Himachal Pradesh: ఊరు ఊరంతా కొట్టుకుపోయింది.. ఒక్క ఇల్లు తప్ప! ఎందుకంటే..

ఊరు ఊరంతా కొట్టుకుపోయింది.. ఒక్క ఇల్లు తప్ప! ఎందుకంటే..

Himachal Pradesh: శంలోని పలు రాష్ట్రాల్లో వానలు బీభత్సం సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే ఉత్తరాధి రాష్ట్రామైన హిమాచల్‌ ప్రదేశ్‌లో  క్లౌడ్ బరస్ట్ తీవ్ర విపత్తను సృష్టించింది. తాజాగా దారుణమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది.

Himachal Pradesh: శంలోని పలు రాష్ట్రాల్లో వానలు బీభత్సం సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే ఉత్తరాధి రాష్ట్రామైన హిమాచల్‌ ప్రదేశ్‌లో  క్లౌడ్ బరస్ట్ తీవ్ర విపత్తను సృష్టించింది. తాజాగా దారుణమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది.

ఇటీవల కేరళలో వరదలు సృష్టించిన ప్రళయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వయనాడ్ ప్రాంతంలో అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా..పెను విషాదం చోటుచేసుకుంది. ఈ ఘోర విపత్తులో దాదాపు 300 మంది మృత్యువాతపడ్డారు. అంతే మంది అనేక మంది ఆచూకి గల్లంతు అయింది. ఇలా దక్షిణాదిలో కేరళలో వరద బీభత్సం జరగ్గా..అదే తరహాలో నార్త్ లోని ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశా రాష్ట్రాల్లో కూడా కనిపించింది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని ఓ గ్రామంపై అకస్మాత్తుగా వరదులు రావడంతో ఒక్క ఇల్లు తప్ప..ఊరు ఊరంత కొట్టుకుపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

దేశంలోని పలు రాష్ట్రాల్లో వానలు బీభత్సం సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే ఉత్తరాధి రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌ లో  క్లౌడ్ బరస్ట్ తీవ్ర విపత్తను సృష్టించింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ ను మరో కేరళగా మార్చేసింది. రాష్ట్రంలోని కులులోని నిర్మంద్‌ బ్లాక్‌, మాలానా, మండి జిల్లాల్లో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా కుండపోత వాన కురిసింది. దాంతో ఇళ్లు, పాఠశాలలతో పాటు ఆసుపత్రులు సైతం దెబ్బతిన్నాయి. మూడు ప్రాంతాల్లో దాదాపు పదుల సంఖ్యలో జనాల గల్లంతయ్యారు. ఇదే సమయంలో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలను మూసివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ క్రమంలో శుక్రవారం హిమాచల్ ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఒక్కసారిగా వచ్చిపడిన వరద కారణంగా సామేజ్ అనే గ్రామంలో ఒక ఇల్లు తప్ప మొత్తం కొట్టుకుపోయింది.  అయితే ఆ ఇల్లు వరదలకు వచ్చే  ప్రదేశానికి కాస్తా దూరంగా కొండవైపు ఉండటంతో కొట్టుకుపోలేదని స్థానికులు చెబుతున్నారు. ఇదే సమయంలో తాము ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని ఆ కుటుంబీకులు మీడియాతో పంచుకున్నారు. వరద తరువాత బయట చూస్తే తమ ఇల్లు తప్ప ఇంకేమీ మిగల్లేదని తెలిపారు. మరోసారి వరదలు వస్తాయనే భయంతో వెంటనే సమీపంలోని కాళీమాత ఆలయానికి పరిగెత్తి తలదాచుకున్నామని వారు పేర్కొన్నారు.

ఈ విలయంలో 53 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల వల్ల అక్కడి నదులు ఉప్పొంగాయి. ప్రత్యేకించి- బియాస్ నది ఉగ్రరూపాన్ని దాల్చింది. తీర ప్రాంతాలను ముంచెత్తుతోంది. పార్వతి నది ఎప్పుడూ లేని విధంగా వరదపోటుకు గురైంది. ఈ క్రమంలోనే జాతీయ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర స్థాయి వైపరీత్యాల నిర్వహణ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. కొన్ని చోట్ల హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. మనాలి జాతీయ రహదారి పలుచోట్ల కొట్టుకుపోయింది. మొత్తంగా హిమాచల్ ప్రదేశ్ మరో కేరళ తరహాలో కనిపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Show comments