వీడియో: కోర్టు హాలులో రచ్చ.. లాయర్లపై లాఠీచార్జీ!

Ghaziabad Court: న్యాయాన్ని కాపాడాల్సిన లాయర్లపై పోలీసులు లాఠీచార్జీ చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. ఒక చిన్న కేసు విషయంలో జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానగా మారడంతో ఈ సంఘటన జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

Ghaziabad Court: న్యాయాన్ని కాపాడాల్సిన లాయర్లపై పోలీసులు లాఠీచార్జీ చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. ఒక చిన్న కేసు విషయంలో జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానగా మారడంతో ఈ సంఘటన జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

సమాజంలో న్యాయస్థానాలు, లా అండ్ ఆర్డర్ ని కాపాడటంలో పోలీసులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అలాంటి గౌరవ ప్రదమైన న్యాయస్థానంలో లాయర్లు, జడ్జీ గొడవకు దిగారు. వీరిని అదుపు చేయడానికి పోలీసులు లాయర్లపై లాఠీ ఝులిపించారు. దీంతో పది మంది లాయర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన యూపీలోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో చోటు చేసుకుంది. లాయర్లపై పోలీసులు జరిపిన లాఠీ ఛార్జీకి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో మంగళవారం (అక్టోబర్ 29) లాయర్లపై పోలీసులు లాఠీ ఛార్జి చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో పది మంది న్యాయవాదులకు తీవ్ర గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి. జిల్లా సెసెన్స్ జడ్జీ అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రాసిక్యూషన్ ప్రత్యేక విచారణ కొరకు కేసు విచారణ సందర్భంగా లాయర్లకు జడ్జీకి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త మాటల యుద్దానికి దారి తీయడంతో జిల్లా జడ్జీ కోర్టు ఆవరణలోనే పోలీసులను పిలిచారు. వెంటనే లాయర్లను అక్కడ నుంచి పంపించాలని పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలోనే లాయర్లకు బయటకు వెళ్లాల్సిందిగా పోలీసులు కోరారు.  దానికి వారు వ్యతిరేకించడంతో బయటకు పంపించే క్రమంలో వారిపై లాఠీఛార్జీ చేశారు. కోర్టు గదిలోనే లాయర్లను కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ ఘటన తర్వాత బార్ అసోసియేషన్ లాయర్లు సమావేశానికి పిలుపునిచ్చినట్లు సమాచారం. ఈ సమావేశం తర్వాత న్యాయవాదులు తదుపరి వ్యూహాన్ని పరిశీలిస్తామని తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. కోర్టులో లాయర్లపై పోలీసులు లాఠీఛార్జి చేసినపుడు కొంతమంది కుర్చీల నుంచి లేపి మరీ కొట్టారు. ఆ సమయంలో ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకుంది.. కుర్చీలు ఎత్తి విసిరేశారు. ఘజియాబాద్ జిల్లా కోర్టు గదిలో న్యాయవాదులను కొట్టిన కేసు ఇప్పుడు పోలీసులు, జడ్జీ, లాయర్ల మధ్య వ్యహారంగా మారింది. లాయర్లపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం ఇదేం కొత్త కాదు. గతంలో పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి.

Show comments