iDreamPost
android-app
ios-app

ఈ మహిళ కోసం పోలీసులు వెతుకుతున్నారు!.. ఎందుకంటే?

UP Woman Dance: రీల్స్ మోజులో పడి ప్రమాదాలు కొనితెచ్చుకోవడమే కాక ఇతరులకు కూడా ఇబ్బందిగా మారుతున్నారు. ఇదే రీతిలో ఓ మహిళ రోడ్డుపై డ్యాన్స్ చేసింది. ఈమె కోసం పోలీసులు వెతుకుతున్నారు.

UP Woman Dance: రీల్స్ మోజులో పడి ప్రమాదాలు కొనితెచ్చుకోవడమే కాక ఇతరులకు కూడా ఇబ్బందిగా మారుతున్నారు. ఇదే రీతిలో ఓ మహిళ రోడ్డుపై డ్యాన్స్ చేసింది. ఈమె కోసం పోలీసులు వెతుకుతున్నారు.

ఈ మహిళ కోసం పోలీసులు వెతుకుతున్నారు!.. ఎందుకంటే?

సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు సైతం సెలబ్రిటీలు అయిపోతున్నారు. తమ ట్యాలెంట్ తో ఓవర్ నైట్ స్టార్స్ గా మారిన వాళ్లు కూడా ఉన్నారు. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడం ఇంటర్నెట్ వినియోగం పెరగడం సోషల్ మీడియా యప్స్ యూజ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. రక రకాల విన్యాసాలతో సామాజిక మాధ్యమాల్లో నానా రచ్చ చేస్తున్నారు. లైకులు, కామెంట్ల కోసం పిచ్చి పిచ్చిగా రీల్స్, వీడియోలు తీస్తూన్నారు. ఫాలో వర్స్ ను పెంచుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై ప్రమాదకరంగా డ్యాన్స్ చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించింది. ఈమె కోసం పోలీసులు వెతుకుతున్నారు.

సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ప్రమాదకర స్థితిలో స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. వైరల్ గా మారేందుకు భవనంపై నుంచి వేలాడుతూ.. నడిరోడ్డుపై డ్యాన్స్ లు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో రీల్స్ చేస్తున్నామో అన్న సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇదే రీతిలో యూపీలో ఓ మహిళ వర్షం పడుతుండగా నడి రోడ్డుపై డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వర్షంలో తడుస్తూ నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిందో మహిళ. వేగంగా వాహనాలు వస్తున్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా డ్యాన్స్ చేసింది. ప్రమాదం అని తెలిసి కూడా పిచ్చిగా ప్రవర్తించింది. మొదట కారు నుంచి దిగిన ఆ మహిళ ఆ తర్వాత దానిపైకి ఎక్కింది. ఆ తర్వాత కారు నుంచి కిందకు దూకి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. అటుగా వెళ్తున్నవారు ఈ తతంగాన్నంత తమ సెల్ ఫోన్లలో బంధించారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియోపై స్పందించిన పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఆమె కారు నంబరును పంపాలని కోరారు. ఆమెపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.