P Venkatesh
Maharashtra: నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. డిగ్రీ పూర్తైన వారికి నెలకు 10 వేలు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఇంతకీ ఏ ప్రభుత్వం అంటే?
Maharashtra: నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. డిగ్రీ పూర్తైన వారికి నెలకు 10 వేలు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఇంతకీ ఏ ప్రభుత్వం అంటే?
P Venkatesh
ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాయి. వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తున్నాయి. పలు పథకాలతో నిరుద్యోగులకు సాయమందిస్తున్నాయి. ఉద్యోగాలు కల్పించి ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో నిరుద్యోగులకు భారీ శుభవార్త అందించింది ఓ ప్రభుత్వం. డిగ్రీ పూర్తైన వారికి నెలకు రూ. 10 వేలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే ఇది తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటే పొరపాటే. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం వినూత్నమైన పథకాన్ని తీసుకొచ్చి ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం ఏక్ నాథ్ షిండే వెల్లడించారు.
మహారాష్ట్రలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మరోసారి అధికారం చేపట్టేందుకు అక్కడి ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నది. ఈ నేపథ్యంలో ప్రజలకు తీపికబురును అందిస్తోంది. సీఎం ఏక్ నాథ్ షిండే లాడ్లా భాయ్ యోజన పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించనున్నారు. అర్హులైన యువకులకు ప్రతి నెల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్రలోని పండార్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం ఏక్‌నాథ్ షిండే ఈ ప్రకటన చేశారు.
లాడ్లా భాయ్ యోజన పథకం కింద అర్హతలను బట్టి చెల్లింపులు ఉంటాయని తెలిపారు. 12వ తరగతి పూర్తి చేసిన వారికి నెలకు రూ.6 వేలు, డిప్లొమా పూర్తి చేసిన యువకులకు నెలకు రూ.8 వేలు, అదేవిధంగా డిగ్రీ పూర్తి చేసిన యువకులకు నెలకు రూ.10 వేలు అందించనున్నట్లు తెలిపారు. సీఎం ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే మహిళల కోసం లాడ్లీ బెహన్ స్కీమ్ ను ప్రారంభించి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. పురుషులకు కూడా ఆర్థిక సాయం అందించాలన్నా డిమాండ్ ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ఏక్ నాథ్ షిండే తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా కల్పించనున్నట్లు సీఎం వెల్లడించారు.