iDreamPost
android-app
ios-app

APలో వారికి శుభవార్త.. ఒక్కొక్కరి అకౌంట్ లో రూ.30 వేలు జమ

  • Published Dec 11, 2023 | 8:23 AMUpdated Dec 11, 2023 | 8:23 AM

అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దీనిలో భాగంగా నేడు కొందరి ఖాతాల్లో రూ.30 వేలు జమ చేయనున్నారు. ఆ వివరాలు..

అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దీనిలో భాగంగా నేడు కొందరి ఖాతాల్లో రూ.30 వేలు జమ చేయనున్నారు. ఆ వివరాలు..

  • Published Dec 11, 2023 | 8:23 AMUpdated Dec 11, 2023 | 8:23 AM
APలో వారికి శుభవార్త.. ఒక్కొక్కరి అకౌంట్ లో రూ.30 వేలు జమ

దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలతో.. ప్రజలను, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలా.. వారు జీవితంలో ముందుకు వెళ్లేలా సాయం చేస్తున్నారు. డబ్బుల్లేక విద్యార్థులు ఎవరూ చదువు దూరం కాకుడదనే ఉద్దేశంతో.. వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. పిల్లలను బడికి పంపడం కోసం తల్లుల ఖాతాలో నగదు జమ చేస్తున్నారు. స్కూల్ నుంచి.. పీజీ వరకు మాత్రమే కాక.. విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు కూడా ఆర్థిక సాయం చేస్తూ.. వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో శుభవార్త చెప్పారు సీఎం జగన్. నేడు వారి ఖాతాల్లో 30 వేలు జమ చేయనున్నారు. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువ లాయర్లకు శుభవార్త చెప్పింది. వారికి అందించే వైఎస్సార్ లా నేస్తం నిధులు ఇవాళ విడుదల చేయనున్నారు. ఈ మేరకు సీఎం జగన్.. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. దీని ద్వారా 2,807 మంది యువ న్యాయవాదుల ఖాతాలో రూ.7 కోట్ల 98 లక్షలను జమ చేయనున్నారు.

కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా వారికి 3 ఏళ్ల పాటు వైఎస్సార్ లా నేస్థం కింద.. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60,000 చొప్పున రెండు దఫాల్లోప్రభుత్వం చెల్లిస్తోన్న సంగతి తెలిసిందే. మూడేళ్లకు గాను మొత్తం మొత్తం రూ.1,80,000 స్టైఫండ్ అందిస్తుంది. నెలకు 5 వేలు చొప్పున జులై నుంచి డిసెంబర్ వరకు.. 6 నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ.30వేల వరకు ఇస్తుంది ప్రభుత్వం. నేడు విడుదల చేసే మొత్తంతో కలిపి ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో మొత్తంగా రూ. 49.51 కోట్లు విడుదల చేసినట్లు అవుతుంది.

ఎవరు అర్హుల అంటే..

  • వైఎస్సార్ లా నేస్తం కింద సాయం పొందాలనుకునే వారు న్యాయశాస్త్రంలో పట్టా పొంది ఉండటంతో పాటుగా ఏపీ న్యాయవాదుల మండలిలో పేరు నమోదు చేసుకొని ఉండాలి.
  • జీవో జారీ చేసే నాటికి న్యాయవాదికి 35 ఏళ్ల వయస్సు మించకూడదు.
  • లాయర్‌గా పేరు నమోదు చేసుకున్న ఎన్‌రోల్‌మెంట్ ధ్రువపత్రాన్ని పరిగణలోకి తీసుకొని మొదటి మూడేళ్లను లెక్కిస్తారు.
  • జీవో జారీ చేసే నాటికి జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించి మూడేళ్లు పూర్తి కాని వారు.. మిగిలిన కాలానికి మాత్రమే స్టైఫండ్ పొందుతారు.
  • ఒక కుటుంబంలో ఒకరికే ఈ సాయం ఉంటుంది.
  • నాన్ ప్రాక్టీస్ లాయర్లు, మూడేళ్ల ప్రాక్టీస్ పూర్తి చేసినవారు, ఫోర్ వీలర్ కలిగిన వారు, న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకొని, న్యాయవాదిగా, ప్రాక్టీస్ చేయకుండా ఇతర ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న వారు కూడా అనర్హులు.

ఎలా అప్లై చేసుకోవాలి..

  • వైఎస్సార్ లా నేస్తం పథకం కింద ఆర్థిక సాయం కోరే అడ్వకేట్స్ ఆన్ లైన్‌లో mailto:sec_law@ap.gov.in ద్వారా లేదా నేరుగా లా సెక్రటరీకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
  • దరఖాస్తుతో పాటు ఆధార్ నెంబర్ జత చేయాల్సి ఉంటుంది.
  • స్టైఫండ్ ఏ బ్యాంకు ఖాతాలో జమ కావాలో ఆ అకౌంట్ నెంబర్ వివరాలు ఇవ్వాలి.. వీటిని గ్రామ/వార్డు వాలంటీర్లకు పంపిస్తారు.
  • దరఖాస్తు సరైనదే అని తేలితో దానిని పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు.. జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు.
  • కలెక్టర్ల ఆమోదం పొందిన అనంతరం ఆ దరఖాస్తును మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలు సీఎఫ్ఎంఎస్ లో అప్ లోడ్ చేస్తారు.

సెలక్షన్ ప్రాసెస్ ఇది..

  • సోషల్ ఆడిట్ కోసం ఆ దరఖాస్తును గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.
  • ఆ తర్వాత అర్హులైన వారి అకౌంట్లలో సొమ్మును జమ చేస్తారు.
  • గ్రామ లేదా వార్డు వాలంటీర్లు స్టైఫండ్ చెల్లింపు రసీదును లబ్ధిదారు ఇంటికి తీసుకెళ్లి వారికి అందజేస్తారు.
  • దరఖాస్తుదారు తాను ఇంకా ప్రాక్టీస్‌లోనే ఉన్నానని పదిహేనేళ్ల అనుభవం కలిగిన సీనియర్ న్యాయవాది లేదా సంబంధిత బార్ అసోసియేషన్ లేదా సంబంధిత కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ల నుంచి అఫిడవిట్‌ సమర్పించాల్సి ఉంటుంది.
  • న్యాయవాదిగా నమోదైన తర్వాత బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, రెండేళ్ల లోపు సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్‌ను సమర్పించాలి.
  • వైఎస్సార్ లా నేస్తం పథకానికి సంబంధించి ఏ రకమైన ఇబ్బందులున్నా 1902 ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి