iDreamPost
android-app
ios-app

లాయర్లకు CM రేవంత్ శుభవార్త.. వారి కోసం ఏకంగా రూ. 100 కోట్లు

  • Published May 12, 2024 | 2:26 PMUpdated May 12, 2024 | 2:26 PM

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలోని న్యాయవాదులకు గుడ్ న్యూస్ చెప్పారు. వారి సంక్షేమానికిక కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆ వివరాలు..

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలోని న్యాయవాదులకు గుడ్ న్యూస్ చెప్పారు. వారి సంక్షేమానికిక కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆ వివరాలు..

  • Published May 12, 2024 | 2:26 PMUpdated May 12, 2024 | 2:26 PM
లాయర్లకు CM రేవంత్ శుభవార్త.. వారి కోసం ఏకంగా రూ. 100 కోట్లు

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. సంచలన నిర్ణయాలతో పాలనలో దూకుడుగా ముందుకు సాగతున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చేప్తున్నారు. అలానే గత ప్రభుత్వంలో చేసిన అవినీతి, స్కాములను కూడా వెలుగులోకి తీసుకొస్తున్నారు. మొత్తానికి సంచలన నిర్ణయాలతో రాష్ట్ర ప్రజల చేత డైనమిక్ సీఎంగా పిలుపించుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సమాజంలోని అన్ని వర్గాల వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా లాయర్లకు శుభవార్త చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ వివరాలు..

తెలంగాణలోని న్యాయవాదులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. న్యాయవాదుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన సీఎం రేవంత్.. వారి కోసం రూ. 100 కోట్ల నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తమకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌కు అవసరమైన నిధులు కేటాయించాలని బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు శనివారం సీఎం రేవంత్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం న్యాయవాదుల సంఖ్య ఇప్పుడు బాగా పెరిగిందని తెలిపారు. అందుకు తగినట్లుగా ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు.

న్యాయవాదుల విజ్ఞప్తిపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. న్యాయవాదుల ఆరోగ్య బీమా నిమిత్తం త్వరలోనే నిధులు విడుదల చేస్తామని వారికి హామీ ఇచ్చారు. న్యాయవాద వృత్తి పట్ల తనకు ఎంతో గౌరవముందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం సమాజంలోని అని వర్గాల వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని దానిలో భాగంగానే న్యాయవాదుల సంక్షేమానికి కూడా కృషి చేస్తామని తెలిపారు. అంతేకాక త్వరలోనే న్యాయవాదుల సంక్షేమ సంఘానికి రూ.100 కోట్లు విడుదల చేస్తామని పేర్కొన్నారు. సీఎం హామీ పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి