గొడవ తారాస్థాయికి చేరింది. ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు టికెట్లు అమ్ముకుంటున్నాడని పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కాంగ్రెస్ నేత తనకు టికెట్ రాలేదన్న బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే తమ తమ పార్టీల తరఫున పోటీచేసే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో మునిగిపోయారు. అయితే ఇలాంటి తరుణంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ లో మాత్రం ప్రకంపనలు చెలరేగుతున్నాయి. తమకు టికెట్ వస్తుందని ఆశపడిన అభ్యర్థులకు టికెట్ కేటాయించకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు టికెట్ దక్కలేదని ఓ కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంటుంది. టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరుకుంది. టికెట్లు దక్కని అభ్యర్థులు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ గాంధీభవన్ పై దాడులకు పాల్పడుతున్నారు. తమకు టికెట్ వస్తుందని ఇప్పటికే వారి నియెజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్యే అభ్యర్థులు టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్ లో తీవ్ర కలకలం రేగింది. కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ కేటాయించలేదని కాసుల బాలరాజు నిరాహార దీక్షకు దిగాడు. తనకు కాకుండా ఏనుగు రవీందర్ కు టికెట్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత బాలరాజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

టికెట్ రాలేదన్న మనస్థాపంతో కాసుల బాలరాజు పురుగుల మందు తాగాడు. వెంటనే స్పందించిన కార్యకర్తలు కాసుల బాలరాజును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తానేంతో కృషి చేశానని, కానీ కాంగ్రెస్ అధిష్టానం టికెట్ తనకు కాకుండా స్థానికేతరుడైన ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ కేటాయించడంపై తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు బాలరాజు. తనను నమ్ముకుని ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు నేను ఏం సమాధానం చెప్పాలని కాసుల బాలరాజు తన ఆవేదనను వెల్లబోసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నాడు.

Show comments