iDreamPost
android-app
ios-app

మోసగాడి ట్రాప్ లో లేడీ పోలీస్ ఆఫీసర్.. అసలేం జరిగిందంట?

  • Published Feb 12, 2024 | 3:14 PM Updated Updated Feb 12, 2024 | 3:14 PM

Police Arrests Former Fake IRS: కొన్నిసార్లు కేటుగాళ్ల ట్రాప్ లో సామాన్యులే కాదు.. అధికారులు సైతం ఘోరంగా మోసపోతారు. యూపీకి చెందిన ఓ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ కేటుగాడి ట్రాప్‌లో పడి మోసపోయింది.

Police Arrests Former Fake IRS: కొన్నిసార్లు కేటుగాళ్ల ట్రాప్ లో సామాన్యులే కాదు.. అధికారులు సైతం ఘోరంగా మోసపోతారు. యూపీకి చెందిన ఓ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ కేటుగాడి ట్రాప్‌లో పడి మోసపోయింది.

మోసగాడి ట్రాప్ లో లేడీ పోలీస్ ఆఫీసర్.. అసలేం జరిగిందంట?

ఉత్తర్ ప్రదేశ్ లో మహిళా ఐపీఎస్ పోలీస్ అధికారి. నేరస్థులకు ఆమె సింహస్వప్నంలా ఉండేది.. ఆమె పేరు చెబితే గుండాలకు, రౌడీలకు వెన్నుల్లో వణుకు పుట్టేది. అందుకే ఆమెను అభిమానులు లేడీ సింగం అని పిలిచేవారు. డ్యూటీలో ఉంటే ఆమె ఎంతో కఠినంగా ఉండేవారు. ఎలాంటి పొలిటికల్ ఒత్తిడి వచ్చినా.. ఏమాత్రం భయం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటుంది.  సినిమాల్లో చూపించే ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారో.. అచ్చం అలా ఉంటుంది. అలాంటి ఉన్నతాధికారి ఒక కేటుగాడి చేతిలో దారుణంగా మోసపోయింది. ఇంతకీ ఆ లేడీ ఐపీఎస్ అధికారి ఎవరు..? ఎలా మోసపోయిందీ? అనే విషయం గురించి తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ 2012 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ శ్రేష్ట ఠాకూర్.. ఘజియాబాద్ లో డీఎస్పీగా పనిచేస్తున్నారు. డ్యూటీలో ఆమె ఎంతో స్ట్రిక్ట్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. మాఫియా నేరస్థుల విషయంలో యూపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల వరుసగా మాఫియా డాన్లను ఏరిపడేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గించేందుకు  బుల్‌డోజర్‌ చర్యలను కొనసాగిస్తున్నారు.. అంటే నేరాలు చేసిన వారికి సంబంధించిన స్థిరాస్తులను బుల్డోజర్ తో ధ్వంసం చేయడం. దీంతో చాలా మంది నేరస్థులు తమ తప్పులు ఒప్పుకొని పోలీసులకు సరెండర్ అవుతున్నారు. ఇక ఘజియాబాద్ లో డీఎస్పీగా శ్రేష్ట ఠాకూర్ కూడా నేరస్థుల విషయంలో కఠినంగా ఉంటూ.. నేరాల సంఖ్య చాలా వరకు తగ్గించారని టాక్.

ఎంత గొప్ప వారైనా.. చిన్న చిన్న విషయాల్లో పొరపాటు చేస్తుంటారని అంటారు. శ్రేష్ట ఠాకూర్ అంత ఉన్నతవిద్యావంతురాలైనప్పటికీ ఓ విచిత్రమైన పరిస్థితిలో కేటుగాడి వలలో చిక్కుకున్నారు. ఓ మాట్రిమోనియాల్ వెబ్ సైట్ లో రోహిత్ రాజ్ అనే వ్యక్తిని చూసి ఇష్టపడ్డారు. తాను 2008 బ్యాచ్ కి చెందిన ఐఆర్ఎష్ అని.. రాంచీలో డిప్యూటీ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నా అంటూ చెప్పాడు. రోహిత్ రాజ్ చెప్పినవన్నీ నమ్మి శ్రేష్ట ఠాకూర్ 2018లో అతన్ని వివాహం చేసుకుంది. పెళ్లయిన కొన్నాళ్లకే తన భర్త మోసగాడని, తాను దారుణంగా మోసపోయానని గ్రహించింది. వాస్తవానికి రాంచీలో రోహిత్ రాజ్ అనే ఐఆర్ఎస్ అధికారి ఉన్నారు.. కానీ ఆయన శ్రేష్ట భర్త కాదు. ఇటీవల రోహిత్ రాజ్.. తన భార్య శ్రేష్ట పేరు చెప్పుకొని దందాలు చేయడం మొదలు పెట్టాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న ఆమె ఘజియాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్న అరెస్ట్ చేశారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.