P Venkatesh
చైనా స్మగ్లింగ్ కు తెరలేపింది. భారతీయుల కేశాలను స్మగ్లింగ్ చేస్తూ వేల కోట్లు కొల్లగొడుతోంది. ఇటీవల రూ. 12 వేల కోట్లు విలువ చేసే కేశాలు సరిహద్దు భద్రతా దళాలు పట్టుకున్నాయి. ఈ కేసులో ఈడీ సంచలన విషయాలు వెల్లడించింది.
చైనా స్మగ్లింగ్ కు తెరలేపింది. భారతీయుల కేశాలను స్మగ్లింగ్ చేస్తూ వేల కోట్లు కొల్లగొడుతోంది. ఇటీవల రూ. 12 వేల కోట్లు విలువ చేసే కేశాలు సరిహద్దు భద్రతా దళాలు పట్టుకున్నాయి. ఈ కేసులో ఈడీ సంచలన విషయాలు వెల్లడించింది.
P Venkatesh
వరల్డ్ వైడ్ గా తల వెంట్రుకల వ్యాపారం కోట్లల్లో సాగుతోంది. వెంట్రుకలతో వ్యాపారం చేసేవాళ్లు చాలా మందే ఉన్నారు. కేశాల వ్యాపారంతో కోట్లు కొల్లగొడుతున్నారు. జుట్టు నాణ్యతను బట్టి, పొడవును బట్టి ధర పెరుగుతోంది. భారత్ నుంచి విదేశాలకు జుట్టు ఎగుమతి అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కేశాలను సేకరించే వారి నుంచి వ్యాపారులు కొనుగోలు చేస్తారు. అదే విధంగా దేవాలయాల్లో భక్తులు సమర్పించుకున్న తలనీలాలు సైతం విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. భారతీయుల కేశాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంటుంది. కాగా ఈ కేశాలు విగ్గుల తయారీ, హెయిర్ ప్లాంటేషన్ లో వినియోగిస్తారు. కాగా శత్రు దేశం చైనా ఇప్పుడు భారత్ నుంచి వెంట్రుకలను స్మగ్లింగ్ చేస్తూ వేల కోట్లు కొల్లగొడుతోంది. ఇటీవల 12 వేల కోట్లు విలువ చేసే కేశాలను సరిహద్దు భద్రతా దళాలు పట్టుకున్నాయి.
ప్రపంచ దేశాలతో కయ్యానికి కాలు దువ్వే చైనా ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తుంది. తనకు కావాల్సినవి అక్రమ మార్గంలో పొందుతోంది. ఇది వరకు ఆఫ్రికా దేశాల నుంచి గాడిదలను స్మగ్లింగ్ చేసిన చైనా ఇప్పుడు భారతీయుల వెంట్రుకలను స్మగ్లింగ్ చేస్తోంది. కొంతమందికి డబ్బు ఆశ చూపి తమ ఏజెంట్లుగా మార్చుకుని ఈ అక్రమాలకు తెరలేపుతోంది.విదేశాల నుంచి వస్తున్న అక్రమ లావాదేవీలపై కన్నేసిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణలో కేశాల స్మగ్లింగ్ వెలుగు చూసింది.
డ్రాగన్ కంట్రీ స్మగ్లింగ్ కు కాదేది అనర్హం అంటుంది. భారీ పరిశ్రమలు, విపరీతమైన జనాభా ఉన్న దేశానికి సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతోంది. కప్పల నుంచి గాడిదల వరకు ఆఖరికి కేశాలను కూడా స్మగ్లింగ్ చేస్తుంది చైనా. ప్రపంచ దేశాల నుంచి వీటిని దొంగతనం చేస్తోంది. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న కేశాలను అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశం చైనానే. ఇప్పుడు భారతీయుల వెంట్రుకలను అక్రమంగా స్మగ్లింగ్ చేస్తోంది. ఈ క్రమంలోనే రూ. 12 వేల కోట్లు విలువ చేసే కేశాలు పట్టుబడ్డాయి. అంటే ఇది వరకు ఎన్ని కోట్ల విలువైన కేశాలను స్మగ్లింగ్ చేసి ఉంటుందని సందేహాలు వ్యక్త మవుతున్నాయి.
వెంట్రుకల స్మగ్లింగ్ కేసుపై ఈడీ విచారణ చేపట్టింది. మనీలాండరింగ్ కేసులను చేధించే ఈ సంస్థ విదేశాల నుంచి వస్తున్న అక్రమ నిధులపై విచారణ జరుపుతున్న ఈడీకి ఈ కేశాల స్మగ్లింగ్ గుట్టు తెలిసింది. ఈ కేశాల విలువ వందల కోట్ల రూపాయల్లో ఉంటున్నట్లు తేలింది. కొంత కాలంగా ఈ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు ఈడీ గుర్తించింది. భారతీయుల వెంట్రుకలు నాణ్యత కలిగి ఉండడంతో చీప్ గా కొట్టేసేందుకు చైనా స్మగ్లింగ్ కు తెరలేపింది. చైనాలో యువతకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంతో విగ్గులను తయారు చేసేందుకు, హెయిర్ ప్లాంటేషన్ కోసం వినియోగించేందుకు మానవ కేశాలను స్మగ్లింగ్ చేస్తోంది.