iDreamPost
android-app
ios-app

చదివింది 8వ తరగతి.. ఏడాదికి రూ.1.50 కోట్ల ఆదాయం!

ప్రతి ఒక్కరి మంచి ఆదాయం పొందాలనే కొరిక ఉంటుంది. అయితే అందుకోసం కొంతమంది మాత్రమే కృషి చేస్తుంటారు. అలానే 8వ తరగతి మాత్రమే చదివిన ఓ వ్యక్తి.. వినూత్న పద్ధతిలో వ్యవసాయం చేసి.. ఐఐటీ గ్రాడ్యుయేట్స్ స్థాయిలో ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.

ప్రతి ఒక్కరి మంచి ఆదాయం పొందాలనే కొరిక ఉంటుంది. అయితే అందుకోసం కొంతమంది మాత్రమే కృషి చేస్తుంటారు. అలానే 8వ తరగతి మాత్రమే చదివిన ఓ వ్యక్తి.. వినూత్న పద్ధతిలో వ్యవసాయం చేసి.. ఐఐటీ గ్రాడ్యుయేట్స్ స్థాయిలో ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.

చదివింది 8వ తరగతి.. ఏడాదికి రూ.1.50 కోట్ల ఆదాయం!

ఐఐటీ, ఐఐఏం వంటి వాటిల్లో చదివిన యువతకు మంచి భవిష్యత్ ఉంటుందని చాలా మంది అభిప్రాయ పడుతుంటారు. అలానే అక్కడి నుంచి విద్యను పూర్తి చేసిన వారికి మంచి జీతం వస్తుంది. ఇలా ఎంతో మంది పెద్ద ప్యాకేజీతో తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. అలాంటి వారికి ధీటుగా ఓ సాధారణ వ్యక్తి పోటీ పడుతున్నాడు. ఆయన చదివింది కేవలం 8వ తరగతి మాత్రమే..కానీ ఆదాయం మాత్రం ఐఐటీ, ఐఐఏం చదివిన వారికి పోటీగా సంపాదిస్తున్నారు. ఏడాదికి రూ.1.50 కోట్ల ఆదాయాన్ని అర్జిస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారు. ఆయన గుజరాత్ కు చెందిన ధర్మేశ్ భాయ్. మరి.. ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా అమ్రాపూర్ గ్రామానికి చెందిన ధర్మేష్ భాయ్ అనే  వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఆయన 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. తనకు వ్యవసాయంపై బాగా ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే చదువును మానేసి వ్యవసాయంపై తన దృష్టిని సారించాడు. తనకు ఉన్న 20 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. ఎంతో నిబద్ధత పని చేసిన ధర్మేష్ భాయ్ వ్యవసాయంలో అద్భుతమైన విజయాన్ని సాధించాడు. అతను 20ఏకరాల భూమిలో మిర్చి సాగు చేసి గణనీయమైన దిగుబడిని పొందాడు. వ్యవసాయంపై తనకు తెలిసిన నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ మిరప పంటను సాగు చేశాడు. అంతేకాక తానే మిరప పొడిని ప్రాసెస్ చేస్తాడు.

అనంతరం ఈ మిర్చి పౌడర్ ను తానే స్వయంగా విక్రయించేవాడు. దీని ఫలితంగా అతని వ్యవసాయ ద్వారా రూ. 1.50 కోట్ల ఆదాయాన్ని పొందాడు. ఈ ఏడాది అన్ని ఖర్చులు పోనూ రూ.90 లక్షల వరకు సంపాందిచాడు.  ధర్మేశ్ తనకున్న 20 ఎకరాల్లో కశ్మీరీ మిర్చి సాగు మొదలు పెట్టారు. వినూత్న సాగు పద్ధతులతో ఏడాదికి 60 వేల కిలోల దిగుబడిన సాధిస్తున్నారు.  దిగుబడిని పొడిగా ప్రాసెస్ చేసి ప్రపంచ మార్కెట్లోకి నేరుగా ఎగుమతి చేస్తున్నారు. ఫలితంగా ఏటా రూ.1.50 కోట్ల ఆదాయాన్ని పొందుతున్నాడు. ఇలా చదువుతోనే కాక వ్యవసాయంతో కూడా భారీ ఆదాయంతో సంపాదించవచ్చని ఆయన నిరూపించాడు. అంతేకాక ఉద్యోగంలేదు, మంచి జీతం లేదని నిరుత్సాహంతో ఉండే యువతకు ధర్మశ్ భాయ్ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఈ వ్యక్తి ఎనిమిదో తరగతి మాత్రమే చదినప్పటికీ, అనేక మంది ఐఐటీ గ్రాడ్యుయేట్‌లను అధిగమించి సంపాదిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. అంకితభావం, వినూత్న వ్యవసాయ పద్ధతుల ద్వారా, అతను తన పొలం నుండి రూ. 90 లక్షల వరకు వార్షిక నికర పొదుపును సాధించాననని అతడు తెలిపాడు. అన్ని ఖర్చులను పోనూ రూ.1.50 కోట్లను అర్జీస్తున్నట్లు ఆయన తెలిపారు. తన 20 ఎకరాల భూమిలో ప్రతి సంవత్సరం సుమారు 60 వేల కిలోల మిర్చి దిగుబడి వస్తుందని అతను తెలిపాడు. ధర్మేష్ ఆదాయాన్ని అంచనా వేసినట్లయితే.. రిటైల్ మార్కెట్‌లో నాణ్యమైన మిర్చికారం కిలోకు రూ.500 నుండి రూ.600 వరకు ఉంది. అదే ధర్మేష్ హోల్‌సేల్ మార్కెట్‌లో కిలోకు రూ. 250 చొప్పున విక్రయిస్తున్నాడు. మొత్తం ఆదాయం 60 వేల నుండి కిలో మిర్చి సుమారు రూ.1.5 కోట్లు ఆదాయం పొందుతున్నారు. మరి.. పెద్ద పెద్ద చదువులు చదువుకుని జాబు రాలేదని, పెద్ద జీతం లేదని బాధపడే వారు..ధర్మేశ్ భాయ్ ను ఆదర్శంగా తీసుకోవాలి. మరి.. ఈ రైతు సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.